దేవదాస్ (2018 సినిమా)
దేవదాస్ 2018, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[4] వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, నాని, రష్మికా మందన్న, ఆకాంక్ష సింగ్ నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2019, నవంబరులో జీ స్టూడియోస్ సంస్థ డాన్ ఔర్ డాక్టర్ పేరుతో అనువాదం చేసింది.[5]
దేవదాస్ | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్ ఆదిత్య టి |
నిర్మాత | సి. అశ్వినీదత్ |
తారాగణం | అక్కినేని నాగార్జున నాని రష్మికా మందన్న ఆకాంక్ష సింగ్ |
ఛాయాగ్రహణం | శ్యామ్‌దత్. ఎస్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | వియాకామ్18 మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 27 సెప్టెంబరు 2018 |
సినిమా నిడివి | 159 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹20 కోట్లు[2] |
బాక్సాఫీసు | est. ₹50 కోట్లు[3] |
కథా నేపథ్యం
మార్చుపదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దేవ (నాగార్జున), తనను ఆదరించి పెంచిన దాదా (శరత్ కుమార్)ను ప్రత్యర్థులు చంపేయటంతో బయటకు వస్తాడు. దేవ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు దేవాను పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. దీంతోపాటు దాదాను చంపిన డేవిడ్ (కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పోలీస్ దాడిలో గాయపడిన దేవకు డాక్టర్ దాస్ (నాని) చికిత్స చేస్తాడు. తన గురించి తెలిసినా కూడా పోలీసులకు పట్టివ్వని దాస్ మంచితనం చూసి, దేవ అతనితో స్నేహం చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన దాస్, తరువాత దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, పోలీసుల నుంచి, డేవిడ్ గ్యాంగ్ నుంచి దేవ తప్పించుకున్నాడా, దాదాను చంపిన వారి మీద పగ తీర్చుకున్నాడా అన్నది మిగతా కథ.[6]
నటవర్గం
మార్చు- ప్రధాన నటవర్గం
- అక్కినేని నాగార్జున (దేవ)
- నాని (డా. ఎం.కె. దాస్)
- రష్మిక మందణ్ణా (ఇన్సిపెక్టర్ పూజా)
- ఆకాంక్ష సింగ్ (రిపోర్టర్ జాహ్నవి)
- సహాయక నటవర్గం
- శరత్ కుమార్ (దాదా-దేవ తండ్రి-అతిథి పాత్ర)
- కునాల్ కపూర్ (దేవిడ్)
- నవీన్ చంద్ర (అజయ్-దేవ కొడుకు)
- విజయ నరేష్ (మోహన్-దాస్ సోదరుడు)
- సత్య కృష్ణన్ (దాస్ వదిన)
- మురళీ శర్మ (సోలీస్ ఆఫీసర్ శర్మ)
- రావు రమేష్ (డా. భరధ్వాజ్)
- వెన్నెల కిషోర్ (డా. కూచిపూడి-మానసిక వైద్యుడు)
- అవసరాల శ్రీనివాస్ (రాజన్-దేవ అసిస్టెంట్)
- మనోబాల (తాత-పూజా అసిస్టెంట్)
- ఐశ్వర్య (నటి) (ఫిష్ ఫ్రై లక్ష్మీ)
- శివన్నారాయణ (పూజా తండ్రి)
- ప్రభాకర్ గౌడ్ (దేవ అనుచరుడు)
- పృథ్వీరాజ్ (జాహ్నవి మేనేజర్)
- కారుమంచి రఘు (లోకల్ రౌడీ)
- ప్రభాస్ శ్రీను (శ్రీను-డేవిడ్ అనుచరుడు)
- సమీర్ (డాక్టర్)
- ఉత్తేజ్ (రాజు-సీతారామయ్య డ్రైవర్)
- సత్య (జాకెట్-దాస్ క్లినిక్ కంపౌండర్)
- సంపూర్ణేష్ బాబు (నటుడు-అతిథి పాత్ర)
- ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (మెడిమెక్స్ హాస్పిటల్ చైర్మన్ సీతారామయ్య-అతిథి పాత్ర)
- యమునా శ్రీనిధి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి
- నిర్మాత: సి. అశ్వినీదత్
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: శ్యామ్‌దత్. ఎస్
- కూర్పు: ప్రవీణ్ పూడి
- నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్
- పంపిణీదారు: వియాకామ్18 మోషన్ పిక్చర్స్
చిత్రీకరణ
మార్చుఇది హైదరాబాదు మెట్రో రైలు లో చిత్రీకరణ జరిగిన తొలిచిత్రం.[7][8]
పాటలు
మార్చుఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2018, సెప్టెంబరు 21న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, సినీరంగం ముఖ్యుల సమక్షంలో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[9] పాటలకు మిశ్రమ స్పందన లభించింది.[10]
దేవదాస్ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 21 సెప్టెంబరు 2018 | |||
Recorded | 2018 | |||
Genre | పాటలు | |||
Length | 29:16 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | మణిశర్మ | |||
మణిశర్మ chronology | ||||
|
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వారు వీరు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య | 4:26 |
2. | "చెట్టు కింద డాక్టర్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | పద్మలత | 5:10 |
3. | "లక లక లకుమికర (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | నురాగ్ కులకర్ణి, శ్రీకృష్ణ | 4:53 |
4. | "హేయ్ బాబు (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కార్తీక్, రమ్య బెహరా | 5:00 |
5. | "ఏమో ఏమో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | సిద్ శ్రీరామ్, రమ్య బెహరా | 4:26 |
6. | "మనసేదో వెతుకుతూ ఉంది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | యాజిన్ నిజార్, అనురాగ్ కులకర్ణి | 5:21 |
మొత్తం నిడివి: | 29:16 |
స్పందన
మార్చుఈ చిత్రానికి సినీ విమర్శకుల, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.[11][12][13][14]
రేటింగ్
- ది టైమ్స్ ఆఫ్ ఇండియా: 3.5/5[15]
- గ్రేట్ ఆంధ్ర: 2.75/5[16]
అవార్డులు - ప్రతిపాదనలు
మార్చుకార్యక్రమ తేది | అవార్డు | విభాగం | విజేత, నామినీ | ఫలితాలు | మూలాలు |
---|---|---|---|---|---|
15 & 16 ఆగస్టు 2019 | దక్షణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలు | ఉత్తమ ప్రతినాయకుడు – తెలుగు | కునాల్ కపూర్ | ప్రతిపాదించబడింది | [17] |
మూలాలు
మార్చు- ↑ "DEVADAS – British Board of Film Classification". www.bbfc.co.uk. Retrieved 29 March 2020.
- ↑ Hooli, Shekhar H. (2 అక్టోబరు 2018). "Devadas box office collection 5-day: Nagarjuna-Nani starrer crosses Rs 30 crore mark worldwide". International Business Times, India Edition. Archived from the original on 11 అక్టోబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "Devadas Latest Box Office Collections Report". The Hans India. 14 అక్టోబరు 2018. Archived from the original on 19 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "Nagaruna and Nani-starrer Devadasu gets a release date – Times of India". The Times of India. Archived from the original on 28 ఆగస్టు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ ZEE Cinema - Miliye superstars Nagarjuna aur Nani se jo... | Facebook (in ఇంగ్లీష్), retrieved 2 April 2020
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
- ↑ "Nani- Akkineni Nagarjuna starrer is the first film to be shot in Hyderabad Metro".
- ↑ "Nagarjuna-Nani starrer becomes first film to shoot in Hyd metro".
- ↑ "Devadas (Audio launch)". Filmibeat. Archived from the original on 15 డిసెంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "Devadas Music Review: Lacklustre album". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 31 అక్టోబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "Devadas review". www.thenewsminute.com. Archived from the original on 30 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "Review : DevaDas Review: An interesting first-half (2018)". www.sify.com. Archived from the original on 13 ఫిబ్రవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ Dundoo, Sangeetha Devi (27 సెప్టెంబరు 2018). "'Devadas' review: The N factor". Archived from the original on 28 సెప్టెంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020 – via www.thehindu.com.
- ↑ kavirayani, suresh (30 సెప్టెంబరు 2018). "Devadas movie review: It's Nag and Nani show completely". Deccan Chronicle. Archived from the original on 16 నవంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "Devadas Movie Review {3.5/5}: The Deva and Das show is thoroughly entertaining". Archived from the original on 16 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020 – via timesofindia.indiatimes.com.
- ↑ Venkat (27 సెప్టెంబరు 2018). "Devadas, Devadas Movie Review, Devadas Rating, Devadas Telugu Review". greatandhra.com. Archived from the original on 29 జనవరి 2019. Retrieved 2 ఏప్రిల్ 2020.
- ↑ "SIIMA Awards 2019: Here's a complete list of nominees". Times of India. 19 July 2019. Retrieved 2 April 2020.