సాత్ సర్ సరస్సు
సాత్ సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉంది. సాత్ సర్ అనగా ఏడు సరస్సులు అని అర్థం. ఈ ఏడు చిన్న సరస్సులను కలిపి ఒకే సరస్సుగా పిలుస్తారు.[1]
సాత్ సర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | గందర్‌బల్ జిల్లా, జమ్మూ కాశ్మీరు భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 34°27′42″N 74°59′53″E / 34.461709°N 74.997935°E |
సరస్సు రకం | ఆల్ఫైన్ సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | మంచు కరగడం |
వెలుపలికి ప్రవాహం | భూగర్భంలోకి |
గరిష్ట పొడవు | 3.2 కిలోమీటర్లు (2.0 మై.) (మొదటి సరస్సు నుండి ఏడవ సరస్సు వరకు) |
గరిష్ట వెడల్పు | 0.9 కిలోమీటర్లు (0.56 మై.) (లోయ వెడల్పు) |
ఉపరితల వైశాల్యం | 4 కి.మీ2 (1.5 చ. మై.) (మొత్తం వైశాల్యం) |
ఉపరితల ఎత్తు | 3,610 మీటర్లు (11,840 అ.) |
భౌగోళికం
మార్చుఈ సరస్సులు ఇరుకైన ఆల్పైన్ లోయలో ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి, 4 కిలోమీటర్లు (2.5 మైళ్ళు) పొడవు, 1 కిలోమీటర్ (0.62 మైళ్ళు) వెడల్పు కలిగి ఉన్నాయి. ఇది తులైల్ వ్యాలీ, సింద్ వ్యాలీలకు మధ్య సహజ పర్వత మార్గం గా ఉంది. సాత్ సర్ సరస్సుల చుట్టూ పచ్చటి పచ్చికభూములు ఉన్నాయి, ఇవి వేసవిలో గొర్రెల కాపరులకు నిలయంగా ఉంటాయి.[2]
పరిసరాలు
మార్చుసాత్ సర్ సరస్సు ప్రధానంగా చుట్టూ ఉన్న మంచు కొండలు కరగడం ద్వారా ఏర్పడుతుంది. వేసవి చివరలో, శరదృతువులో, అవపాతం కారణంగా రెండు లేదా మూడు సరస్సులు సాధారణంగా ఎండిపోతాయి. ఈ సరస్సుల నుండి ఒక ప్రవాహం ఉద్భవించి భూగర్భంలోకి ప్రవహిస్తుంది. ప్రక్కనే ఉన్న హిమానీనదం నుండి ఒక ప్రవాహం ఉద్భవించి దక్షిణ దిశగా ప్రవహించి, సింధు నదికి ప్రధాన కుడి ఉపనది అయిన చుర్నార్ మీదుగా వంగాత్ నల్లాలో కలుస్తుంది.[3][4]
పూలు,చేపలు
మార్చుచలికాలంలో, సాత్ సర్ సరస్సులు తీవ్రమైన మంచుతో కప్పబడి ఉంటాయి. వసంత ఋతువు చివర్లో ఈ సరస్సు చుట్టూ అనేక రకాల పూల మొక్కలు వికసించి ఉంటాయి. వీటిని చూడటానికి పర్యాటకులు ఎంతో ఆస క్తి చూపుతారు.[5]ఈ సరస్సులో చేపల పెంపకం కూడా ఉంటుంది వీటిని ప్రభుత్వ అనుమతి పొందిన జాలర్లు పట్టుకుంటారు.[6]
ప్రయాణం
మార్చుసాత్ సర్ సరస్సులు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. శీతాకాలంలో, భారీ మంచు కారణంగా ట్రెక్‌లు మూసివేయబడతాయి. శ్రీనగర్ నుండి 65 కి.మీ ప్రయాణం ద్వారా ఈ సరస్సులను చేరుకోవచ్చు. ఈ మార్గం గందర్‌బల్, వేయిల్ మీదుగా నారనాగ్ ట్రెక్కింగ్ క్యాంప్ వరకు ఉంటుంది. త్రినాఖుల్, బాద్పత్రిల ఆల్పైన్ పచ్చికభూములు, నుండ్‌కోల్, గంగ్ బాల్ సరస్సులు ఈ మార్గంలోనే ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ట్రెక్ చటర్‌గుల్ గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఇది నారనాగ్‌కు పశ్చిమాన 10 కి.మీ., పొడవు గల మహ్లిష్ గడ్డి మైదానాల గుండా వెళుతుంది. ఈ సరస్సును బందిపోరా నుండి కూడా చేరుకోవచ్చు. చాలా మంది పర్యాటకులు నారనాగ్ ట్రెక్ నుండి మొదలుకొని గడ్సర్ సరస్సు, విశాన్సర్ సరస్సు, సోనామార్గ్ వంటి ఈ ప్రాంతంలోని అనేక ఆల్పైన్ సరస్సులను సందర్శించడానికి ఆసక్తి చూపుతారు.[7][1][4][8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Hidden Lakes of Kashmir". IndianTrekking.com. Retrieved 10 July 2012.
- ↑ Wood, Levison (2016-01-04). Walking the Himalayas: An adventure of survival and endurance (in ఇంగ్లీష్). Hodder & Stoughton. ISBN 9781473626270.
- ↑ Stacey, Allan (1988). Visiting Kashmir. Hippocrene Books. p. 111. ISBN 9780870525681.
- ↑ 4.0 4.1 Sharma, Shiv (2008). India – A Travel Guide. Diamond Pocket Books (P) Ltd. p. 212. ISBN 9788128400674.
- ↑ J & K Yearbook & Who's Who. Rabir Publications. 1970. p. 486.
- ↑ "Know your Kashmir". Comrade Inn. Archived from the original on 8 జూలై 2013. Retrieved 10 July 2013.
- ↑ "Angling and Sport Fishing". Go Adventure Sports. Retrieved 10 July 2013.
- ↑ Kohli, M. S. (1983). The Himalayas: Playground of the Gods – Trekking, Climbing and Adventures. Indus Publishing. p. 45. ISBN 9788173871078.