సూర్యాపేట జంక్షన్ (సినిమా)
సూర్యాపేట జంక్షన్ 2023 లో పొలిటికల్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా. యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, వంగర విష్ణువర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ 2023 ఫిబ్రవరి 2న విడుదల చేసారు.[1]
సూర్యాపేట జంక్షన్ | |
---|---|
దర్శకత్వం | రాజేష్ నాదెండ్ల |
రచన | రాజేంద్ర భరద్వాజ్ సత్య ఋషి |
నిర్మాత | అనీల్ కుమార్ కాట్రగడ్డ ఎన్ శ్రీనివాస్ రావు వంగర విష్ణువర్ధన్ |
తారాగణం | ఈశ్వర్ నైనా సర్వర్ అభిమన్యు సింగ్ |
ఛాయాగ్రహణం | అరుణ్ ప్రసాద్ |
కూర్పు | ఎమ్ ఆర్ వర్మ |
సంగీతం | రోషన్ సాలూరి |
నిర్మాణ సంస్థ | యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ |
సినిమా నిడివి | 150 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఈశ్వర్ (అర్జున్)
- నైనా సర్వర్ (జ్యోతి)
- అభిమన్యు సింగ్ (నరసింహ)
- లక్ష్మణ్ మీసాల
- భాషా
- హరీష్
- సూర్య
- ఐరేని మురళీధర్ గౌడ్
- వేణు
- చమ్మక్ చంద్ర
- చలాకీ చంటి
- పూజ (ప్రత్యేక గీతం)
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
- నిర్మాతలు: అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, వంగర విష్ణువర్ధన్
- దర్శకత్వం: రాజేష్ నాదెండ్ల
- కథ: ఈశ్వర్
- మాటలు: రాజేంద్ర భరద్వాజ్, సత్య ఋషి
- సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి
- సినిమాటోగ్రఫీ : అరుణ్ ప్రసాద్
- ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్
- ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ
- సౌండ్ డిజైన్: పద్మారావు
- సౌండ్ ఎఫెక్ట్స్ : ద్వని స్టూడియోస్
- విజువల్ ఎఫెక్ట్స్: సోమేశ్
- ఫైట్స్: రామకృష్ణ, మల్లేష్
- కోరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, చక్రి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.పాండు
చిత్ర నిర్మాణం
మార్చురాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రకృతి అందాలతోపాటు షూటింగ్‌కు అనువుగా ఉన్న హైదరాబాద్, సూర్యాపేట, నర్సాపూర్ [2] పరిసర ప్రాంతాల్లో 45 రోజులపాటు చిత్రీకరణ జరుపుకుంది.[3] ఈ చిత్రంలో అర్.ఎక్స్ 100 ఫేమ్ పూజ నర్తించిన 'మ్యాచింగ్ మ్యాచింగ్' అనే ఐటమ్ సాంగ్ ని 2023 ఫిబ్రవరి 26న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాదులో టీ20 మ్యాచ్ క్రికెట్ కప్ విన్నర్స్ చేతుల మీదుగా విడుదల చేసారు.[4]
సంగీతం
మార్చునేపథ్యసంగీతంతో పాటు పాటు రెహమాన్ రాసిన మూడు పాటలకు రోషన్ సాలూరి సంగీతం అందించారు. గౌరహరి ఓ ప్రత్యేక గీతాన్ని రచించి స్వరపరిచారు. టిప్స్ మ్యూజిక్ కంపనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]
సూర్యాపేట జంక్షన్ - Full Songs Jukebox యూట్యూబ్లో |
సం. | పాట | నేపధ్య గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "మేరె యారా" | రాహుల్ సిప్లిగంజ్ , కోరస్ | |
2. | "చెంగు చెంగున" | సాయి చరణ్ , కోరస్ | |
3. | "ఒక ప్రాణం" | శ్రీకృష్ణ (గాయకుడు) | |
4. | "మ్యాచింగ్ మ్యాచింగ్" | కీర్తన శర్మ, గౌర హరి |
మూలాలు
మార్చు- ↑ "కొత్తగా మా ప్రయాణం' చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన 'సూర్యాపేట్ జంక్షన్' చిత్రం టీజర్ విడుదలైంది". చిత్రజ్యోతి. 7 February 2023. Retrieved 7 August 2023.
- ↑ "యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్". Manatelangana=22 September 2022. Retrieved 7 August 2023.
- ↑ "షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'సూర్యాపేట జంక్షన్'". సాక్షి. 23 September 2022. Retrieved 7 August 2023.
- ↑ "Suryapet Junction Movie Song Launch". ఫిల్మి ఫోకస్. 27 ఫిబ్రవరి 2023. Retrieved 7 August 2023.
- ↑ "'RX 100' famed Pooja's 'Suryapet Junction' team released the item song 'Matching Matching' with CCC Cup winners". Timesofindia. 28 February 2023. Retrieved 7 August 2023.