సురేష్ కుమార్ షెట్కర్

సురేష్ కుమార్ షెట్కర్ (జననం 8 ఆగస్టు 1960) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 15వ లోక్‌సభలో జహీరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[1] 2004 నుండి 2009 వరకు నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశాడు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు.[2][3][4]

సురేష్ కుమార్ షెట్కర్
సురేష్ కుమార్ షెట్కర్


మాజీ పార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలం
1 జూన్ 2009 – 1 జూన్ 2014
ముందు పటోళ్ల కృష్ణారెడ్డి
తరువాత పటోళ్ల కృష్ణారెడ్డి
నియోజకవర్గం జహీరాబాదు లోకసభ నియోజకవర్గం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-08-08) 1960 ఆగస్టు 8 (వయసు 63)
నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఉమ
సంతానం గిరిజ, రాకేష్, శివాని
నివాసం నారాయణ్‌ఖేడ్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం సవరించు

సురేష్ 1960, ఆగస్టు 8న శివరావు - చంద్రమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ పట్టణంలో జన్మించాడు. సురేష్ మహారాష్ట్రలో పర్భణీ పట్టణంలోని మరాఠ్వాడా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో బిఎస్సీ (వ్యవసాయం) వరకు చదివాడు.

స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన సురేష్ తాత అప్పారావు షెట్కర్, నారాయణఖేడ్ అసెంబ్లీ నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యాడు. సురేష్ తండ్రి శివరావు షెట్కర్ న్యాయవాది, నారాయణఖేడ్ అసెంబ్లీ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

వ్యక్తిగత జీవితం సవరించు

సురేష్ షెట్కార్ కుటుంబంలో 2వ సంతానం కాగా, ఒక సోదరి-3 సోదరులు ఉన్నారు. సురేష్ కు 1986, మే 20న ఉమతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయరంగం సవరించు

సురేష్ తండ్రి శివరావు షెట్కర్ అనుచరుడైన పి. కిష్టారెడ్డికి ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు. దాంతో సురేష్ 2004లో స్వతంత్రంగా పోటీచేసి మొదటిసారి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తరువాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున జహీరాబాద్ లోక్ సభకు పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ ఆలీపై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి పోటిచేసి (మూడోస్థానం) ఓడిపోయాడు.[6] 2019లో జహీరాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి బి.బి. పాటిల్ చేతిలో ఓడిపోయాడు.[7]

నిర్వర్తించిన పదవులు సవరించు

 • 1991 - 1998: మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
 • 2002 - 2008: మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
 • 2004 - 2009: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 • 2009 - 2014: 15వ లోక్‌సభ సభ్యుడు
 • 2009, ఆగస్టు 31- 2014: రసాయనాలు, ఎరువులపై కమిటీ సభ్యుడు

మూలాలు సవరించు

 1. "Election Commission of India". Archived from the original on 2009-05-19. Retrieved 2021-11-27.
 2. And the senior Vice President of Telangana Pradesh Congress Committee
 3. Reddy, R. Ravikanth (2021-06-26). "Revanth new chief of Telangana Congress". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-11-27.
 4. "The Hindu : Andhra Pradesh / Hyderabad News : Congress MPs' clamour for 'safe' seats". web.archive.org. 2009-03-14. Archived from the original on 2009-03-14. Retrieved 2021-11-27.
 5. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
 6. "Suresh Kumar Shetkar(Indian National Congress(INC)):Constituency- NARAYANKHED(SANGAREDDY) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-11-27.
 7. "Zahirabad Lok Sabha Election Result 2019". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-27.