శ్రీకృష్ణ మాయ

కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు నెలకొల్పిన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ బ్యానర్ మీద వారి అల్లుడు సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీకృష్ణమాయ. వారణాసి సీతారామశాస్త్రి ‘నారద సంసారం’ నాటకం ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 1958, జూన్ 12వ తేదీన విడుదలయింది.

శ్రీకృష్ణ మాయ (నారదసంసారం)
(1958 తెలుగు సినిమా)
Sri Krishnamaya 1958 film.jpg
దర్శకత్వం సి.ఎస్.రావు,
సహాయదర్శకులు:పి.యస్.రాయ్,రాజశ్రీ
నిర్మాణం కడారు నాగభూషణం
కథ కీ.శే.వారణాసి సీతారామశాస్త్రి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
కె.రఘురామయ్య,
సి.హెచ్.కుటుంబరావు,
ఏ.వి.సుబ్బారావు,
కె.వి.యస్.శర్మ,
రాజనాల,
జమున,
సూర్యకళ,
కె.మాలతి,
సూర్యకాంతం,
ఛాయాదేవి,
రీటా,
లక్ష్మీరాజ్యం(జూనియర్),
శివరామకృష్ణయ్య,
నల్ల రామమూర్తి,
ప్రకాశరావు,
అమ్మాజి,
చంద్రకుమారి,
లీలారాణి,
భానుమతి,
సుశీల,
పార్వతి
సంగీతం టి.వి.రాజు,
జె.లక్ష్మీనారాయణ(సహకారదర్శకుడు)
నేపథ్య గానం ఘంటసాల,
కృష్ణవేణి(జిక్కి),
జానకి,
మాధవపెద్ది సత్యం,
పిఠాపురం నాగేశ్వరరావు
గీతరచన కీ.శే.వారణాసి సీతారామశాస్త్రి,
రావూరు వేంకటసత్యనారాయణరావు,
బి.వి.యన్.ఆచార్య
సంభాషణలు రావూరు వేంకటసత్యనారాయణరావు
కూర్పు ఎన్.కె.గోపాల్
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్ కంపెనీ.
పంపిణీ చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గంసవరించు

నటీనటులుసవరించు

కథసవరించు

శాంతి మంత్రం ఋషులు పఠిస్తుండగా ఇంద్రసభ ప్రారంభం అవుతుంది. ఇంద్రుడు (రాజనాల) దేవ పారిజాత వృక్షాన్ని, శ్రీకృష్ణ తులాభారం ద్వారా తమకు దక్కించినందుకు నారద మహర్షి (అక్కినేని)కి కృతజ్ఞతలు తెలియచేయగా నారదుడు, ఆ పొగడ్తలకు గర్వోన్నతుడై త్రిమూర్తులను హేళనచేస్తాడు. తాను మాయాతీతుడని ప్రకటిస్తాడు.

ద్వారకలో సత్యభామతో చదరంగమాడుతున్న శ్రీకృష్ణుడు (ఈలపాట రఘురామయ్య) నారదునికి జ్ఞానం కలిగించాలని, ఋషి దంపతులుగా ఓ ఆశ్రమం చేరి, అతనిలోని జ్ఞానాన్ని గ్రహించి, నారదుని ఓ నదిలో మునగమంటాడు. ఒడ్డున వున్న శ్రీకృష్ణుడు నారద వీణ మహతిని మాయ (జమున) అనే కోయ యువతిగా మార్చగా ఆమెతో, నది నుండి బయటకువచ్చిన నారదుడు ప్రేమ, పెళ్ళి, సంసారం సాగించటం, బహుసంతానంతో, లేమితో పలు అవస్థలకు లోనుకావటం, నారదుడన్న భావన, సంసారం తాపత్రయాలు భరించి, చివరకు శ్రీకృష్ణునిచే తిరిగి జ్ఞానాన్ని పొంది, పశ్చాత్తాపంతో వానిని శరణువేడడంతో చిత్రం ముగుస్తుంది. సృష్టిలోని సకల చరాచర జీవులు, ఆ జగన్మాత మహత్తర శక్తికి లోనయి నడువవలసిందేనని, తామే సర్వశక్తివంతులని విర్రవీగితే గర్వభంగం తప్పదన్న నీతితో రూపొందిన చిత్రం ‘శ్రీకృష్ణమాయ’[1].

పాటలుసవరించు

  1. అడుగడుగున మడుగులిదుర అతివల్ ప్రేమన్ (పద్యం) - మాధవపెద్ది
  2. కుచేలోపాఖ్యానం ( హరికథ) - ఘంటసాల (అక్కినేని మాటలతో )
  3. చాన నీ మోము చక్కని చందమామ.. నెలతా నీనవ్వు (పద్యాలు) - ఘంటసాల
  4. చిలకా ఏలనే కోపము తెలిపేను మనోభావము చిలుకా ఏలనే - ఘంటసాల,జిక్కి
  5. జనన మందిన నాడె జనకుడౌ బ్రహ్మకు చదివు చెప్పిన (పద్యం) - ఘంటసాల
  6. జయ సుందర నంద బాల గోపీజనలోల - ఘంటసాల
  7. తపమో శ్రీహరి నామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో (పద్యం) - ఘంటసాల
  8. తరమే జగాన ధాతకునైన తరుణీవిలాసవిమోహము దాట - కె. రఘురామయ్య
  9. నను రా రామ్మని చేర బిల్చి యీ విధముగా నమ్మించి రావించి (పద్యం) - ఘంటసాల
  10. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని (పద్యం) - ఘంటసాల
  11. నీలవర్ణ నీ లీలలు తెలియ నాతరమా దేవాది దేవా - ఘంటసాల
  12. నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూల జంపాల ఉయ్యాల - ఘంటసాల
  13. భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృస్యశక్తి (పద్యం) - కె. రఘురామయ్య
  14. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా - కె. రఘురామయ్య
  15. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయజీవా - ఘంటసాల
  16. రావో దొరా మరలిరావో దొరా నీదాసి పై కోపమా - జిక్కి
  17. వయారి నన్నుచేరి సయ్యాటలాడరావే చక్కని చుక్కవు నీవే - పిఠాపురం

మూలాలుసవరించు

  1. "శ్రీకృష్ణమాయ -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 02-06-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-27.

బయటి లింకులుసవరించు