విను చక్రవర్తి (డిసెంబరు 15, 1945 – 27 ఏప్రిల్ 2017)[2] తమిళ సినిమా నటుడు, సినీ రచయిత, దర్శకుడు. ఆయన సుమారు 1000 తమిళ, తెలుగు, కన్నడ, బడగ, మలయాళ చిత్రాలలొ నటించాడు. ఆయన ఎక్కువగా హాస్యనటునిగా, సహాయనటునిగా లేదా ప్రతినాయకునిగా సినిమాలలో నటించాడు. ఆయన తమిళంలో నటించిన "ముని" చిత్రం ఆయన 1000వ చిత్రం.[3] ఆయన గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో హాస్పటల్ లో ఉన్నారు. [4]

విను చక్రవర్తి
విను చక్రవర్తి
జననం(1945-12-15)1945 డిసెంబరు 15 [1]
ఉసిలాంపట్టి,
మద్రాసు ప్రెసిడెన్సీ
మధురై జిల్లా,
బ్రిటిష్ ఇండియా
మరణం2017 ఏప్రిల్ 27(2017-04-27) (వయసు 71)
చెన్నై, తమిళనాడు
వృత్తిసినిమానటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1977-2017

ప్రారభ జీవితం, విద్య

మార్చు

చక్రవర్తి తమిళనాడు రాష్ట్రంలోని "ఉసిలాంపట్టి" గ్రామంలో ఆదిమూల తేవార్, మంజువాణి అమ్మాల్ దంపతులకు డిసెంబర్ 15 1945 న జన్మించాడు. రోయపెట్ట ప్రాంతం లోని వెస్ట్‌లీ పాఠశాలలో చదివాడు. తరువాత కామర్స్ లో పట్టాను ఎ.ఎం. జైన్ కళాశాల నుండి పొందారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. ఆయన వారిలో అందరికన్నా పెద్దవాడు.

జీవితం

మార్చు

విద్య పూర్తి చేసిన తదుపరి ఆయన ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ లో రిజర్వ్ సబ్-ఇనస్పెక్టరుగా భాద్యతలు ఆరు మాసాల పాటు చేపట్టాడు. తరువాత ఆయన దక్షిణ రైల్వే లలో నాలుగు సంవత్సరాల పాటు ఉద్యోగాన్ని చేసాడు. ఆయన కన్నడ సినిమా దర్శకుడైన "పుట్టన్న కనగాల్" కు కథా రచయితగా పనిచేసాడు. అపుడు ప్రముఖ నిర్మాత తిరుప్పూర్ మణి దృష్టిలో పడ్డాడు. ఆయన 1977లో చక్రవర్తికి కన్నడ చిత్రం "పరసంగడ గెండెటిమ్మా" చిత్రంలో నటించడానికి అవకాశం యిచ్చాడు. ఆ చిత్రం తమిళంలో పునర్మింపబదింది. అప్పటి నుండి ఆయన సుమారు 1000 దక్షిణభారత చిత్రాలలో నటించాడు. వాటిలో 900 తమిళ చిత్రాలు, 30 మలయాళ చిత్రాలు, 5 తెలుగు చిత్రాలు, ఒక బడగ భాషా చిత్రం. ఆయన స్వంతంగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన ప్రముఖ నటి సిల్క్ స్మిత ను వెండితెరకు పరిచయం చేసాడు.[5] జెమినీ గణేషన్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రనటుల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

సినిమాలు

మార్చు

ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

వివాదాలు

మార్చు

ఆయన ప్రముఖ టెలివిజన్, సినిమా నిర్మాత "ఏక్తా కపూర్" ను "ద డర్టీ పిక్చర్" లో సిల్క్ స్మిత చిత్రీకరణకు గానూ విమర్శించాడు. ఆ చిత్రం సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా నిర్మింపబడినది. ఆయన సిల్క్ స్మిత పాత్రధారిని నిర్మాత ఏక్తా కపూర్ ఎన్నుకోవడంలో అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఆయన సిల్క్ స్మిత విస్తృతమైన భావనను, ఆహ్వానిస్తున్న కళ్ళను కలిగి ఉంటుండని, విద్యాబాలన్ అలా చేయలేదని తెలిపాడు.[5]

నోట్సు

మార్చు
  1. "Profile of Vinu Chakravarthy". lakshmanshruthi.com. Archived from the original on 2017-05-05. Retrieved 2017-04-29.
  2. "Actor Vinu Chakravarthy Passed away". Archived from the original on 2017-04-28. Retrieved 2017-04-29.
  3. http://www.ibtimes.co.in/multilingual-actor-vinu-chakravarthy-passes-away-724618
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-04-28. Retrieved 2017-04-29.
  5. 5.0 5.1 Vicky Lalwani (February 21, 2011). "Ekta slams Silk Smitha's boyfriend". Archived from the original on 2012-05-27. Retrieved 2017-04-29.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో విను చక్రవర్తి పేజీ