శ్రావణమాసము
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.
శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.
శ్రావణమాస మహత్యం
మార్చుశ్రావణమాస మహత్యం స్కాంద పురాణంలోనున్నది. దీనిని చల్లా నాగలింగశాస్త్రి వారి పుత్రుడైన చల్లా లక్ష్మీనృసింహశాస్త్రి ద్వారా ఆంధ్రతాత్పర్యసహితంగా అనువదించబడింది. దీనిని బ్రహ్మశ్రీ కావూరి రంగయ్య శాస్త్రులు పరిష్కరించి ఆర్యానంద ముద్రాక్షరశాల, మచిలీపట్నంలో 1932లో ముద్రించబడింది.[1]
పండుగలు
మార్చుఇతర విశేషాలు
మార్చు- నందన నామ సంవత్సరంలో తిరుపతి వేంకట కవులు అమలాపురములో శతావధానము నిర్వహించారు.[2]
- వికారి నామ సంవత్సరంలో ఆలమూరులోను, అమలాపురం తాలూకా క్రొత్తపేటలో రామయ్యర్ గారు తిరుపతి వేంకట కవులు ద్వారా యష్టావధానములు చేయించారు.[3]
మూలాలు
మార్చు- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో శ్రావణమాస మహాత్మ్యము పుస్తక ప్రతి.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 9. Retrieved 26 June 2016.[permanent dead link]
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]