సత్యం (సినిమా)

2003 సినిమా

సత్యం 2003 లో సూర్యకిరణ్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.[1] ఇందులో సుమంత్, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది, బాక్సాఫీస్ వద్ద చాలా విజయవంతమైంది. సుమంత్ కెరీర్‌లో అతిపెద్ద బాక్సాఫీస్ విజయాలలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం తెలుగులో జెనీలియాకు తొలి చిత్రం. చక్రి ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇది బెంగాలీలో శక్తి పేరుతో రీమేక్ చేయబడింది.

సత్యం
దర్శకత్వంసూర్యకిరణ్
రచనసూర్యకిరణ్
బి. వి. ఎస్. రవి
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంసుమంత్
జెనీలియా డిసౌజా
కోట శ్రీనివాసరావు
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పునందమూరి హరి
సంగీతంచక్రి
పంపిణీదార్లుఅన్నపూర్ణ స్టూడియోస్
విడుదల తేదీ
2003 డిసెంబరు 19 (2003-12-19)
సినిమా నిడివి
144 నిమిషాలు
భాషతెలుగు
బడ్జెట్₹ 3.5 కోట్లు

కథ మార్చు

సత్యం (సుమంత్) సినిమాల్లో గేయరచయితగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన జీవితంలో ఎంతో ముఖ్యంగా భావించే తండ్రి (మల్లాది రాఘవ), తన స్నేహితురాలు అంకిత (జెనీలియా డిసౌజా) దగ్గర చెడ్డవాడిగా ముద్రపడతాడు. తండ్రికి తనకు పడకపోవడంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసి స్నేహితులతో కలిసి నివసిస్తుంటాడు. సున్నితమైన మనస్కుడైనా సత్యం ఓ పాపులర్ రచయిత దగ్గర ఘోస్టు రచయితగా పనిచేస్తుంటాడు. తాను రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే తన ప్రియురాలు అంకితకు తన ప్రేమను తెలియబరచాలనుకుంటాడు. ఈ లోపునే అంకిత క్లాస్ మేట్ ఒకరు ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. తర్వాత అంకిత తండ్రి (కోట శ్రీనివాసరావు) సత్యం కి పరిచయమై అతన్ని అభిమానిస్తుంటాడు. చివరికి సత్యం, అంకిత కలుసుకున్నారా లేదా అన్నది మిగతా కథ.

తారాగణం మార్చు

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ మగువా నీతో స్నేహం కోసం"భాస్కరభట్లచక్రి5:57
2."కుచ్ కుచ్"విశ్వవిశ్వ, కౌసల్య5:24
3."రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్"రాజేష్, వెంకట రమణవెంకట రమణ, సూర్య కిరణ్2:46
4."మధురమే మధురమే"సిరివెన్నెల సీతారామశాస్త్రివేణు4:38
5."ఐ ఆం ఇన్ లవ్"కందికొండవేణు5:39
6."పిలిచిన పలకదు ప్రేమా"కందికొండరవి వర్మ, చక్రి5:18
7."ఓరి దేవుడా"కందికొండవాసు, సూర్యకిరణ్5:18
Total length:26:35

మూలాలు మార్చు

  1. జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో సత్యం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 20 November 2016.
  2. "16 వసంతాల 'సత్యం'". సితార. Archived from the original on 2020-07-18. Retrieved 2020-07-14.

బయటి లింకులు మార్చు