జోష్ (సినిమా)

(జోష్ నుండి దారిమార్పు చెందింది)

జోష్ 2009 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం, ఇది నాగ చైతన్య, కార్తీక ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి ఒక కీలక పాత్ర పోషించాడు. వాసు వర్మ దర్శకత్వం వహింక్షిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.[1] ముందు సెప్టెంబరు 3 న విడుదల చెయ్యాలని అనుకోగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం కారణంగా వాయిదా పడి, రెండు రోజుల తరువాత విడుదలైంది. నాగ చైతన్య నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్ర కథాంశం నాగ చైతన్య తండ్రి నాగార్జున సినిమా, శివను పోలి ఉంటుంది, ఇక్కడ ఒక విద్యార్థి విద్యార్థులతో సంబంధం ఉన్న మాఫియాను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఆ చిత్రంలోని విలన్ పాత్ర కూడా చక్రవర్తే పోషించాడు.

జోష్
(2009 తెలుగు సినిమా)
Josh 2009 poster.jpg
దర్శకత్వం వాసు వర్మ
కథ వాసు వర్మ
చిత్రానువాదం వాసు వర్మ
తారాగణం అక్కినేని నాగ చైతన్య, కార్తిక నాయర్, జె.డి.చక్రవర్తి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, హేమ, దేవదాస్ కనకాల
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 5 సెప్టెంబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బాక్సాఫీసు షేరు కలెక్షను సుమారు ₹ 17.5 కోట్లు. ప్రీ రిలీజ్ వ్యాపారం ₹ 19.5 కోట్లు.[2]

కథసవరించు

సత్య ( నాగ చైతన్య ) ఒక విద్యార్థి. అతను విశాఖలో తన గ్రాడ్యుయేషన్ చదువును ఆపేసి, ఉద్యోగం కోసం హైదరాబాదు వస్తాడు. తన మామయ్య ( సునీల్) తో కలిసి హైదరాబాద్ లో ఉంటాడు. పొలిటికల్ మాఫియా నాయకుడు దుర్గారావు ( జెడి చక్రవర్తి ) చేత ప్రభావితమైన ఎంజిఎం కళాశాల విద్యార్థులతో అతడు పోరాడుతాడు. సత్య ఆ విద్యార్థులను మార్చడానికి ప్రయత్నించినా విఫలమవుతాడు. అప్పుడు అతను అనుకోకుండా విద్యార్థుల చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రిలో చేరతాడు. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం గురించి మామయ్య ప్రశ్నించినప్పుడు సత్య తన ఫ్లాష్ బ్యాక్ గురించి వివరించాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లో తన క్లాస్‌మేట్ల ముఠాతో జాలీగా ఉండే సత్యను చూస్తాము. పాఠశాల విద్య వరకు అతను టాపర్ అయినప్పటికీ, కళాశాల వాతావరణం అతన్ని మొండి వ్యక్తిగా చేస్తుంది. అతని ప్రిన్సిపాల్ ( ప్రకాష్ రాజ్ ) అతనిని మారమని సలహా ఇస్తూనే ఉంటాడు కాని సత్య దానిని బోరు కొట్టే ఉపన్యాసంగా భావిస్తాడు. అతను తన ప్రిన్సిపాల్ యొక్క నిజాయితీగల కుమారుడు బుజ్జీని తన ముఠాలో చేర్చుకుంటాడు. ఒక రోజు వారు బైక్ రేసు కోసం వెళ్తారు. బుజ్జీ సత్య బైక్ మీద వెళ్తాడు. బైక్ గొలుసు వదులై, జారిపడి సత్యకు గాయమౌతుంది. బుజ్జీ మరణిస్తాడు. ఈ సంఘటనతో సత్య పశ్చాత్తాపానికి లోనౌతాడు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, వ్యవస్థను శుభ్రపరచడానికి సత్య కళాశాలలో చేరతాడు. మరోవైపు, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలైన విద్య ( కార్తీక నాయర్ ) కాలేజీలో చదవాలని కోరుకుంటుంది గానీ, కాలేజీ విద్యార్థులు రౌడీలని ఆమె సోదరుడు అందుకు ఒప్పుకోడు. ఆమె సత్యను కలుస్తుంది. వారి మధ్య ప్రేమ వికసిస్తుంది. సత్య విద్యార్థులను ఎలా మారుస్తాడు, దుర్గారావు చెడు ప్రభావం నుండి వారిని ఎలా బయటకు తీసుకువస్తాడనేది మిగిలిన సినిమా కథ.

నటీనటులుసవరించు

సంగీతంసవరించు

సందీప్ చౌతా సంగీతం అందించాడు. పాటలను 2009 జూలై 18 న శిల్పారామ వేదికలో విడుదల చేసారు.

పాటలు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "డిరి డిరి"  Sandeep Chowtha, Kunal Ganjawala 4:49
2. "నీతో ఉంటే"  కార్తిక్ 5:26
3. "జిగిజిక్క" (Bit Song)చంద్రబోస్ 1:13
4. "ఆవారా హవా"  సౌమ్యా రావు 4:24
5. "బ్యాడ్ బ్యాడ్ బాయ్"  రంజిత్ బెన్నీ దయాళ్ 4:40
6. "అన్నయ్యొచ్చినాడో" (Bit Song)దిల్ రాజు 0:52
7. "ఎవ్వరికీ"  రాహుల్ వైద్య, ఉజ్జయినీ ముఖర్జీ 4:58
8. "మే మే మేక" (Bit Song)చంద్రబోస్ 0:57
9. "కాలేజీ బుల్లోడా"  రాహుల్ సిప్లిగంజ్ 3:47

మూలాలుసవరించు

  1. Naga Chaitanya to show his Josh on 28 August. 123telugu.com.
  2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified