సుధా మూర్తి

భారతీయ రచయిత్రి

పద్మశ్రీ సుధా మూర్తి (కన్నడ: ಸುಧಾ ಮೂರ್ತಿ), ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.[1][2]. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించింది. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడినది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంచించింది.[3][4][5] తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తుంది. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే (డాలర్ కోడలు) ఆంగ్లములో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది.[6]

సుధా మూర్తి
సుధా మూర్తి


రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 మార్చి 2024
సూచించిన వారు ద్రౌపది ముర్ము
నియోజకవర్గం నామినేటెడ్ సభ్యులు (సామాజిక పని & విద్య)

వ్యక్తిగత వివరాలు

జననం (1950-08-19) 1950 ఆగస్టు 19 (వయసు 74)
షిగ్గవి , బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ), భారతదేశం
జీవిత భాగస్వామి ఎన్.ఆర్.నారాయణ మూర్తి
బంధువులు రిషి సునాక్ (అల్లుడు)
సంతానం అక్షతా మూర్తి, అక్షతా మూర్తి
పూర్వ విద్యార్థి *బి.వి.బి సాంకేతిక కళాశాల
వృత్తి పార్లమెంటు సభ్యురాలు & ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్
పిల్లల రచయిత
పురస్కారాలు పద్మశ్రీ (2006)
దాన చింతామణి అత్తిమబ్బే అవార్డు (2010)
పద్మ భూషణ్ (2023)

2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 8న రాజ్యసభకు నామినేట్ చేసింది.[7][8]

బాల్యము , విద్యాభ్యాసము

మార్చు

1950 ఆగస్టు 19 వ సంవత్సరము శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మ ల మధ్య గడిచింది.[9]. ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక How I Taught my Grandmother to Read & Other Stories.[10] అనే పుస్తకాన్ని రచించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్. ఆర్. కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ , ఐ.ఐ.టి కాన్పూర్ లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను ][11][12] , జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లోని నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాల లను[9] ప్రారంభించడానికి భూరి విరాళాలను అందజేసింది.

సుధా ఎలక్టికల్ ఇంజనీరింగ్ పట్టాను బి.వి.బి. సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రధమురాలిగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకొని పూర్తిచేసింది. తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతిలో ప్రధమురాలిగా నిలిచి స్వర్ణపతకం అందుకొని పూర్తిచేసింది.[13]

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ ఐన టెల్కో లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. అప్పటికి ఈ సంస్థలో కేవలము పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్టుకార్డు రాసింది. దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యోకంగ ముఖాముఖి (Interview) నిర్వహించి, అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించాడు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నపుడే ఆవిడకు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరు వివాహం చేసుకోవడానికి దారితీసింది.[14]

ఇన్ఫోసిస్ ఫౌండేషన్

మార్చు

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్ కు, పెట్టుబడిదారీ సంశ్థ ఐన కెటారామన్ వెంచర్స్ సంస్థలకు తెర వెనుక ముఖ్స్య పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు.[15]

పురస్కారాలు

మార్చు
 
పద్మశ్రీపురస్కారం
  1. 2004 - సామాజిక సేవకు గానూశ్రీ రాజా లక్ష్మీ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్, చెన్నై నుండి అందుకున్నారు.[16]
  2. 2006 - భారత ప్రభుత్వము నుండి అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారము , సామాజిక సేవ, దాతృత్వం , విద్యా రంగాలలో ఆమె సేవలకు గౌరవ డాక్టరేటు.[17]
  3. మనదేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందవేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డే తో కలిసి గౌరవ న్యాయ డాక్టరేటు ( honorary LL.D (Doctor of Laws)) .[18]
  4. సాహితీ సేవ , ఆమె రచనలకు ఆర్. కె. నారాయణన్ పురస్కారము.
  5. ఆమె 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అట్ఠిమబ్బే' (Attimabbe) అవార్డు గ్రహీత.[19]
  6. 2023 -పద్మ భూషణ్ అవార్డు[20]
  7. 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. దీనిని కెనడా ఇండియా ఫౌండేషన్ (CIF) వారు ప్రదానం చేసారు. ఆమె భర్త నారాయణ మూర్తి కి ఇదే పురస్కారం 2014 లో లభించింది. వారు ఈ అవార్డు తీసుకున్న మొదటి జంట. దీని విలువ $50,000. ఆమె ఈ మొత్తాన్ని ది ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ (టొరంటో విశ్వవిద్యాలయం) కు విరాళం గా ఇచ్చింది.[21]
 
సుధా మూర్తి పద్మ భూషణ్ పురస్కార ప్రదానం

రచనా వ్యాసంగము

మార్చు

ఈవిడ మంచి రచయిత్రి కూడా. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణా సంస్థద్వారా దాతృత్వం, ఆతిధ్యం , స్వీయ పరిపూర్ణత (self-realization ) లపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.[22] ఈమె రచించిన How I Taught My Grandmother to Read & Other Stories అనే పుస్తకము దాదాపు పదహైదు భాషలలో తర్జుమా చేయబడింది.[22] . ఆమె ఈ మధ్యనే రచించిన గ్రంథము The Day I Stopped Drinking Milk.[22] . ఈవిడ ఇతర రచనలు Wise and Otherwise, Old Man and his God and Gently Falls the Bakula.[22]

రచనలు

మార్చు

ఆమె పిల్లలకు పెద్దవాళ్లకు జీవితం తో నేర్చుకోవలసిన పాఠాలను కధల రూపం లో అందించింది.[19]

  • మదర్ ఐ నెవెర్ న్యూ (Mother I Never Knew: Two Novellas) - 2 నవలలు
  • మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్
  • హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ ఆధర్ స్టోరీస్
  • వైస్ అండ్ అదర్ వైస్
  • మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్
  • 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్సట్రార్డినరీ లైవ్స్ (Three Thousand Stitches: Ordinary People, Extraordinary Lives)
  • గ్రాండ్ మా'స్ బాగ్ అఫ్ స్టోరీస్
  • అమ్మమ్మ చదువు (పుస్తకం)

మూలాలు

మార్చు
  1. Ratan Tata, Rahul Dravid on Gates Foundation board Archived 2013-05-22 at the Wayback Machine. tata.com (2003-07-15). Retrieved on 2011-12-08.
  2. Gates Foundation's AIDS initiative launched Archived 2003-12-31 at the Wayback Machine. The Hindu (2003-12-06). Retrieved on 2011-12-08.
  3. Sudha Murthy: Humility personified. Business-standard.com (2011-01-23). Retrieved on 2011-12-08.
  4. I'm enjoying my acting stint: Sudha Murthy – Times Of India. Timesofindia.indiatimes.com. Retrieved on 2011-12-08.
  5. http://www.murtylibrary.com/
  6. The Sunday Tribune – Spectrum – Article. Tribuneindia.com (2001-09-30). Retrieved on 2011-12-08.
  7. Eenadu (9 March 2024). "ఏడాదికి 265 సినిమాలు.. కాశీలో షాపింగ్‌ని వదిలేశా." Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  8. TV9 Telugu (8 March 2024). "రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి నామినేట్". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. 9.0 9.1 Karnataka / Bangalore News : Director thanks Dharam Singh Archived 2007-12-12 at the Wayback Machine. The Hindu (2005-08-29). Retrieved on 2011-12-08.
  10. About Mrs. Narayan Murthy Archived 2013-05-19 at the Wayback Machine. Nipun.charityfocus.org (1978-02-10). Retrieved on 2011-12-08.
  11. New CSE Building, IIT Kanpur Archived 2010-02-02 at the Wayback Machine. Iitk.ac.in. Retrieved on 2011-12-08.
  12. Infosys chief Narayan Murthy rejects govt offer – Times Of India Archived 2013-12-12 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com (2002-01-04). Retrieved on 2011-12-08.
  13. Sudha Murthy | The Woman Behind | Narayan Murthy Wife Archived 2012-07-15 at Archive.today. Living.oneindia.in (2011-08-17). Retrieved on 2011-12-08.
  14. JRD's words inspired me in philanthropy: Sudha Murthy Archived 2013-05-22 at the Wayback Machine. tata.com (2002-10-23). Retrieved on 2011-12-08.
  15. Sudha Murthy sells shares to fund Catamaran Archived 2014-02-01 at the Wayback Machine. Siliconindia.com. Retrieved on 2011-12-08.
  16. National : Raja-Lakshmi Award for Sudha Murty Archived 2014-01-18 at the Wayback Machine. The Hindu (2004-08-15). Retrieved on 2011-12-08.
  17. Tamil Nadu / Chennai News : Honorary doctorates for seven eminent personalities Archived 2007-12-03 at the Wayback Machine. The Hindu (2006-09-04). Retrieved on 2011-12-08.
  18. Santosh Hegde, Sudha Murthy to be conferred honorary doctorate. Deccanherald.com. Retrieved on 2011-12-08.
  19. 19.0 19.1 "7 Best Books by Sudha Murthy you Must Read in 2023". The Economic Times. 2 May 2023. Retrieved 3 October 2023.
  20. Andhra Jyothy (5 April 2023). "కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం". Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.
  21. Bhalla, Gursharan (2 October 2023). "Sudha Murthy becomes first woman to get Global Indian Award". Indiatimes. Retrieved 3 October 2023.
  22. 22.0 22.1 22.2 22.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-10. Retrieved 2013-03-07.