సమతామూర్తి

శ్రీ రామానుజ విగ్రహం, ముచ్చింతల, తెలంగాణ

స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ (ఆంగ్లం: Statue of Equality) రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన శ్రీరామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 ఫిబ్రవరి 2022న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు.[2] ఇది పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.[3]

సమతామూర్తి
స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ
అక్షాంశ,రేఖాంశాలు17°11′10″N 78°20′00″E / 17.1860°N 78.3332°E / 17.1860; 78.3332
ప్రదేశంముచ్చింతల్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రకంవిగ్రహం
నిర్మాన పదార్థంస్టీల్ ఫ్రేమింగ్, పంచలోహ
ఎత్తు65.8 మీటర్లు
నిర్మాణం ప్రారంభం2 మే 2014; 10 సంవత్సరాల క్రితం (2014-05-02)[1]
పూర్తయిన సంవత్సరం2018
ప్రారంభ తేదీ5 ఫిబ్రవరి 2022 (వసంత పంచమి)
అంకితం చేయబడినదిశ్రీరామానుజాచార్య స్వామి

చరిత్ర

మార్చు

2013లో ప్రణాళిక అనంతరం 2014 మే నెలలో రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి, త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో మొదట 14 రాకాల నమూనాలని తయారుచేసి తరువాత నమూనాల సంకలనాన్ని 3డి స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేశారు. దాని ఆధారంగా చైనాకు చెందిన ఏరో నెస్ కార్పొరేషన్ లో 1600 భాగాలుగా చైనాలో తయారుచేసి ఆ విడిభాగాలను భారతదేశానికి తీసుకువచ్చి ముచ్చింతల్ లోని స్టీల్ కట్టడం పైన నిర్మించారు. దీనికి సుమారుగా 15 నెలల సమయం పట్టింది.[4]

సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టత

మార్చు

శ్రీరామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకుని అయన స్మారకార్థం, గౌరవార్థం శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త శ్రీరామానుజాచార్య స్వామి 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించారు.[5]సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 13న ఆవిష్కరించి​ లోకార్పణం చేశాడు.[6]

సహస్రాబ్ది సమరోహంలో కార్యక్రమాలు

మార్చు
  • 1035 హోమ గుండాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు
  • 108 దివ్య దేశ ప్రతిష్ట, కుంభాభిషేకం
  • స్వర్ణమయ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపన
  • హోమంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు
  • మహాక్రతువును నడిపించననున్న 5000 మంది రుత్విక్కులు
  • 216 అడుగుల సమతామూర్తి ఆవిష్కరణ

ఆహ్వానం

మార్చు

శ్రీరామానుజాచార్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఆహ్వాన పత్రికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,[7] భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ప్రధాని నరేంద్ర మోదీ,[8] కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి , కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ చూబె, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌, కేంద్రమంత్రులు అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజే, ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, విశ్వ హిందూ పరిషత్‌ ఉపాధ్యక్షులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి.వి. శ్రీనివాస్ గౌడ్ తదితరులకు మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు తో కలిసి అందజేశాడు.[9]

సమతామూర్తి స్ఫూర్తికేంద్రం ప్రత్యేకతలు

మార్చు
  • 216 అడుగుల పంచలోహ విగ్రహాం
  • 1800 టన్నుల పంచలోహాల వినియోగం
  • మొత్తం 200 ఎకరాల్లో నిర్మాణం
  • రూ.వెయ్యి కోట్లతో సమతామూర్తి ప్రాజెక్టు నిర్మాణం
  • స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఎత్తు 216 అడుగులు
  • రామానుజ విగ్రహం ఎత్తు 108 అడుగులు
  • భద్రవేది ఎత్తు 54 అడుగులు
  • పద్మపీఠం ఎత్తు 27 అడుగులు
  • త్రిదండం ఎత్తు 135 అడుగులు
  • భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54
  • పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య 36
  • శంఖు చక్రాల సంఖ్య 18+18 = 36
  • రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ
  • వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ
  • పండిత సభల కోసం ఆడిటోరియం
  • వివిధ ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్‌ థియేటర్‌
  • భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజచార్య విగ్రహం
  • రామానుజచార్యులకు అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటేన్
  • ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు.[10]

మూలాలు

మార్చు
  1. "Statue Of Equality". Jeeyar Educational Trust UK. 16 March 2018. Archived from the original on 16 October 2018. Retrieved 15 October 2018.
  2. ETV Bharat News (18 September 2021). "ఫిబ్రవరి 5న సమతామూర్తిని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  3. Eenadu (5 February 2022). "రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.
  4. "సమతామూర్తి సాకారమైంది ఇలా." EENADU. Retrieved 2022-02-05.
  5. ఆంధ్రప్రభ (21 September 2021). "ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 5న 'సమతామూర్తి' విగ్రహావిష్కరణ". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  6. HMTV (13 February 2022). "54 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  7. TV9 Telugu (14 September 2021). "సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారు.. ప్రత్యేక అతిధులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం." Archived from the original on 14 January 2022. Retrieved 14 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. TV9 Telugu (18 September 2021). "సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి". Archived from the original on 14 January 2022. Retrieved 14 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Namasthe Telangana (12 January 2022). "చిన్న‌జీయ‌ర్ స్వామిని క‌లిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 14 January 2022. Retrieved 14 January 2022.
  10. Sakshi (13 January 2022). "మళ్లీ 'భువికి' రామానుజులు!". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.