సిద్ధార్థ్ మల్హోత్రా
సిద్దార్ధ్ మల్హోత్రా (జననం 16 జనవరి 1985)[1][2] ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్. తన 18వ ఏటన మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు దర్శకుడు కరణ్ జోహార్ వద్ద సహాయ దర్శకునిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కరణ్ దర్శకత్వంల్) స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు సిద్ధార్ధ్. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ మేల్ డెబ్యూ పురస్కారం అందుకున్నారు.
సిద్ధార్థ్ మల్హోత్రా | |
---|---|
జననం | ఢిల్లీ, భారతదేశం | 1985 జనవరి 16
విద్యాసంస్థ | షహీద్ భగత్ సింగ్ కళాశాల |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
2014లో హసేతో ఫసే, ఏక్ విలన్, 2016లో కపూర్ & సన్స్ సినిమాల్లో నటించారు సిద్దార్ధ్. ఏక్ విలన్, కపూర్ & సన్స్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ వసూళ్ళు సాధించాయి.
జీవిత సంగ్రహణ, కెరీర్
మార్చుతొలినాళ్ళ జీవితం, మొదటి చిత్రం
మార్చుపంజాబీ హిందూ కుటుంబంలో 16 జనవరి 1985న ఢిల్లీలో జన్మించారు సిద్దార్ధ్.[3] తండ్రి సునిల్ మర్చెంట్ నేవీ లో కెప్టెన్ గా పని చేశారు. తల్లి రీమా మల్హోత్రా గృహిణి.[4] ఢిల్లీలోని డాన్ బొస్కో స్కూల్, బిర్లా విద్యా నికేతన్, షాహిద్ భగత్ సింగ్ కళాశాలలోనూ చదువుకున్నారు ఆయన.[5] తన 18వ ఏట మోడలింగ్ మొదలు పెట్టారు. మోడలింగ్ వృత్తిలో ఆయన విజయవంతంగానే ఉన్నా, 4 ఏళ్ళ తరువాత తాను అసంతృప్తిగా ఉన్నానంటూ ఆ వృత్తిని వదిలేశారు సిద్ధార్ధ్.[6] నటునిగా మారాలని అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకు ఆడిషన్స్ కు వెళ్ళారు ఆయన. ఆయన్ను ఎంపిక చేసినప్పటికీ, సినిమా మొదలవ్వలేదు. ఆ తరువాత మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు దర్శకుడు కరణ్ జోహార్ వద్ద సహాయ దర్శకునిగా చేరారు సిద్ధార్ధ్.[5][7]
2012లో కరణ్ దర్శకత్వంలో స్టుడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో నటునిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, ఆలియా భట్ లతో కలసి నటించారాయన. ఈ సినిమాలోని సిద్ధార్ధ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.[8] ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. 700 మిలియన్ వసూళ్ళు సాధించింది.[9][10]
ఆ తరువాత 2014లో పరిణీతి చోప్రా, అదా శర్మ హీరోయిన్లుగా హసీ తో ఫసీ సినిమాలో నటించారు సిద్ధార్ధ్. ఈ సినిమాలో పరిణీతి, సిద్దార్ధ్ ల కెమిస్ట్రీ బాగా కుదిరిందని విమర్శకులు మెచ్చుకున్నారు. ఎన్డీటీవీ కి చెందిన విమర్శకుడు సైబల్ చటర్జీ, సిద్దార్ధ్ నటనను తొలినాళ్ళ అమితాబ్ బచ్చన్ నటనతో పోల్చి ప్రశంసించారు.[11][12] సినిమా మంచి హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 620 మిలియన్ వసూళ్ళు సాధించింది.[13]
కెరీర్ లో పెద్ద మలుపు-ఏక్ విలన్
మార్చు2014లో మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఏక్ విలన్ సినిమాలో సీరియల్ హంతకునిగా నటించారు సిద్దార్ధ్. ప్రముఖ పత్రికల విమర్శకులు అయన నటనకు ప్రశంసలు కురిపించారు.[14] కొరియన్ సినిమా నుంచి కథను తీసుకున్నారని వచ్చిన ఆరోపణలను దర్శకుడు మోహిత్ తోసిపుచ్చారు.[15] ఒక్క భారత్ లోనే 1 బిలియన్ వసూళ్ళు రాబట్టింది ఈ సినిమా.[16] ఈ సినిమా విజయం ఆయన కెరీర్ లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది. ఈ తరం బాలీవుడ్ నటుల్లో అత్యంత విజయవంతమైన హీరోగా సిద్దార్ధ్ ను నిలబెట్టిన సినిమా ఇది.[17][18]
2015లో హాలీవుడ్ సినిమావారియర్ (2011)కు రీమేక్ అయిన బ్రదర్స్ సినిమాలో నటించారు సిద్దార్ధ్. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలోఅక్షయ్ కుమార్తో కలసి ఈ సినిమాలో కనిపించారాయన.[19][20] ఈ సినిమా ఫ్లాప్ అయింది.[21] కానీ ఆ తరువాత ఆయన నటించిన కపూర్ & సన్స్ కమర్షియల్ గా హిట్ కావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.[22][23] ది హిందూ పత్రికకు చెందిన విమర్శకులు నమ్రతా జోషి సినిమాలో సిద్దార్ధ్ నటనను బాగా ప్రశంసించారు.[24][25]
2016 నిత్యా మెహ్రా దర్శకత్వంలో కత్రినా కైఫ్ తో కలసి బార్ బార్ దేఖో సినిమా పూర్తిచేశారు.[26] ప్రస్తుతం జాక్వెలైన్ ఫెర్నాండేజ్ తో కలిసి ఒక యాక్షన్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. రాజ్ నిడిమోరు, కృష్ణ.డి.కెలు దర్శకత్వం వహిస్తున్నారు.[27] మోహిత్ సూరి దర్శకత్వంలో ఆలియా భట్ తో కలసి ఆషికీ-3లో నటించడానికి ఒప్పుకున్నారు.[28] ఐట్టెఫక్ (1969) సినిమా రీమేక్ లో కూడా నటించనున్నారు సిద్దార్ధ్.[29]
సినిమాలు కాక...
మార్చుసినిమాల్లో నటించడమే కాక, చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా ఉంటున్నారు సిద్దార్ధ్. కోకో-కోలా, కొర్నెటో అమెరికన్ స్వాన్ వంటి అంతర్జాతీయ ఉత్పత్తుల ఎడ్వర్టైజ్మెంట్లలో కనిపిస్తారు ఆయన.[30] 2013లో ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్ధం చేసిన కార్యక్రమంలో వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధ కపూర్, హుమా కురేషిలతో కలసి పాల్గొన్నారు సిద్దార్ధ్.[31] పెటా సంస్థతో కలసి కుక్కల రక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు కూడా చేశారాయన.[32]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2010 | మై నేమ్ ఈజ్ ఖాన్ | - | సహాయ దర్శకుడు | [33] |
2012 | స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ | అభిమన్యు సింగ్ | [34] | |
2014 | హసీ తో ఫేసీ | నిఖిల్ భరద్వాజ్ | [35] | |
ఏక్ విలన్ | గురు దివేకర్ | [36] | ||
2015 | బ్రదర్స్ | మాంటీ ఫెర్నాండెజ్ | [37] | |
2016 | కపూర్ & సన్స్ | అర్జున్ కపూర్ | [38] | |
బార్ బార్ దేఖో | జై వర్మ | [39] | ||
2017 | ఎ జెంటిల్‌మన్ | గౌరవ్ కపూర్/రిషి పురోహిత్ | "బందూక్ మేరీ లైలా" పాటకు కూడా గాయకుడు | [40] |
ఇత్తెఫాక్ | విక్రమ్ సేథి | [41] | ||
2018 | అయ్యారీ | మేజర్ జై బక్షి | [42] | |
2019 | జబరియా జోడి | అభయ్ సింగ్ | [43] | |
మార్జావాన్ | రఘువేంద్ర నాథ్ | [44] | ||
2021 | షేర్షా | విక్రమ్ బత్రా / విశాల్ బత్రా | [45] | |
2022 | థ్యాంక్ గాడ్ | అయాన్ కపూర్ | [46] | |
2023 | మిషన్ మజ్ను | అమన్‌దీప్ అజిత్‌పాల్ సింగ్ / తారిక్ అలీ | [47] | |
2024 | యోధా | చిత్రీకరణ | [48] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2007 | గెట్ గార్జియస్ | అతనే | [49] | |
2009 | ధరి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్ | జైచంద్ | [50][51] | |
2024 | ఇండియన్ పోలీస్ ఫోర్స్ | కబీర్ మాలిక్ | [52] |
అవార్డులు, నామినేషన్లు
మార్చుఇతర గౌరవాలు
మార్చు- 2014: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2013[53]
- 2013: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2013[54]
- 2013: టైమ్స్ ఆఫ్ ఇండియా హాట్ లిస్ట్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ 2012
- 2013: టైమ్స్ ఆఫ్ ఇండియా 50 హాండ్సం హంక్స్ ఇన్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా[55]
- 2014:వాగ్ బ్యూటీ అవార్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్[56]
References
మార్చు- ↑ "Sidharth Malhotra turns 30, ready for 'action'". The Times of India. Retrieved 10 September 2015.
- ↑ "Happy Birthday Sidharth Malhotra: 'Ek Villain' actor gets ready for 'action' at 30". The Indian Express. Indo-Asian News Service. Retrieved 10 September 2015.
- ↑ Lakhe, Amruta (7 February 2014). "Sidharth Malhotra talks about his journey from being the junior most to a lead actor". The Indian Express. Retrieved 9 January 2016.
- ↑ Iyer, Meena (30 June 2012). "Siddharth Malhotra's short journey to stardom". The Times of India. Retrieved 17 June 2014.
- ↑ 5.0 5.1 Gupta, Priya (11 December 2013). "I was dating a South African girl, but I'm now single: Sidharth Malhotra". The Times of India. Retrieved 17 June 2014.
- ↑ Lakhe, Amruta (7 February 2014). "Sidharth Malhotra talks about his journey from being the junior most to a lead actor". The Indian Express. Retrieved 17 June 2014.
- ↑ "The new stars of Bollywood". Hindustan Times. 31 December 2010. Archived from the original on 5 అక్టోబరు 2012. Retrieved 27 September 2012.
- ↑ Masand, Rajeev (20 October 2012). "'Student of the Year' Review: If fun is what you're seeking, you won't be disappointed". CNN-IBN. Archived from the original on 21 అక్టోబరు 2012. Retrieved 19 March 2014.
- ↑ "Sidharth Malhotra". Box Office India. Retrieved 6 April 2014.
- ↑ "Box office verdict 2012". Koimoi.com. Archived from the original on 20 ఫిబ్రవరి 2014. Retrieved 19 March 2014.
- ↑ Basu, Mohar (7 February 2014). "Hasee Toh Phasee Movie Review: Sidharth Malhotra, Parineeti Chopra". Koimoi.com. Retrieved 8 May 2014.
- ↑ Chatterjee, Saibal (7 February 2014). "Hasee Toh Phasee movie review". NDTV. Archived from the original on 23 మే 2014. Retrieved 5 July 2014.
- ↑ "Top Worldwide Grossers 2014". Box Office India. 8 May 2014. Retrieved 8 May 2014.
- ↑ Gupta, Shubhra (30 June 2014). "Ek Villain review: Sidharth Malhotra is watchable but has hard time doing menace". The Indian Express. Retrieved 5 July 2014.
- ↑ "Ek Villain not inspired by Korean film, says Mohit Suri". India Today. 28 May 2014. Retrieved 27 June 2014.
- ↑ Mobhani, Suleman. "Bollywood's 100 Crore club". Bollywood Hungama. Retrieved 11 July 2014.
- ↑ "Ek Villain changed Sidharth Malhotra's luck?". The Times of India. 4 July 2014. Retrieved 5 July 2014.
- ↑ Sinha Jha, Priyanka (4 July 2014). "Newbie Central". The Financial Express. Retrieved 5 July 2014.
- ↑ "Akshay Kumar, Sidharth Malhotra's 'Brothers' shoot over". Indian Express. 18 April 2015. Retrieved 18 April 2015.
- ↑ Ramachandran, Naman (22 August 2014). "Akshay Kumar to Star in Lionsgate, Endemol Indian Remake 'Warrior'". Variety. Retrieved 22 August 2014.
- ↑ "'Brothers' box-office: Akshay Kumar-Sidharth Malhotra starrer collects about Rs 70.61 crore in 3 weeks". The Times of India. 9 September 2015. Retrieved 18 March 2016.
- ↑ Mehta, Ankita (28 March 2016). "Box office collection: Now 'Kapoor & Sons' to cross Rs 100 crore mark in India; 'Neerja' earns Rs 75 crore". International Business Times. Retrieved 28 March 2016.
- ↑ Sarkar, Suparno (18 March 2016). "'Kapoor & Sons' review round-up: Here is what critics have to say about the rom-com". International Business Times. Retrieved 28 March 2016.
- ↑ Bhattacharya, Ananya (18 March 2016). "Kapoor and Sons movie review: Fawad, Alia, Sidharth in a madhouse drama". India Today. Retrieved 18 March 2016.
- ↑ Joshi, Namrata (18 March 2016). "Kapoor & Sons: The ultimate family film". The Hindu. Retrieved 18 March 2016.
- ↑ "Sidharth Malhotra, Katrina Kaif wrap up 'Baar Baar Dekho'". CNN IBN. 16 April 2016. Retrieved 17 April 2016.[permanent dead link]
- ↑ "Sidharth Malhotra, Jacqueline Fernandez start shooting for their action film". The Indian Express. 8 May 2016. Retrieved 8 May 2016.
- ↑ "Confirmed: Rumoured lovebirds Alia Bhatt and Sidharth Malhotra to star in Aashiqui 3". India Today. 12 April 2016. Retrieved 17 April 2016.
- ↑ "Sidharth Malhotra to be seen in remake of Rajesh Khanna's 'Ittefaq'". Daily News and Analysis. 13 June 2016. Retrieved 14 June 2016.
- ↑ "Sidharth Malhotra to endorse American Swan". The Indian Express. 9 March 2015. Retrieved 9 March 2015.
- ↑ "Varun Dhawan, Alia Bhatt and Siddharth Malhotra unite for a cause | Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 10 August 2013. Retrieved 8 May 2014.
- ↑ "Sidharth Malhotra shoots for PETA". Indian Express. 4 July 2013. Retrieved 8 May 2014.
- ↑ "Throwback Tuesday: Sidharth Malhotra and Varun Dhawan on the sets of 'My Name Is Khan'". Times of India. Archived from the original on 23 March 2018. Retrieved February 13, 2018.
- ↑ "Sidharth Malhotra On 7 Years Of Student Of The Year: "Grateful For The Journey So Far"". Koimoi. 20 October 2019. Archived from the original on 30 September 2022. Retrieved October 20, 2019.
- ↑ "Sidharth Malhotra wraps up Hasee Toh Phasee, excited for The Villain". NDTV. Archived from the original on 15 March 2023. Retrieved September 30, 2013.
- ↑ "Sidharth Malhotra wraps up the shoot of 'Ek Villain'". The Indian Express. 14 April 2014. Archived from the original on 30 September 2022. Retrieved April 14, 2014.
- ↑ "Combat with Akshay Kumar and Sidharth Malhotra in 'Brothers: Clash of Fighters'". Bollywood Hungama. 10 August 2015. Archived from the original on 1 October 2022. Retrieved August 10, 2015.
- ↑ "Sidharth Malhotra thrilled with 'positive' response to 'Kapoor & Sons'". The Indian Express. 19 March 2016. Archived from the original on 1 October 2022. Retrieved March 19, 2016.
- ↑ "Baar Baar Dekho poster: Katrina Kaif, Sidharth Malhotra have some fun". Hindustantimes. 22 April 2016. Archived from the original on 1 October 2022. Retrieved April 22, 2016.
- ↑ "Sidharth Malhotra Goes Rappelling On The Sets Of A Gentleman". Koimoi. 24 July 2017. Archived from the original on 1 October 2022. Retrieved July 24, 2017.
- ↑ "Sidharth Malhotra and Sonakshi Sinha starrer Ittefaq's runtime revealed". Bollywood Hungama. 21 November 2016. Archived from the original on 1 October 2022. Retrieved November 21, 2016.
- ↑ "Yaariyan actress roped in to romance Siddharth Malhotra in Aiyaary!". bollywoodmdb.com. 20 June 2017. Archived from the original on 1 October 2022. Retrieved June 20, 2017.
- ↑ "Jabariya Jodi: Parineeti Chopra teams up with Sidharth Malhotra for a surprise wedding, see first motion poster". hindustantimes. 29 June 2019. Archived from the original on 1 October 2022. Retrieved June 29, 2019.
- ↑ "Sidharth Malhotra shares his look from upcoming film Marjaavaan. See photo". hindustantimes. 7 December 2018. Archived from the original on 1 October 2022. Retrieved December 7, 2018.
- ↑ "Kiara Advani, Sidharth Malhotra Wrap up Shershaah Shoot". News18. 13 January 2020. Archived from the original on 19 April 2021. Retrieved 21 January 2021.
- ↑ "Ajay Devgn and Sidharth Malhotra starrer Thank God goes on floor". Bollywood Hungama. 31 January 2021. Archived from the original on 2 February 2021. Retrieved 21 January 2021.
- ↑ "Confirmed: Sidharth Malhotra and Rashmika Mandanna starrer Mission Majnu to get direct-to-digital release; will premiere on January 20 on Netflix". Bollywood Hungama. 13 December 2022. Archived from the original on 13 December 2022. Retrieved 13 December 2022.
- ↑ "Sidharth Malhotra starts shooting for 'Yodha'". The Times of India. 27 November 2021. Archived from the original on 15 March 2023. Retrieved 27 November 2021.
- ↑ "When Sidharth Malhotra made his debut. No, it wasn't Student of the Year". The Indian Express. 16 January 2023. Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
- ↑ "Sidharth Malhotra: 7 interesting facts about 'Aiyaary' actor". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 16 January 2018. Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.
- ↑ "As Sidharth Malhotra turns 32, here are facts about him we bet you didn't know". The Indian Express (in ఇంగ్లీష్). 16 January 2017. Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.
- ↑ "Indian Police Force: Sidharth Malhotra shoots action sequence with Rohit Shetty; Director shares BTS video". Pinkvilla. 24 May 2022. Archived from the original on 5 June 2022. Retrieved 24 May 2022.
- ↑ "Times Most Desirable Men 2013 – Results". ITimes. Retrieved 22 July 2014.
- ↑ "Times Most Desirable Men 2012 – Results". ITimes. Retrieved 20 June 2013.
- ↑ "Siddharth Malhotra: Karan Johar's new find, Delhi boy Siddharth Malhotra has the dashing looks and a strong screen presence which got him the title of the most promising debutant of the year 2012". The Times Of India.
- ↑ "Meet the Vogue Beauty Awards 2014 winners". 22 July 2014. Retrieved 25 July 2014.