శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
(శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. నుండి దారిమార్పు చెందింది)
శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్ జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో 2004లో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సోనాలీ బెంద్రే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం హిందీలో సంజయ్ దత్ నటించిన మున్నాభాయి MBBS కి పునర్నిర్మాణం. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధించినది.ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.
శంకర్ దాదా MBBS (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జయంత్ సి. పరాంజీ |
---|---|
నిర్మాణం | అక్కినేని రవిశంకర్ ప్రసాద్ |
రచన | రాజకుమార్ హిరానీ (హిందీ మూలకథ) పరుచూరి సోదరులు (మాటలు) |
తారాగణం | చిరంజీవి, శ్రీకాంత్, సోనాలి బింద్రే |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | కె. దత్తు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
పంపిణీ | జెమిని ఫిల్మ్ సర్క్యూట్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- చిరంజీవి
- సోనాలి బెంద్రే
- శ్రీకాంత్
- పరేష్ రావల్
- గిరీష్ కర్నాడ్
- ఎం. ఎస్. నారాయణ
- వేణుమాధవ్
- ఆలీ
- ఆహుతి ప్రసాద్
- రోహిత్
- సూర్య
సంభాషణలు
మార్చు- రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం
- ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్
- వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్
విశేషాలు
మార్చు- ఈ చిత్రంలో చిరంజీవి తెలుగుసామెతలని ఆంగ్లంలోకి అనువదించటం ప్రత్యేక ఆకర్షణ (ఎంకీస్ మ్యారేజ్ సుబ్బిస్ డెత్ యానివర్సరీ, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకొడైల్ ఫెస్టివల్, వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్)
ఈ చిత్రంలోని పాటలు
మార్చు- బేగంపేట బుల్లెమ్మా, పంజాగుట్టా పిల్లమ్మా
- పట్టు పట్టు చేయే పట్టు (రచన: సాహితి గానం: మాణిక్య, సుమంగళి)
- నా పేరే కాంచనమాల (రచన: వేటూరి సుందరరామ్మూర్తి గానం: కార్తీ & మాలతి)- పాటలో హిందీ నటి గౌహర్ ఖాన్ నటించింది
- ఛైల ఛైలా ఛైలా ఛైలా, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా (రచన : దేవి శ్రీ ప్రసాద్ గానం: చిరంజీవి & కెకె)
- ఏ జిల్లా ఏ జిల్లా (రచన: చంద్రబోస్) గానం. అజనాన్ సామి, కల్పన