బుచ్చిబాబు (రచయిత)

తెలుగు రచయిత
(శివరాజు వెంకట సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)

బుచ్చిబాబు (జూన్ 14, 1916 - సెప్టెంబర్ 20, 1967) గా పేరుపడిన ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు.

బుచ్చిబాబు
బుచ్చిబాబు
పుట్టిన తేదీ, స్థలంశివరాజు వెంకట సుబ్బారావు
జూన్ 14, 1916
మరణంసెప్టెంబర్ 20, 1967
వృత్తిరచయిత
పౌరసత్వంభారతీయుడు
విషయం
జీవిత భాగస్వామి
  • శివరాజు సుబ్బలక్ష్మి

జీవిత విశేషాలు

మార్చు

ఆయన ఏలూరులో శివరాజుసూర్య ప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు జూన్ 14, 1916 న జన్మించాడు. అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్, బి.ఏ. పట్టాలు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. 1937 చివరలో డిసెంబరు, మార్గశిర మాసంలో తూర్పుగోదావరి జిల్లా [[ఇప్పనపాడు ]] గ్రామానికి చెందిన ద్రోణంరాజు సూర్య ప్రకాశరావు గారి రెండవ కుమార్తె సుబ్బలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు. ఈయన కొన్నాళ్ళు అనంతపురం, విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1945 నుండి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు.

బి.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ కళాశాల వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రప్రథమ రచనలు - 'జువెనిలియా', 'బ్రోకెన్ వయోలిన్' అనే ఆంగ్ల కవితలు, 'పశ్చాత్తాపం లేదు' అనే తెలుగు కథానిక ప్రచురించబడ్డాయి.

ఈయన ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. ఈయన వ్రాసిన చిన్న కథలు సాధారణంగా చాలా పొడవుగా ఉండి, పాత్ర చిత్రణలోనూ, కథ నెరేషన్‌లో విన్నూతమైన శైలి కలిగి ఉంటాయి. బుచ్చిబాబు ఆలోచనా స్రవంతిపై సోమర్‌సెట్ మామ్, ఓ హెన్రీ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం మెండుగా కనిపిస్తుంది.[1] కొన్ని నవలలే వ్రాసినా మంచి నవలా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు రచయితలు, కవులందరూ జాతీయవాదులు, మార్క్సిస్టులు లేదా ఏదో ఒక సంఘసంస్కరణ ఉద్యమానికి చెందిన వారైన కాలంలో అతికొద్ది మంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చిబాబు ఒకడు.[2]

రచనలు

మార్చు

బుచ్చిబాబు మొత్తం మీద సుమారు 82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక-నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయ చరిత్రకు చెందిన మొదటి భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు - ఇతని లేఖిని నుండి వెలువడ్డాయి. ఈయన రచనలలో అత్యంత పేరు పొందినవి.

వీరు 1967, సెప్టెంబర్ 20 న పరమపదించారు.

ప్రఖ్యాత సందేశాలు

మార్చు
  • ‎"ప్రతి తెలుగువాడూ తెలుగుభాషను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు. దేనినైనా మార్చుకుంటాడుగానీ మాతృభాష మాత్రం మార్చుకోడు"

మూలాలు

మార్చు
  1. http://dsal.uchicago.edu/digbooks/digpager.html?BOOKID=PL4775.R4_1967&object=139
  2. Buddhism in Modern Andhra: Literary Representations from Telugu - Velcheru Narayana Rao [1][permanent dead link]
  3. బుచ్చిబాబు. చివరకు మిగిలేది.
  4. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.

ఇతర లింకులు

మార్చు