వోయెజర్ 2' 'Voyager 2 ఒక మానవరహిత అంతర్ గ్రహ అంతరిక్ష నౌక. దీనిని NASA అమెరికా వారు, 1977 ఆగస్టు 20 న ప్రవేశపెట్టారు. దీని సోదర ప్రాజెక్టు అయిన వోయెజర్ 1 తరువాత రంగంలోకి తెచ్చారు. ఇది సౌరమండలము లో విహరించి గ్రహాలను పరిశీలించి శోధించి, వాటి చిత్రాలను భూమి పైకి పంపింది. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ లను వాటి ఉపగ్రహాలను శోధించడానికి సంధించారు.[1]

వోయెజర్ 2
వోయెజర్ అంతరిక్ష నౌక నమూనా చిత్రం
సంస్థNASA
మిషన్ రకంFlyby
Flyby ofబృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్
లాంచ్ తేదీఆగస్టు 20, 1977
లాంచ్ వాహనంTitan III-E Centaur rocket
NSSDC ID1977-076A
హోమ్ పేజిNASA Voyager website
ద్రవ్యరాశి721.9 kg
సామర్థ్యం420 W

వోయెజర్ మిషన్ మార్చు

 
వోయెజర్ 2 1977, ఆగస్టు 20, టైటాన్ 3ఇ సెంటార్ రాకెట్ ద్వారా ప్రవేశపెట్టారు.

వోయెజర్ 2 వాస్తవంతా మరైనర్ ప్రోగ్రాం యొక్క భాగము. కానీ దీనిని టైటాన్ 3ఇ సెంటార్ రాకెట్ ద్వారా కేప్ కానవెరల్, ఫ్లోరిడా నుండి సంధించారు.

బృహస్పతి మార్చు

ఇది బృహస్పతి గ్రహానికి 5,70,000 కి.మీ. దగ్గరగా 1979, జూలై 9 న వచ్చింది. బృహస్పతి గ్రహాన్నీ, దీని చంద్రులనూ, చుట్టూ వున్న రింగులనూ శోధించింది. రెండు చిన్న ఉపగ్రహాలైన అడ్రస్తియా, మెటిస్ లు, దీని రింగులకు అతిదగ్గరగా సంచరించడాన్ని గమనించింది. ఓ మూడవ క్రొత్త ఉపగ్రహం థేబి ను కనుగొనింది.

శని మార్చు

శని గ్రహానికి దగ్గరగా ఆగస్టు 25, 1981 న సంచరించింది. ఆ తరువాత దీనిలో సాంకేతిక ఇబ్బందులు రావడం, శాస్త్రజ్ఞులు వాటిని సరిచేయడం, తదనంతరం యురేనస్, నెప్ట్యూన్ కొరకు యాత్ర సుగమమైంది.

యురేనస్ మార్చు

ఇది యురేనస్ కు 81,500 కి.మీ. దగ్గరగా జనవరి 24, 1986 న చేరింది. ఇంతకు మునుపు తెలియని 10 చంద్రుళ్ళను కనుగొనింది.

నెప్ట్యూన్ మార్చు

ఇది నెప్ట్యూన్ కు దగ్గరగా ఆగస్టు 25, 1989 న చేరింది.

2006 నుండి అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య ప్లూటో ను గ్రహంగా పరిగణించడం మాని మరుగుజ్జు గ్రహంగా పరిగణిస్తుండడం వల్ల వోయెజర్ 2, సౌరమండలములోని ప్రతి గ్రహాన్ని సందర్శించిన అంతరిక్ష నౌకగా ప్రసిద్ధికెక్కింది.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

నోట్స్ మార్చు

  1. Planetary Voyage NASA Jet Propulsion Laboratory - California Institute of Technology. 23 March 2004. Retrieved 8 April 2007.
  • "Saturn Science Results". Voyager Science Results at Saturn. Archived from the original on 2008-04-04. Retrieved 2008-03-30.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వోయెజర్_2&oldid=3820248" నుండి వెలికితీశారు