తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాషా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాల్లో ఏటా ఒక రంగం నుంచి విశిష్ట వ్యక్తికి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందజేస్తుంది.

విశిష్ట పురస్కారాలు
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాషా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాలు
వ్యవస్థాపిత 1991
మొదటి బహూకరణ 1991
క్రితం బహూకరణ 2017
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 1,00,000

సుమారు మూడున్నర దశాబ్దాల కృషి ఉన్న విశిష్ట వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. 1991 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ.5116 నగదు, శాలువా, పురస్కారపత్రంతో ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు మార్చు

  1. 1991 - డా. బోయి భీమన్న (సాహిత్యం)
  2. 1992 - డా. కాపు రాజయ్య (లలిత కళలు - చిత్రలేఖనం)
  3. 1993 - డా. తిరుమల రామచంద్ర (సాంస్కృతిక రంగం)
  4. 1994 - డా. వాసిరెడ్డి సీతాదేవి (సాహిత్యం)
  5. 1995 - డా. పీసపాటి నరసింహమూర్తి (లలిత కళలు - నాటకరంగం)
  6. 1996 - బి.ఎన్. శాస్త్రి (సాంస్కృతిక రంగం)
  7. 1997 - డా. రావూరి భరద్వాజ (సాహిత్యం)
  8. 1998 - డా. నటరాజ రామకృష్ణ (లలితకళలు - నృత్యం)
  9. 1999 - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (సాంస్కృతిక రంగం)
  10. 2000 - డా. దాశరథి రంగాచార్య (సాహిత్యం)
  11. 2001 - డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ (లలితకళలు - సంగీతం)
  12. 2002 - డా. బాపు (సాంస్కృతిక రంగం)
  13. 2003 - ఉత్పల సత్యనారాయణాచార్య (సాహిత్యం)
  14. 2004 - డా. వెంపటి చినసత్యం (లలితకళలు - నృత్యం)
  15. 2005 - డా. నేరెళ్ళ వేణుమాధవ్ (సాంస్కృతిక రంగం)
  16. 2006 - ఆచార్య బిరుదురాజు రామరాజు (సాహిత్యం)
  17. 2007 - సి.ఎస్.ఎన్. పట్నాయక్ (లలితకళలు - శిల్పం, చిత్రలేఖనం)
  18. 2008 - డా. బాలాంత్రపు రజనీకాంత రావు (సాంస్కృతిక రంగం)
  19. 2009 - డా. జె. బాపురెడ్డి (సాహిత్యం)
  20. 2010 - రావు బాలసరస్వతీ దేవి (లలితకళలు - సంగీతం)
  21. 2011 - డా. సి. నారాయణరెడ్డి (సాంస్కృతిక రంగం)
  22. 2012 - ఆచార్య కొలకలూరి ఇనాక్ (సాహిత్యం)
  23. 2013 - డా. చుక్కా సత్తయ్య (లలితకళలు - ఒగ్గుకథ)
  24. 2014 - బి. నర్సింగరావు (సాంస్కృతిక రంగం)
  25. 2015 - నందిని సిధారెడ్డి (సాహిత్యం)[1][2]
  26. 2016 - భరత్‌భూషణ్‌ (లలితకళలు - ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం)[3]
  27. 2018 - కూరెళ్ల విఠలాచార్య (సాహిత్యం)[4][5]
  28. 2019 - కళాకృష్ణ (లలితకళలు - నృత్యం)[4][5]
  29. 2020 - డాక్ట‌ర్ ముదిగంటి సుజాతారెడ్డి[6]
  30. 2021 - వీఏకే రంగారావు[6]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ (24 November 2016). "నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం". Archived from the original on 14 జూలై 2020. Retrieved 4 May 2018.
  2. ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (3 December 2016). "నందిని సిధారెడ్డికి తెలుగు వర్సిటీ పురస్కారం". Retrieved 4 May 2018.[permanent dead link]
  3. నమస్తే తెలంగాణ (6 January 2018). "భరత్‌భూషణ్‌కు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం". Retrieved 4 May 2018.[permanent dead link]
  4. 4.0 4.1 ఈనాడు, ప్రధానాంశాలు (4 December 2021). "విఠలాచార్య, కళాకృష్ణలకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారాలు". EENADU. Archived from the original on 5 December 2021. Retrieved 7 December 2021.
  5. 5.0 5.1 నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 December 2021). "కూరెళ్ల విఠాలాచార్య, కళాకృష్ణకు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలు". Namasthe Telangana. Archived from the original on 4 December 2021. Retrieved 7 December 2021.
  6. 6.0 6.1 telugu, NT News (2022-12-02). "ఘనంగా తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం". www.ntnews.com. Archived from the original on 2022-12-03. Retrieved 2022-12-06.