శ్రీరంగం కన్నన్

మార్సింగ్ వాయిద్యకారుడు

శ్రీరంగం కన్నన్
2007 లో కన్నన్
వ్యక్తిగత సమాచారం
జననం(1952-05-05)1952 మే 5
శ్రీరంగం,
తిరుచిరాపల్లి జిల్లా,
మద్రాసు రాష్ట్రం (ప్రస్తుత తమిళనాడు)
మరణం2024 సెప్టెంబరు 20(2024-09-20) (వయసు 72)
చెన్నై, తమిళనాడు
సంగీత శైలి
వాయిద్యాలుమార్సింగ్
క్రియాశీల కాలం1968–2024
వెబ్‌సైటు[1]

శ్రీరంగం కన్నన్ (1952 మే 5-2024 సెప్టెంబరు 2) భారతీయ సంగీతకారుడు కళాకారుడు, మార్సింగ్ వాయించడానికి ప్రసిద్ధి చెందాడు.[1]

జీవిత విశేషాలు

మార్చు

విద్వాన్ శ్రీరంగం కన్నన్ 1952 మే 5న శ్రీరంగంలో కె. సత్యమూర్తి, కమలం దంపతులకు జన్మించాడు. ఎదిగే క్రమంలో శ్రీరంగం కన్నన్ కు కర్ణాటక సంగీతం పై ఆసక్తి కలిగింది.

19 సంవత్సరాల వయస్సులో శ్రీరంగం కన్నన్ ప్రముఖ సంగీత విద్వాంసుడు పుదుక్కోటై ఎస్. మహాదేవన్ కచేరీకి వెళ్ళాడు. త్వరలోనే ఆయనకు సంగీతం పట్ల ఆసక్తి మరింతగా పెరిగింది.[2] కొంతకాలం తర్వాత, శ్రీరంగం కన్నన్ పుదుక్కోటై ఎస్. మహాదేవన్ వద్ద శిష్యుడిగా చేరాడు. కంజీరా, మృదంగం కళాకారుడూ, మహాదేవన్ స్నేహితుడూ అయిన కనడుకథన్ రాజారామన్ వద్ద లయ (టెంపో) గురించి మరింత నేర్చుకున్నాడు. 23 సంవత్సరాల వయస్సులో అతను పూర్తి స్థాయి సంగీత వాయిద్య కళాకారుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.

విశ్వవిద్యాలయం నుండి గణితంలో పట్టభద్రుడైన తరువాత, శ్రీరంగం కన్నన్ ఇండియన్ బ్యాంకులో చేరాడు, అక్కడ అతను 30 సంవత్సరాలు పనిచేశాడు. 2000 లో పదవీ విరమణ చేశాడు.

కన్నన్ భారతదేశమంతటా సంగీత కచేరీలు నిర్వహించాడు.[3] చెన్నై ఆకాశవాణి కేంద్రంలో క్రమం తప్పకుండా సంగీత వాయిద్య ప్రదర్శన ఇచ్చేవాడు.

అతను 2024 సెప్టెంబరు 20 న 72 సంవత్సరాల వయసులో మరణించాడు.

అవార్డులు, గౌరవాలు

మార్చు
  • 1996లో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ సమర్పించిన మన్నార్గుడి నటేశా పిళ్ళై అవార్డును చెన్నైలోని శ్రీ రాగం ఫైన్ ఆర్ట్స్ స్థాపించింది.
  • 1998లో తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డును ప్రదానం చేసింది.
  • 1998, 2001 లలో డాక్టర్ రామమూర్తి స్థాపించిన మ్యూజిక్ అకాడమీ నుండి ఉత్తమ ఉప పక్కవాయిద్యం అవార్డు.
  • 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠంలో అస్థాన విద్వాంసుడిగా గౌరవం పొందాడు.
  • 2003 లో ఓబుల్ రెడ్డి స్థాపించిన నారద గాన సభ నుండి ఉత్తమ ఉపపక్కవాయిద్యం అవార్డు.
  • 2003 లో కంచి కామకోటి పీఠం నుండి కర్ణాటక సంగీత రంగంలో జీవితకాల సాఫల్య పురస్కారం.
  • ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్
  • కర్ణాటక సంగీతంలో సాధించిన విజయాలకు గాను 2005 లో చెన్నైలోని మహారాజపురం సంతానం ఫౌండేషన్ స్థాపించిన మెరిటోరియస్ అవార్డు.[4]
  • 2005లో చెన్నైలోని శ్రీ త్యాగ బ్రహ్మ గాన సభ స్థాపించిన అత్యంత నైపుణ్యం కలిగిన మోర్సింగ్ విద్వాంసుడికి ఇచ్చే వాణి కళా సుధాకర అవార్డు.
  • 2006లో మైసూరులోని దత్త పీఠానికి చెందిన సచ్చిదానంద స్వామి నుండి కర్ణాటక సంగీత రంగంలో జీవితకాల సాఫల్య పురస్కారం
  • చెన్నైలోని నదద్వీపం ట్రస్ట్ నెలకొల్పిన నాదవిద్యా భూపతి, 2009 లో.

పర్యటనలు కచేరీలు

మార్చు
  • 1988: కారైక్కుడి ఆర్. మణి, డాక్టర్ ఎన్. రమణి లతో కలిసి సోవియట్ యూనియన్‌లో భారత పండుగలో పాల్గొన్నాడు.
  • 1990: ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో తాళ, వాధ్య కచేరీల్లో పాల్గొన్నాడు.
  • 1990: డాక్టర్ ఎల్ సుబ్రమణ్యం సమర్పించిన జర్మనీలోని కొలీజియం ఇన్స్ట్రుమెంటేల్ హాలేలో ఛాంబర్ ఆర్కెస్ట్రాలో పాల్గొన్నాడు
  • 1991: మలేషియాలో జాకీర్ హుస్సేన్ నిర్వహించిన తాళ, వాద్య కచేరిలో పాల్గొన్నాడు.
  • 1992: హంగరీ, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన తాళ వాద్య కచేరిలో పాల్గొన్నాడు.
  • 1997: న్యూఢిల్లీలో భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవం కార్యక్రమంలో జరిగిన ఉమయాల్పురం శివరామన్, పండిట్ కిషన్ మహారాజ్‌లతో కలిసి తాళ వాద్యాల కచేరిలో పాల్గొన్నాడు.
  • 1998: ఫిన్లాండ్లోని హెల్సింకీలో జరిగిన అంతర్జాతీయ సంగీత ఉత్సవంలో పాల్గొన్నాడు
  • 1998: ఆస్ట్రేలియాలో టెల్స్ట్రా అడిలైడ్ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు.
  • 2000: డెన్మార్క్ లోని కోపెన్‌హేగన్‌లో జాజ్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు.
  • 2000: జర్మనీ లోని హానోవర్‌లో వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్నాడు.
  • 2000: ప్రేగ్‌లో జరిగిన చెక్ రిపబ్లిక్ డే ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు.
  • 2001: కారైక్కుడి ఆర్ మణితో కలిసి ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ఒపేరా హౌస్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ ఆర్ట్ ఆర్కెస్ట్రా ఫ్యూజన్ మ్యూజిక్ కాన్సెర్ట్లో పాల్గొన్నాడు.
  • 2001: స్వీడన్లోని సామిలో పెర్క్యూసివ్ ఆర్ట్స్ సొసైటీ సమర్పించిన నిర్వహించిన తాళ వాద్య కచేరిలో పాల్గొన్నాడు.
  • 2001: ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ ద్వైవార్షిక సంగీత ఉత్సవంలో కారైక్కుడి ఆర్ మణితో కలిసి 'శ్రుతి లయ' తో పాల్గొన్నాడు.
  • 2002: సాడ్లర్స్ వెల్స్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో 'సంగీతం' నిర్వహించిన తాళ వాద్య కచేరిలో పాల్గొన్నాడు.
  • 2003: మలేషియాలోని 'సంగీత స్వరం' నిర్వహించిన సంగీత ఉత్సవంలో పాల్గొన్నాడు.
  • 2006: ఫిజి దీవులు, ఆస్ట్రేలియాల్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన కచేరీల్లో పాల్గొన్నాడు

మూలాలు

మార్చు
  1. Renowned Morsing Artist Srirangam R Kannan Passes Away
  2. "Album1". Archived from the original on 10 September 2011. Retrieved 2010-04-29.
  3. Video యూట్యూబ్లో
  4. "The Hindu : Tamil Nadu / Chennai News : Thanjavur Sankara Iyer honoured". www.hindu.com. Archived from the original on 23 May 2006. Retrieved 17 January 2022.