సందీప్ చౌతా (Sandeep Chowta) భారతీయ సంగీత దర్శకుడు. ఇతను ప్రధానంగా హిందీ, తెలుగు, కన్నడ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఇదియే కాక ఇతను మనదేశంలో కొలంబియా రికార్డ్స్ సంస్తకు అధిపతిగా ఉన్నాడు[1]. అతను కొన్ని పాటలను కూడా పాడాడు.

2003 లో, అతను డెడ్ ఎండ్ పేరుతో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాడు. ఇది అనేక చలన చిత్రోత్సవాలలోకి ప్రవేశించింది. దీనిని పదిహేడేళ్ల కాలేజీ విద్యార్థి, మాదకద్రవ్యాల ఉద్యమకారుడు తాన్య ఖుబ్‌చందాని నిర్మించాడు.

2004 లో చౌతా తన ముంబై స్టూడియోకు ప్రపంచ సంగీత సమూహం, AO మ్యూజిక్ కు చెందిన జే ఆలివర్, రిచర్డ్ గాన్నవేలను ఆహ్వానించాడు. వారిని అప్పటి నుండి వారిని తన సమూహం ప్రధాన సభ్యులుగా చేసాడు.[2][3][4] AO మ్యూజిక్ ద్వారా చౌతా విడుదల చేసిన ఆల్బమ్‌లు 2009 నుండి అంతర్జాతీయంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి..[5][6][7]

టాలీవుడ్ విషయానికి వస్తే, అతను 10 చిత్రాలకు సంగీతం సమకూర్చాడు, వాటిలోని 5 చిత్రాలలో అక్కినేని నాగార్జున ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాడు. మిగిలిన 5 చిత్రాలతో మోహన్ బాబు పాల్గొన్నాడు.

ప్రారంభ జీవితంసవరించు

సందీప్ చౌతా ఘనాలో జన్మించాడు.[8] నైజీరియాలో, తరువాత భారతదేశంలోని బెంగళూరులో పెరిగాడు. అతను తుళు రచయిత. అతను బంట్ కమ్యూనిటీకి చెందిన వ్యాపారవేత్త డి. కె. చౌతా పెద్ద కుమారుడు[9][8]. అతని సోదరి ఎథ్నోగ్రాఫర్ ప్రజ్ఞ చౌతా.[10]

సంగీతాన్నందించిన తెలుగు సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "New musical direction". The Hindu. 26 May 2007. Retrieved 16 April 2008. CS1 maint: discouraged parameter (link)
  2. AllMusic artist album-"...and Love Rages On!"
  3. AllMusic artist album-"Twirl"
  4. Publicity Wire news article
  5. Zone Music Reporter Charts Top 100 February 2009–"Twirl"
  6. Zone Music Reporter Charts Top 100 August 2011–"...and Love Rages On!"
  7. ZMR Top 10 for April 2013
  8. 8.0 8.1 Correspondent (31 డిసెంబరు 2005). "Sandeep Chowta to be back with a bang". manglorean.com. Archived from the original on 12 సెప్టెంబరు 2014. Retrieved 15 జనవరి 2012. CS1 maint: discouraged parameter (link)
  9. Shivashankar, Praveen (2013-10-25). "Keeping Tulu close to heart". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2019-03-23.
  10. Savitha Karthik (28 October 2010). "May we have the trumpets please". Deccan Herald. Retrieved 16 January 2012. CS1 maint: discouraged parameter (link)

ఇతర పఠనాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు