శీలం భద్రయ్య

తెలుగు కథా రచయిత, కవి

శీలం భద్రయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత. ఇతడు లొట్టపీసుపూలు అనే పేరుతో ఒక కథాసంపుటిని వెలువరించాడు.[1]

శీలం భద్రయ్య
శీలం భద్రయ్య
జననం(1980-12-24)1980 డిసెంబరు 24
అన్నారం,
తుంగతుర్తి,
సూర్యాపేట జిల్లా
వృత్తికవి,
కథారచయిత,
తెలుగు ఉపాధ్యాయుడు
భార్య / భర్తశీలం కరుణ
పిల్లలుఇద్దరు కుమారులు
తండ్రిశీలం బుచ్చయ్య
తల్లియాదమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, అన్నారం గ్రామంలో 1980, డిసెంబరు 24వ తేదీన శీలం బుచ్చయ్య, యాదమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను అన్నారం గ్రామంలో, ఇంటర్మీడియెట్ తుంగతుర్తిలో చదువుకున్నాడు. తరువాత నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి డిగ్రీ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర పట్టా పుచ్చుకున్నాడు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా వల్లాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పిజిటి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.

సాహిత్యరంగం

మార్చు
 
లొట్టపీసు పూలు

ఇతని రచనలు 2020 నుండి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఇతడు సుమారు 30 కథలను నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రిక, తెలుగు వెలుగు, నవతెలంగాణ మొదలైన వివిధ పత్రికలలో ప్రకటించాడు. 15 కథలతో లొట్టపీసు పూలు అనే కథాసంపుటిని ముద్రించాడు. ఈ పుస్తకం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు[2]తో సహా పలువురి ప్రశంసలను అందుకుంది.

ఇతడు రెండవ కథా సంపుటి "గంగెద్దు" ను 2022లో రచించాడు. ఇందులోని 14 కథలు విమర్శకుల మన్నన పొందాయి.

 
శీలం భద్రయ్య రాసిన "గంగెద్దు" కథలు

"శీలం భద్రయ్య విద్యావంతుడు. తెలుగు అధ్యాపకుడు. కథ, కవిత్వంలో ‘యాసనే’ శ్వాసగా బతుకుతున్నవాడు. తెలంగాణ భాష, వస్తువు, శిల్పం, రచనా సౌందర్యాన్ని ఇనుమడించి కథలు రాస్తున్నాడు. బోయ జంగయ్య తరువాత కథామెరుపును దక్షిణంవైపు మళ్ళించాడు. తీరాంధ్ర, రాయలసీమ మాండలిక కథకు ధీటుగా తెలంగాణ కథను పండిస్తున్నాడు." అని వేముల ఎల్లయ్య ప్రశంసించాడు.

రచనలు

మార్చు
  1. అంకురం (బాలల కవిత్వం) - సంపాదకుడు
  2. తెలుగు సాహిత్యం - తెలుగు అకాడమి ప్రచురణ
  3. యాస (కవితా సంకలనం)[3] - ప్రధాన సంపాదకుడు ISBN 978-93-5416-794-2
  4. లొట్టపీసు పూలు: తెలంగాణ కథలు ISBN 978-93-5426-350-7
  5. గంగెద్దు కథా సంపుటి
  6. ఖూనీ నాటిక

భద్రయ్య కోమలి కళా సమితి నల్లగొండ నాటక సంస్థలో సభ్యుడు. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 25,26,27 జులై 2022 తేదీల్లో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలను నిర్వహించింది. కోమలి నాటక సంస్థ తరపున అన్నట్టు మనం మనుషులం కదూ అనే నాటికని ప్రదర్శించి ఉత్తమ నటుడిగా స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి చేతులమీదిగా పురస్కారం అందుకున్నాడు.

  • పలు షార్ట్ ఫిల్మ్ లు, ఫిల్మ్ ల ప్రకటనలలో కూడా నటించారు.

పురస్కారాలు

మార్చు
  1. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2018
  2. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2019
  3. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లా పురస్కారం 2017
  4. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2020
  5. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్బంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ చే ఉత్తమ కథా రచయిత పురస్కారం -2022
  6. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఉత్తమ నడుడి పురస్కారం- 2022

మూలాలు

మార్చు
  1. విలేఖరి (24 October 2021). "ఆస్తిత్వ మూలాలను ఆవిష్కరించిన 'లొట్టపీసు పూలు'". నవతెలంగాణ. Archived from the original on 5 నవంబరు 2021. Retrieved 8 December 2021.
  2. న్యూస్ టుడే (9 September 2021). "'లొట్టపీసు పూలు' రచయితకు ఉపరాష్ట్రపతి ప్రశంసలు". ఈనాడు. Retrieved 8 December 2021.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-12-08. Retrieved 2021-12-08.

https://www.andhrajyothy.com/2023/editorial/stories-that-inspired-the-nomadism-1033294.html

https://www.manatelangana.news/sheelam-bhadraiah-poems-in-telugu/

https://www.ntnews.com/hyderabad/huge-public-turn-out-for-book-fair-in-hyderabad-904634

https://magazine.saarangabooks.com/stories-that-have-distilled-life/