శరత్ మండవ

దక్షిణ భారత సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

శరత్ మండవ, దక్షిణ భారత సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన కో 2 అనే తమళ సినిమాకు దర్శకత్వం వహించాడు.[1] 2012లో అజిత్ కుమార్ హీరోగా వచ్చిన బిల్లా 2 సినిమాకు కథా, స్క్రీన్ ప్లే కథ రచయితగా పనిచేశాడు.[2] 2012 జూలై 13న డేవిడ్ బిల్లా పేరుతో విడుదలైన తెలుగు వెర్షన్ సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు.[3]

శరత్ మండవ
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం

జీవిత విషయాలు

మార్చు

శరత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో జన్మించాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ లోని ఐటిఎం యూనివర్సిటీలో, యునైటెడ్ స్టేట్స్ హాంప్‌షైర్ లోని సౌత్రెన్ న్యూ హాంప్‌షైర్ యూనివర్సీటీలలో చదుకున్నాడు.

సినిమారంగం

మార్చు

తన సాఫ్ట్‌వేర్ వృత్తిని విడిచిపెట్టి సినిమారంగానికి వచ్చిన శరత్ మండవ, లండన్ లోని ఫిల్మ్ స్కూల్, కెంట్ (యునైటెడ్ కింగ్‌డమ్) లోని స్ట్రెయిట్ కర్వ్ ఫిల్మ్ స్కూల్ లో స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు చేసాడు. ఆ తరువాత కొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్, సహ రచయితగా పనిచేశాడు. 2016లో వచ్చిన కో 2 అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగులో పోటుగాడు సినిమాతోపాటు కొన్ని తెలుగు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. 

సినిమాలు

మార్చు

దర్శకుడిగా

మార్చు
సంవత్సరం సినిమా నటులు భాష ఇతర వివరాలు
2016 కో 2 బాబీ సింహా, ప్రకాష్ రాజ్, నిక్కి గల్రానీ తమిళం 2016 ఉత్తమ చిత్రాలలో జాబితా చేయబడింది

రచయితగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2016 కో 2 అదనపు కథ, స్క్రీన్ ప్లే తమిళం
2012 బిల్లా 2 కథ, స్క్రీన్ ప్లే తమిళం నటించాడు
2012 డేవిడ్ బిల్లా తెలుగు వెర్షన్ డైలాగులు తెలుగు
2019 ఖమోషి డైలాగ్ రైటర్ హిందీ

సినిమాటోగ్రాఫర్‌గా

మార్చు
సంవత్సరం సినిమా నటులు భాష ఇతర వివరాలు
2016 తులసీదళం ఆర్‌పి పట్నాయక్, నికోల్ దేవా, వందన గుప్తా తెలుగు
2010 బ్రోకర్ శ్రీహరి, ఆర్‌పి పట్నాయక్ తెలుగు నంది అవార్డు వచ్చిన సినిమా

ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా

మార్చు
సంవత్సరం సినిమా నటులు భాష ఇతర వివరాలు
2019 ఎవడూ తక్కువ కాదు విక్రమ్ సాహిదేవ్ తెలుగు
2013 పోటుగాడు మంచు మనోజ్ కుమార్ తెలుగు

మూలాలు

మార్చు
  1. Vasudevan, K. V. (14 May 2016). "No debut blues" – via www.thehindu.com.
  2. "Review : (2012)". www.sify.com. Retrieved 14 December 2018.
  3. "Audio Release of Telugu Film David Billa". News 18. p. 1. Retrieved 10 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=శరత్_మండవ&oldid=3173920" నుండి వెలికితీశారు