సమీర్ రెడ్డి

భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు

సమీర్ రెడ్డి భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.

సమీర్ రెడ్డి
సమీర్ రెడ్డి
జననం
సమీర్ రెడ్డి

క్రియాశీల సంవత్సరాలు2001 - ప్రస్తుతం

విశేషాలు మార్చు

ఇతడు హైదరాబాదులో జన్మించాడు. రాజమండ్రిలో పెరిగాడు. ఇతడు ఇంటర్‌మీడియట్ వరకు రాజమండ్రిలో చదివాడు. ఇతడు లెదర్ టెక్నాలజీలో డిగ్రీ చదవడానికి మద్రాసులోని గిండీ ఫుట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు కాని అతనికి అది నచ్చకపోవడంతో మానివేశాడు. ఇతని బంధువు రసూల్ ప్రేరణతో ఇతడు సినిమా రంగం వైపు ఆసక్తిని కనబరచాడు. తేజ వద్ద సహాయకునిగా రాత్, అంతం, రక్షణ, మనీ, బాజీ సినిమాలలో పనిచేశాడు. ఇతడు ఛాయాగ్రాహకునిగా పనిచేసిన మొదటి చిత్రం సునీల్ శెట్టి, సోనాలి బెంద్రెలు నటించిన భాయ్ అనే హిందీ సినిమా. తెలుగులో ఇతడు పనిచేసిన మొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్ వారి ఆనందం. ఇంకా ఇతడు క్విక్‌ శాండ్ అనే హాలీవుడ్ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు[1].

ఫిల్మోగ్రఫీ మార్చు

ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. ఆనందం (2001)
  2. కలుసుకోవాలని (2002)
  3. జయం (2002)
  4. మన్మథుడు (2002)
  5. సత్యం (2003)
  6. నా ఆటోగ్రాఫ్ (2004)
  7. మల్లీశ్వరి (2004)
  8. ఔనన్నా కాదన్నా (2005)
  9. ధైర్యం (2005)
  10. మొదటి సినిమా (2005)
  11. అందాల రాముడు (2006)
  12. చుక్కల్లో చంద్రుడు (2006)
  13. అతిథి (2007)
  14. యోగి (2007)
  15. కంత్రి (2008)
  16. జోష్ (2009)
  17. డాన్ శీను (2010)
  18. శక్తి (2011)
  19. రచ్చ (2012)
  20. మిస్టర్ పెళ్ళికొడుకు (2014)
  21. గోవిందుడు అందరివాడేలే (2014)
  22. శతమానం భవతి (2016)
  23. హైపర్ (2016)
  24. ఇద్దరి లోకం ఒకటే (2019)
  25. అహింస (2023)

పురస్కారాలు మార్చు

సంవత్సరం అవార్డు విభాగము జ్ఞాపిక ఫలితం
2016 నంది పురస్కారం ఉత్తమ ఛాయాగ్రాహకుడు తామ్రనంది గెలుపు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు