వివినమూర్తి

తెలుగు రచయిత

వివినమూర్తిగా సాహిత్యప్రపంచానికి పరిచయమున్న ఇతని పూర్తి పేరు వోలేటి వెంకట నరసింహమూర్తి.

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1948, మే 21వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, కిర్లంపూడి మండలం, సఖుమళ్ల తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు. రాజమండ్రి, కాకినాడలలో విద్యాభ్యాసం జరిగింది. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగుళూరులలో ప్రభుత్వోద్యోగం చేసి ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడ్డాడు.

రచనలుసవరించు

ఇతని రచనలు విపుల, నవ్య, జ్యోతి, అరుణతార, ఆంధ్రజ్యోతి, రచన, ప్రజాతంత్ర, స్వాతి, చతుర, ఆంధ్రభూమి, నివేదిత, ఆంధ్రప్రభ, ఆహ్వానం, సాహిత్యనేత్రం, చినుకు, అన్వేషణ, భారతి, విశాలాంధ్ర, పత్రిక, ఉదయం, ఈభూమి, ప్రస్థానం, తెలుగు అమెరికా మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి.

నవలలుసవరించు

 1. వ్యాపార బంధాలు
 2. హంసగీతం

కథా సంపుటాలు/సంకలనాలుసవరించు

 1. కథా తరంగాలు
 2. కథాప్రహేళిక కథలు
 3. జగన్నాటకం
 4. తీర్థపురాళ్లు
 5. దిశ
 6. ప్రవాహం
 7. వాల్‌పేపర్
 8. దిద్దుబాటలు (సంపాదకత్వం)

అనువాదాలుసవరించు

 1. చెప్పులు కుడుతూ... కుడుతూ...(మూలం: ఎమ్మా రొషాంబు క్లౌ)

పురస్కారాలుసవరించు

 • 2002లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు[1].

మూలాలుసవరించు

 1. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in: |date= (help)