సేలం
సేలం, pronunciation (help·info), తమిళం: சேலம் భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న ఒక నగరం, నగరపాలక సంస్థ. ఇది భారత దేశంలో దక్షిణాది రాష్ట్రంలో ఉత్తర మధ్య ప్రాంతంలో ఉంది.[4] సేలం, కొంగు నాడు అనబడే పశ్చిమ తమిళ ప్రాంతం విభాగం. ఇది తమిళనాడుకు పడమటి వైపు ఉంది. దాదాపు అన్ని వైపుల కొండలు చుట్టుముట్టి ఉన్న సేలం, ప్రసిద్ధ పర్యాటకుల ప్రదేశమైన ఏర్కాడ్ కొండల దిగువన ఉంది[5]. ఈ కొండలు ఎక్కుతున్నపుడు, పైనుండి చూసేటప్పుడు అతి సుందరమైన, అధ్బుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. కిళియూర్ జలపాతం వంటి కొన్ని సుందరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.[6] సరాసరి సముద్ర మట్టం నుండి ఎర్కాడ్ 1600 మీ ఎత్తున ఉంది. ఉత్తరంలో నగరమలై, దక్షిణంలో జరుగుమలై, పశ్చిమలో కంజమలై, తూర్పులో గోడుమలై వంటి ప్రకృతిసిద్దమైన కొండల మధ్యలో ఈ నగరం ఉంది. తిరుమణి ముతూర్ అనే నది ఈ నగర మధ్యలో ఉంది. కోట ప్రాంతమే ఈ నగరం యొక్క అత్యంత పురాతన ప్రదేశం.[7]
సేలం | |
---|---|
నగరం | |
Nickname(s): స్టీల్ సిటీ[1] మాంగో సిటీ | |
Coordinates: 11°39′N 78°10′E / 11.65°N 78.16°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
ప్రాంతం | కొంగునాడు |
జిల్లా | సేలం |
Government | |
• Type | మేయర్-కౌన్సిల్ |
• Body | సేలం సిటీ మ్యునిసిపల్ కార్పొరేషన్ |
• మేయర్ | ఖాళీ |
విస్తీర్ణం | |
• నగరం | 161 కి.మీ2 (62 చ. మై) |
• Rank | 7 |
Elevation | 287 మీ (942 అ.) |
జనాభా (2011)[2] | |
• నగరం | 8,29,267 |
• Rank | 6 |
• జనసాంద్రత | 9,079/కి.మీ2 (23,510/చ. మై.) |
• Metro | 9,17,414 |
భాషలు | |
• అధికార | తమిళం |
• మాట్లాడే భాషలు | తమిళం, ఇంగ్లీషు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ నెంబరు | 636xxx |
టెలిఫోన్ కోడ్ | +91-427 |
Vehicle registration | TN-27, TN-30, TN-54, TN-90 |
ప్రారంభ చరిత్ర
మార్చుకొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే హాయ్ లేదా శల్య లేదా సయిలం అనే పదాలనుండి సేలం అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం, పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో చేర, కొంగు రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడుకు చెందిన కురునిల మన్నర్గళ్ అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు. స్థానిక జానపదకథల ప్రకారం తమిళ కవయిత్రి అవ్వయ్యార్ సేలం లోనే జన్మించింది. గంగా వంశానికి చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరం కొంగు నాడు మధ్యలో ఉంది[5].
తరువాత సేలం పశ్చిమ గంగా రాజవంశంలో భాగమయి, చాలా కాలం గంగాకులం పాలకులు చేత పరిపాలించబడింది. విజయనగర సామ్రాజ్యము, దక్షిణ దండయాత్రలో భాగంగా తమిళనాడుని ఆక్రమించినప్పుడు, సేలం మధురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత, సేలానికి చెందిన గట్టి ముదలిలు పోలిగర్లు పరిపాలించి, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు, కోటలను నగరం లోపలా బయటా నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, మైసూర్-మధురై యుద్ధం అని పిలవబడే దీర్ఘకాల వైరం తరువాత సేలం హైదర్ అలీ అధీనంలోకి వచ్చింది. తరువాత 1768 ప్రారంభంలో సేలంని హైదర్ అలీ నుండి కర్నల్ వుడ్ తీసుకున్నారు.[5] 1772 సంవత్సరము చివరిలో హైదర్ అలీ సేలంని మళ్ళీ కైవసం చేసుకున్నారు. 1799లో లార్డ్ క్లైవ్ అధ్వర్యంలో సేలం మల్లి సంకరిదుర్గ్ లో ఉన్న సైన్య దళానికి చెందిన ఒక విభాగం చేత ఆక్రమణక గురయి, 1861 వరకు, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించేవరకు, ఒక సైన్య స్థావరం లాగ ఉండేది. మాగ్నం చౌల్ట్రి (ప్రస్తుతం మగుడన్ చావడి అని పేరు మార్చబడింది) వంటి స్థలాలు ఇక్కడ చూడవచ్చు. దీరన్ చిన్నమలై కాలములో సేలం, సంకగిరి వంటి ప్రాంతాలలో కొంగు సైన్యం, బ్రిటిష్ అలైడ్ సైన్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రఖ్యాతి పొందిన కొంగు నాయకుడు తీరన్ చిన్నమలై సంకగిరి కోటలో ఆడి పెరుక్కు రోజు న ఘోరంగా ఉరి తీయబడ్డాడు. ఈ స్థలమే తరువాత బ్రిటిష్ వాళ్ల ప్రధాన సైన్య శిబిరముగా మారింది.
భౌగోళికం వాతావరణం
మార్చుసేలం 11°40′10″N 78°08′27″E / 11.669437°N 78.140865°E[8] వద్ద సముద్ర మట్టానికి సగటున 278 మీటర్లు (912 అడుగులు) ఎత్తులో ఉంది. సేలం చుట్టూ కొండలు ఉన్నాయి. ప్రదేశం మొత్తం చిన్నకొండలుతో నిండి ఉంది.[9]
పరిపాలన
మార్చుసేలం నోడల్ ప్లానింగ్ ఏజెన్సీ సేలం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సేలం మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని నిర్వహిస్తుంది.
రాజకీయాలు
మార్చుసేలంలో మూడు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి: సేలం ఉత్తరం, సేలం దక్షిణం, సేలం పశ్చిమ. ఈ మూడూ సేలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. [10]సేలం రామస్వామి ముదలియార్, సి.విజయ రాఘవాచారియార్, పగడాల నరసింహ నాయుడు, సి. రాజగోపాలచారి, డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలానికి చెందిన వాళ్లే. మోహన్ కుమారమంగళం, ఇందిరా గాంధీ మంత్రిమండలిలో ఇనుం, ఉక్కు మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వీరప్ప ఆరుముగం (డి.ఎం.కే నేత) ఈ నగరానికి చెందిన వాడు.
జనాభా
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1871 | 50,012 | — |
1881 | 50,667 | +1.3% |
1891 | 67,710 | +33.6% |
1901 | 70,621 | +4.3% |
1911 | 59,153 | −16.2% |
1921 | 52,244 | −11.7% |
1931 | 1,02,179 | +95.6% |
1941 | 1,29,702 | +26.9% |
1951 | 2,03,052 | +56.6% |
1961 | 2,49,145 | +22.7% |
1971 | — | |
1981 | — | |
1991 | 3,66,712 | — |
2001 | 6,96,760 | +90.0% |
2011 | 8,29,267 | +19.0% |
2011 జనాభా లెక్కల ప్రకారం సేలం జనాభా 826,267. వారిలో ప్రతీ 1000 మంది పురుషులకు 987 మంది స్త్రీలు కలరు.[11] వారిలో 79,067 మంది ఆరేళ్ళ లోపు వారు. వారిలో 40,570 పురుషులు, 38,497 స్త్రీలు. ఈ నగర అక్షరాస్యత రేటు 76.37%. ఇది జాతీయ సరాసరి 72.99% కంటే ఎక్కువ. సేలంలో 215,747 కుటుంబాలున్నాయి. మొత్తం 332,147 కార్మికులు: 1599 రైతులు, 3,040 వ్యవసాయ కార్మికులు, 32,597 పారిశ్రామిక కార్మికులు, 16010 మంది పార్టు టైమ్ పనివారు.[2] మతపరమైన గణాంకాల ప్రకారం 2011 నాటికి 89.79% హిందువులు, 7.48% ముస్లింలు, 2.36% క్రిస్టియన్లు, 0.11% జైనులు, 0.02% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.2%, ఇతర మతాల వారు 0.02% ఉన్నారు.[12] సేలంలో మాట్లాడే ప్రధాన భాష కొంగు తమిళం . సేలంలో జైనులు, మార్వాడీలు వంటి వ్యాపారంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్నారు. వీళ్ళు తమిళంలో మాట్లాడటానికి నేర్చుకున్నారు. ఈ నగరం గత రెండు దశాబ్దాలలో గణనీయంగా వృద్ది చెందింది. ఈ విషయం అధికారిక జనాభా లెక్కను బట్టి తెలుస్తుంది. 1991లో జనాభా: 499,024 & 2001లో జనాభా: 696,760.
2001 నాటి భారత జనగణన ప్రకారం, సేలం పట్టణ సరిహద్దు ప్రాంతాలతో కలిపి మొత్తం జనాభా 751,438 గా ఉంది. వీటిలో సేలం మునిసిపల్ కార్పోరేషన్ (696,760), కొండలంపట్టి (16,808), కన్నన్ కురిచి (14,994) నెయ్క్కరపట్టి (9,869), మల్లమూప్పాంపట్టి (6,783), దలవైపట్టి (6,224) ఉన్నాయి. జనాభాలో పురుషులు 64%, స్త్రీలు 36%. సేలంలో సగటు అక్షరాస్యత రేటు 77%, ఇది జాతీయ సగటు 64.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 82%,, స్త్రీలలో అక్షరాస్యత 72%. సేలంలో 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు.
వినోదం
మార్చుచలనచిత్ర థియేటర్ లు
మార్చుచలనచిత్ర థియేటర్ ల నగరంగా సేలానికి ఎంతో కాలంగా పేరు ఉంది. ఒక ప్రత్యేకత ఏమంటే కిట్చిపాలయం అనే ఒక ప్రదేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో చలనచిత్ర థియేటర్ లు ఉన్నాయి. 1980లలో అత్యధికంగా దాదాపు 28 థియేటర్ లు, హాలివుడ్ చిత్రాలు, డబ్ చేయబడిన చిత్రాలు, పాత చిత్రాలు వంటి అన్ని రకాల చిత్రాలను ప్రదర్శిస్తూ ఉండేవి. అయితే కొన్ని థియేటర్లు మూసివేయడంతో ప్రస్తుతం సుమారు 15 థియేటర్ లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి కూడా సుమారు 15 థియేటర్ లు నడుస్తూనే ఉన్నాయి. ఎ.ఆర్.ఆర్.ఎస్ ముల్టిప్లేక్స్, బిగ్ సినిమాస్ వంటివి కొన్ని ప్రసిద్ధి చెందిన థియేటర్ లు.
షాప్పింగ్ మాల్స్
మార్చుఈమధ్య కాలములో అతి పెద్ద షాపింగ్ కేంద్రాలలో ఒకటిగా సేలం మారుతూ వస్తుంది. శారదా కాలేజ్ రోడ్, ఓమలుర్ రోడ్ లలు షాప్పింగ్, రిటైల్ రంగంలో గొప్ప అభివృద్ధి జరిగింది. స్వర్ణాంబిగై ప్లాజా, కందస్వర్ణ షాప్పింగ్ మాల్, వి.వి షాప్పింగ్ ప్లాజా, తుల్సి రిటైల్, కందస్వర్ణ మెగా మాల్, స్పెన్సర్స్, మోర్ ఫర్ యు, నిల్గిరిస్, ఏర్పోర్ట్ వంటివి. అనేక హోటల్ లు, రెస్టారెంట్ లు కూడా ఈ నగరంలో ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ
మార్చుస్త్రీలలో చాలా ప్రసిద్ధమైన సాంప్రదాయక వెండి కడియాలు తయారు చేసే ముఖ్యమైన ప్రదేశాల్లో సేలం ఒకటి.[13] ఈ నగరంలో వస్త్రం, ఉక్కు, వాహన, కోళ్ళ పెంపకం, సగ్గుబియ్యం రంగాల్లో బారి పరిశ్రమలు ఉన్నాయి.[14] భారత దేశం లోనే అతి పెద్ద మగ్నేసైట డిపాసిట్ కలిగి ఉన్న ప్రదేశాలలో సేలం ఒకటి. డాల్మియా, టిఎఎన్ఎంఎజి వంటి సంస్థలకు ఇక్కడ గనులు ఉన్నాయి.[15] వ్యవసాయ వస్తువులకు సంబంధించిన అతి పెద్ద ప్రాంతీయ మార్కట్ లలో లే బజార్ మార్కట్ ఒకటి.[ఆధారం చూపాలి] సేలంలో ఒక క్రియాశీలమైన చిత్ర నిర్మాణ రంగం ఉండేది. రత్నా స్టూడియో, పూర్వపు మోడరన్ థియేటర్స్ తమిళ చిత్ర నిర్మాణ రంగానికి ముఖ్య కేంద్రంగా ఉండేవి.[ఆధారం చూపాలి] ప్రస్తుతం మూసివేయబడిన మాడేర్న్ థియేటర్స్, కొన్ని అధ్బుత విజయాలు సాధించిన తమిళ చిత్రాలను నిర్మాణం చేసింది. వీటిలో పూర్వపు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ వంటి అతి పెద్ద నటులు నటించారు. అయితే ప్రస్తుతం సేలంలో స్టూడియోలు లేవు.
ఎగుమతి సరకులు
మార్చువస్త్ర ఎగుమతిలో, 1930ల నాటి నుండే, సేలం ఎంతో ప్రఖ్యాతి పొందింది. అల్లిన వస్త్ర ఎగుమతి రంగంలో తిరుపూరు ఈ మధ్య గొప్ప అభివృద్ధి సాధించే వరకు వస్త్రాలు / బట్టలు ఎగుమతి చేసే ముఖ్యమైన ప్రదేశంగా సేలం ఉంది. సేలం మామిడి పండ్లకు కూడా చాలా ప్రసిద్ధి. సేలం మామిడి పండ్లు ప్రపంచమంతటా ఎగుమతి చేయబడుతాయి. నియంత్రించబడిన మావిడి గుజ్జు ఎగుమతి కొరకు సేలం దగ్గర ఒక మావిడి గుజ్జు కర్మాగారం స్థాపించడానికి ఏర్పాటులు జరుగుతున్నాయి.
ప్రత్యేక ఆర్తిక ప్రాంతాలు (సెజ్)
మార్చుఅతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో ఒకటైన సేలం నగరంలో, తమిళనాడు ప్రభుత్వం, ELCOT 160 ఎకరాలు (0.65 కి.మీ2) విస్తీరణంలో ఒక ఐటి పార్క్ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నారు.[16][17] సేలం ఉక్కు కర్మాగారంలో 250 ఎకరాలు (1.0 కి.మీ2) విస్తీరణంలో ఒక ఉక్కు సెజ్ ని స్థాపించడానికి SAIL ప్రణాళిక వేస్తూ ఉంది.[18] సేలం నగరంలో సూరమంగళం ప్రాంతంలో ఒక ప్రత్యేక ఎలెక్ట్రికల్, ఎలేట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది.[19]
మతపరమైన స్థలాలు
మార్చుసేలంలో అనేక మారియమ్మన్ దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది జూలైలో ఒక పక్షం రోజులపాటు నగరంలో మారియమ్మన్ తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళప్పుడు, మారియమ్మన్ దేవత ఆభరణాలు, పూల రథాలతో అలంకరంచిబడి, అర్ధరాత్రి సమయములో ఊరేగింపుగా తీసుకువెళ్ల బడుతుంది. తిరుణాలు మొదటి ముఖ్యమైన రోజున, జనం ప్రార్థనలు చేసుకుంటూ నిప్పు మీద నడుస్తారు. (గమనిక: భక్తులు నిప్పుని పువ్వు అని పిలుస్తారు) రెండవ రోజు అనేక విచిత్ర వేషధారణలతో రంగు రంగులగా ఉంటుంది. రాష్ట్రం లోని అమ్మన్ దేవాలయలాల్లో ఉన్న రథాల్లలో షేవపేట్ మారియమ్మన్ దేవాలయ రథం చాలా పెద్దది. ఈ తిరుణాలు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. కొట్టి మారియమ్మన్ దేవాలయం సేలం లోనే కాకుండా తమిళనాడు అంతట చాలా ప్రసిద్ధి.
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "వైకుంఠ ఏకాదశి" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు. బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యాణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమం అని పిలవబడే శ్రీ హనుమాన్ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు శ్రీ హనుమాన్ జయంతి; శ్రీ రామనవమి, నూతన సంవత్సర వేడుకలు . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన రామాయణ లోని సుందర కాండం ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. సుందర కాండాన్ని భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని శ్రీ హనుమాన్ శ్రద్ధగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టిలో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది మురుగ దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరంనుండి 5 కి.మీ దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ఇస్కాన్ ఆశ్రమం కూడా సేలంలో ఉంది. వైకాల్ పట్టరైలో ఒక నరసింహ స్వామీ గుడి, కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి. సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు, కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్, కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ధి చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన అరాబిక్ చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి. వాయికాల్పట్టారైలో ఒక స్వామీ నరసింహార్ గుడి, కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
సేలం లోని ఫోర్ రోడ్స్ లో ఇన్ఫాంట్ జేసస్ చర్చి ఉంది. 1930లో సేలం యొక్క రోమన్ కాతోలిక్ డయోసెస్ పీటం నగరంలో ఏర్పాటయింది. సెబాస్టియన్ సింగరోయన్ బిషప్ గా ఉన్నారు. ఇన్ఫంట్ అఫ్ జేసస్ కదీడ్రల్ గా ఉంది. గాంధి రోడ్ ప్రాంతం పక్కన ఉన్న ఈడన్ గార్డన్స్ స్కూల్ లో ఒక ప్రార్థన మందిరం ఉంది. ఇది ఎల్ఇఎఫ్ గా పనిచేస్తుంది.
ఒక్కొక్క కుటుంబానికి కులదైవం అని పిలవబడే విశేషమైన దేవుళ్ళకు కూడా వివిధ దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు అయ్యనారప్పన్ దేవాలయం, మా కుటుంబ దేవాలయం ఓమలుర్ లో మాలకోండనూర్ లో ఉంది. వేరొక కుటుంబానికి అయ్యనారప్పన్ గుడి పప్పరపట్టిలో ఆత్యంపట్టి చెరువులో ఉంది. ఈ గుడిలో తేవం (విందు) చాలా ప్రసిద్ధి. అప్పుడు తమిళ్ నాడు, చుట్టు పక్కనుండి లక్షలాది జనం పాల్గొంటారు....
సేలం నగరం నుండి సుమారు 10 కి.మీ దూరంలో ఈలంపిల్లై వెళ్లే దారిలో సిదర్ కొయిల్ అనే ఒక పురాతనమైన ప్రసిద్ధి చెందిన గుడి ఉంది. (సిదర్ లు అధ్బుతాలు చేయగలే ఋషులు- వాళ్లు రూపొందించిన ఒక వైద్య విధానం ఇప్పటికి వాడబడుతుంది). పక్కనే ఉన్న కంజమలైలో ఒక ప్రసిద్ధ సిదర్ ఉండేవారని అయిన ఇక్కడే సమాధి పొందారని నమ్మకం. ప్రతి అమావాస్య రోజు స్థానికలు ఈ గుడికి తరలి వచ్చి, ఔషధ విలువల కలిగి ఉందని నమ్మబడుతున్న నదిలో స్నానమాడుతారు.
ఏర్కాడ్
మార్చుభారతదేశం లోని తమిళ్ నాడులోని సేలంలో ఉన్న ఒక హిల్ స్టేషను ఏర్కాడ్. ఇది ఈస్టర్న్ ఘాట్ లలో ఉన్న సేర్వరాయన్ పర్వత శ్రేణిలో (స్గేవరాయ్స్ అని ఆంగ్లంలో చెప్పబడుతుంది) ఉంది. ఇది సముద్ర మట్టానికి 1515 మీటర్ల (4969 అడుగు) ఎత్తులో ఉంది. ఈ ఊరి పేరు ఊరు మూలలో ఉన్న చెరువు పేరునుండి వచ్చింది - తమిళ్ లో "ఏరి" అంటే "చెరువు", "కాడు" అనగా "అడవి". ఏర్కాడ్ కాఫీ తోటలకు, ఆరంజ్ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ బొటానికల్ సర్వ్ అఫ్ ఇండియా ఆద్వర్యంలో నడపపడుతున్న ఒక ఆర్కిడారియం కూడా ఉంది. ఏర్కాడ్ లో ఉచ్చిష్ట స్థలం సేరరాయన్ గుడి. అందువల్ల ఏర్కాడ్ కొండ ప్రాంతాన్ని షేవరాయ్ హిల్స్ అని పిలుస్తారు. ఏర్కాడ్ పేదల ఊటీ అని కూడా పిలవబడుతుంది.
చిత్రమాలిక
మార్చు-
ఏర్కాడ్ పక్కన కిలియూర్ జలపాతం
-
పాగోడ పాయింట్ పక్కన రైన్బో
-
రాత్రి పూట సేలం నగర దృశ్యం
-
ఏర్కాడ్ లో ఒక ప్రశాంతమైన వీధి
-
బోటింగ్ చెరువు
-
డ్రై సీసన్ ఫాల్స్
-
కొండలలో జలపాతం
-
ఏర్కాడ్ లో లెక్ వియూ
రవాణా
మార్చుచెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం, కోయంబతూర్, మదురై, ఎర్నాకుళం/కోచిన్, పాండిచేరి, తిరుచి, కన్యాకుమారి వంటి ప్రదేశాలకు వెళ్లే మార్గ మధ్యంలో సేలం ఉంది.
రహదారులు
మార్చుజాతీయ రహదారులు
మార్చుసేలం మీదగా మూడు ముఖ్యమైన జాతీయ రహదారులు వెళుతున్నాయి.
- జాతీయ రహదారి 7 (ఉత్తరం-దక్షిణం),
- జాతీయ రహదారి 47 (పశ్చిమ వైపు వెళ్లే),
- జాతీయ రహదారి 68 (తూర్పు వైపుకు వెళ్లే) సేలంలో కలుస్తాయి.
బస్సు స్టేషన్లు
మార్చుసేలంలో 2 పెద్ద బస్సు స్టేషను;ఉ ఉన్నాయి. అవి -:
- MGR ఇంటేగ్రేటడ్ బస్ టెర్మినస్. సెంట్రల్ బస్ టెర్మినస్ అని కూడా పిలువబడుతుంది (కొత్త బస్ స్టాండ్) - పరిసర ప్రాంతాల మార్గాలు
- టౌన్ బస్ స్టేషను (పాత బస్ స్టాండ్) - స్థానిక మార్గాలు, ఊరిలో రద్దీగా ఉన్న ప్రాంతాలు.
రైలు రవాణా
మార్చుగ్రేట్ సేలం డివిషన్ ఏర్పడిన తరువాత అలంకరణ పనులు చేయబడ్డాయి. సేలం రైల్వే డివిషన్ యొక్క మొత్త పొడవు 842 కి.మీ.. సేలం జంక్షన్ ఆరు రైల్వే మార్గాలు కలిసే ఒక జంక్షన్. అందువల్ల అది దక్షిణ భారత దేశంలో ఒక ముఖ్యమైన రవాణా క్షేత్రం. అనేక రైళ్ళు సేలం జంక్షన్ మీదగా వెళుతున్నాయి. సేలం నుండి నేరుగా వెళ్లే రైళ్ళు ఇవి (మార్గాలతో పాటు):
సేలం జంక్షన్ మీదగా వెళ్లే రైళ్ళు (వైపు / వయా) | పెద్ద నగరాలకు [b] నేరుగా వెళ్ళే ట్రైన్ లు [/b] |
---|---|
1.జోలార్పేటై వైపు
(వయా) మాగ్నేసైట్ జంక్షన్ |
|
2.బెంగళూరు వైపు
(వయా) ఓమలుర్ జంక్షన్ |
|
3.మేట్టూర్ డాం
(వయా) ఓమలుర్ జంక్షన్) |
మేట్టూర్ డాం |
4. ఈరోడ్ వైపు
(వయా) సంకగిరి |
|
5.వ్రిధాచలం వైపు
(వయా) సేలం టౌన్ |
|
ఈ ఆరు రైల్వే మార్గాలు కాకుండా, సేలం నుండి ఉక్కు కర్మాగారానికి ఒక సరకు రైలు మార్గం కూడా ఉంది. చెన్నై నుండి కోయంబతూర్ / కేరళ (తూర్పు-పడమట), బెంగళూరు నుండి దక్షిణాది జిల్లాలకు [ఉత్తరం-దక్షిణం] వెళ్ళే రైళ్ళు సేలం మీదగా వెళ్తాయి. అందువల్ల ఇది ఒక ముఖ్యమైన రవాణా క్షేత్రం. 2007లో, సేలం ఒక రైల్-డివిజన్ అయింది. దీన్ని 2007 నవంబరు 1 నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి, పూర్వ భారత రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాంచనంగా ప్రారంభించారు.[20] కేరళ లోని పాలక్కాడ్ రైల్ డివిజన్ నుండి సేలం రైల్-డివిజన్ ని ఏర్పరిచారు. ఇందువల్ల ఈ రెండు రాష్ట్రాలకు మధ్య అభిప్రాయభేదం ఏర్పడింది. సేలం నుండి భయిలుదేరే ముఖ్యమైన రైళ్ళు-
- చెన్నై-సేలం ఎక్స్ ప్రెస్ ఇది కాక,
- ఏర్కాడ్ ఎక్స్ ప్రెస్ కూడా సేలం నుండి ఒక ముఖ్యమైన ట్రైన్. ఇది పూర్వం సేలం నుండే బయలుదేరేది.
రోజంతట సేలం నుండి రాష్ట్ర రాజధాని చెన్నైకు ట్రైన్ సదుపాయం ఉంది. చెన్నై నుండి సేలానికి ఇంకా వేగవంతమైన ట్రైన్ ప్రారంబించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెన్నై / సేలం నుండి ఇండోర్, లక్నో, జబల్పూర్, జైపూర్ లకు కొత్త రైళ్ళను ప్రారంభించాలని గట్టి కోరికలు ఉన్నాయి. సేలం నుండి నమక్కల్ మీదగా కరూర్‌కు ఒక కొత్త రైల్ ట్రాక్ నిర్మాణంలో ఉంది. సేలం నగరం లోని రైల్వే స్టేషనులు ఇవి
- సేలం రైల్వే జంక్షన్
- సేలం మార్కెట్ స్టేషను
- సేలం టౌన్ స్టేషను
- సేలం ఈస్ట్ (ఇప్పుడు మూసివేయయబడింది)
- మగ్నేసైట్ జంక్షన్ (స్టేషను కాదు. ఇది ట్రైన్ ల నడపడానికి)
- నైకారపట్టి
- కొండలంపట్టి (సేలం-కరూర్ మార్గంలో ప్రతిపాధన)
- అయోధ్యపట్టిణం
- కరుప్పూర్
- వీరపాండి
- మొరప్పూర్
- డానిష్పెట్
- దాసంపట్టి
- నాలు రోడ్ (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- ఫైవ్ రోడ్స్ (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- చెర్రీ రోడ్ (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- హస్తం పట్టి రౌన్డానా (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- గుహై (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- సేవ్వాయ్ పేట్టై (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- అమ్మపెట్టై (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
- తారమంగళం (ప్రతిపాదనలో ఉన్న మెట్రో మార్గంలో)
విమానయానం
మార్చుసేలం ఎయిర్ పోర్ట్: సేలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన (కోడ్ ఎఫ్.ఆర్. 3241) ఒక స్వదేశీ విమానాశ్రయం ధర్మపురి, బెంగుళూరు వెళ్ళే జాతీయ రహదారి 7 రహదారిలో ఓమలుర్ సమీపంలో కమలాపురంలో ఉంది. 2009 నవంబరు 15 నుండి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సేలం ఎయిర్ పోర్ట్ నుండి చెన్నైకు క్రమంగా విమానాలని నడుపుతుంది. ఈ విమానాల ద్వారా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్ కట్టాకు వెళ్ళవచ్చు.[21]
సేలం ఎయిర్ పోర్ట్
మార్చు- రన్వే ల సంఖ్య: 1
- ఎయిర్ పోర్ట్ సామర్థ్యం: 50
- రన్వే దిశ : 04/22
- రన్వే పొడవు :6000 అడుగులు (చదును చేయబడినది)
- టాక్సీ వేస్: హాఫ్ వే బాక్ట్రాకింగ్, టాక్సీ వే A కు కొనసాగించబడింది
ప్రసార సాధనాలు
మార్చుఅచ్చు
మార్చుసేలం ఎడిషన్ లో లభ్యమవుతున్న వార్తాపత్రికలు
- దిన తంతి
- దినమలర్
- దినకరన్,
- దినమణి
- కాలై కతిర్ (ఈ పత్రికకు ప్రధాన కార్యాలయం సేలంలో ఉంది)
- మాలై మలర్
- తమిళ్ మురసు
- ది హిండు (ప్రత్యేక సేలం ప్రచురణ తిరుచ్చి నుండి)
- ది న్యు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (కోయంబత్తూర్ నుండి ప్రత్యేక సేలం ప్రచురణ)
టెలివిజన్ ఛానల్
మార్చుసేలంలో 4 స్థానిక తమిళ్ ఛానల్ లు ఉన్నాయి.
- పొలిమర్ ఛానల్
- పొలిమర్ మ్యూజిక్
- సిటిఎన్ మ్యూజిక్
- ఆకాష్ టివి ప్రతాప్ రాజమణి
రేడియో
మార్చుసేలంలో అల్ ఇండియా రేడియో అనగా FM రైన్బో-103.70.. కోడైకానల్ ఎయిర్ స్టేషను నుండి ఉత్పన్నమయ్యే సిగ్నల్ లను పంపించే రిపీటర్ స్టేషను
విద్య
మార్చుఒకప్పుడు విద్యారంగంలో తమిళ్ నాడు లోనే చాలా వెనుకబడి ఉన్న జిల్లాగా ఉన్న సేలంలో ఇప్పుడు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజ్, సేలం అనే పేరుతో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల 1986లో ప్రారంభించబడింది. ఇది MCI [22] గుర్తింపు పొందిన కళాశాల. ఇక్కడ 75 ఎంబిబిఎస్ సీట్ లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి, సేలంతో కలిసి ఉంది. ఆసుపత్రికు 10. కి.మీ దూరంలో ఉన్న వైద్య కళాశాలలో తరగతులు జరుగుతాయి. ఆసుపత్రిని ఇప్పుడు రు.120 కోట్లు కర్చుతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్) మాదిరిగా మెరుగు పరుస్తూ ఉన్నారు.[23] కొత్త భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
విశ్వవిద్యాలయాలు
మార్చు- సేలంలో కరుప్పూర్ సమీపంలో ఓమలుర్ లో పెరియార్ విశ్వవిద్యాలయం ఉంది.
- వినాయక మిషన్స్ డీమ్డ్ విశ్వవిద్యాలయం, సేలం. వినాయాక మిషన్స్ విశ్వవిద్యాలయం 2001వ సంవత్సరం భారత దేశంలోని 48వ విశ్వవిద్యాలయముగా స్థాపించబడింది.
కళలు , విజ్ఞానం
మార్చుసేలంలో అతి పురాతనమైన ఒక కళాశాల ఉంది. ఇది 170 సంవత్సరాలు క్రితం స్థాపించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, సేలం-7. ఈ కళాశాల మొదట్లో సేలం మునిసిపల్ కార్పరేషన్ క్రింద ఉండేది. తరువాత ఎం.గోపాల్ సేలం మునిసిపాలిటి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సుమారు 1963-6 సమయములో మద్రాస్ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. లేకపోతే ఒక కళాశాలను నిర్వహించగలిగిన ఘనత సేలం మునిసిపాలిటీకు మాత్రమే ఉండేది.
విద్య
మార్చు- కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సు.
- గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ (అటానమస్), సేలం - 7.
- గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఫర్ విమెన్, సేలం - 8.
- జైరాం ఆర్ట్స్ & సైన్సు కాలేజీ.
- పద్మవని కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సు.
- శ్రీ శక్తీ కైలాష్ విమెన్స్ కాలేజీ.
- సేలం సౌడెస్వరి కాలేజీ
- శ్రీ శారద కాలేజీ ఫర్ విమెన్ (అటానమస్)
- శ్రీ గణేష్ కాలేజీ.
- వైశ్య కాలేజీ
వైద్య కళాశాలలు
మార్చు- గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ
- శ్రీ భరణి స్కూల్ అఫ్ నర్సింగ్
- శ్రీ భరణి కాలేజ్ అఫ్ నర్సింగ్
- వినాయక మిషన్స్ శంకరచారియర్ డెంటల్ కాలేజీ
- వినాయక మిషన్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్
- వినాయక మిషన్స్ అన్నపూర్ణ కాలేజీ అఫ్ నర్సింగ్
- వినాయక మిషన్స్ కాలేజీ అఫ్ ఫార్మసి
- వినాయక మిషన్స్ కాలేజీ అఫ్ ఫిసియోథెరపి
- ATAMA అక్యుపంచర్ ట్రైనింగ్ సెంటర్
ఇంజనీరింగ్ కళాశాలలు
మార్చు- గవర్నమెంట్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్
- నాలడ్జ్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ
- వినాయక మిషన్స్ కిరుపానంద వారియార్ ఇంజనీరింగ్ కాలేజీ
- సోనా కాలేజీ అఫ్ టేక్నాలజి , 1997 లో నగర నడిబొడ్డులో స్థాపించబడింది.
- AVS ఇంజనీరింగ్ కాలేజీ, అమ్మాపేట్, సేలం 2008 లో స్థాపించబడింది.
- మహా కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, 2004 లో స్థాపించబడింది, నగరానికి 12 కి.మీ. దూరంలో అయోదియపట్టిణం పక్కన మిన్నంపల్లిలో స్థాపించబడింది.
- ది కావేరి ఇంజనీరింగ్ కాలేజీ, మేచేరి, మేట్టుర్.
- గ్రీన్టెక్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, 2008లో అత్తుర్లో స్థాపించబడింది.
- రబీంద్రనాథ్ టాగూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 2008లో అత్తుర్లో స్థాపించబడింది.
- భారతియార్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ 2008లో అత్తుర్లో స్థాపించబడింది.
- నరసుస్ సారథి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, 2008లో ఓమలుర్లో స్థాపించబడింది.
- VSA స్కూల్ అఫ్ ఇంజనీరింగ్, ఉతమచోళపురం, సేలం.
- SRS కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సేలం.
పాలిటెక్నిక్ విద్యాసంస్థలు
మార్చు- సిఎస్ఐ పోల్య్తెక్నిక్ కాలేజీ, ఏర్కాడ్ మెయిన్ రోడ్, సేలం.
- ఎంఐటి పోల్య్తెక్నిక్ కాలేజీ, కావేరి క్రాస్, మేట్టుర్.
- మురుగేసన్ పోల్య్తెక్నిక్ కాలేజీ, కరుమపురం, సేలం.
- ది సేలం పోలీటెక్నిక్ కాలేజీ, పనమరతుపట్టి పిరివు రోడ్, సేలం.
- తియగారజర్ పోలీటెక్నిక్ కాలేజీ, సురమంగళం, సేలం.
- కావేరి పోలీటెక్నిక్ కాలేజీ, ఎం. కలిపట్టి, సేలం.
- రాజాజీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, పెరియ సీరగపడి, సేలం.
పాఠశాలలు
మార్చు- గోల్డెన్ స్పార్క్ మెట్రికులేషన్ హయ్యర్ర్ సెకండరీ స్కూల్, బెంగుళూరు మెయిన్ రోడ్, సేలం-636012. (బాలులు, బాలికలకు హాస్టల్ తో సహా)
- గవర్నమెంట్ హయర్ సెకండరీ స్కూల్, వలసయుర్, సేలం-122
- జే మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, ఫోన్నమపేట్, సేలం-636003.
- వైగై మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, వాళపాడి, సేలం - 636111.
- హయర్ సెకండరీ and మెట్రికులేషణ్ స్కూల్, మేట్టుర్ డాం.
- మోంట్ ఫోర్ట్ హయర్ సెకండరీ స్కూల్, ఏర్కాడ్.
- మునిసిపల్ గిర్ల్స్ హయర్ సెకండరీ స్కూల్, అమ్మాపేట్, సేలం - 636003.
- ఎస్.ఎచ్.వై. హయర్ సెకండరీ స్కూల్, ఏర్కాడ్.
- భారతి విద్యాలయ హయర్ సెకండరీ స్కూల్, మరవనేరి, సేలం. (బాలులకు మాత్రమే)
- గవర్నమెంట్ హయర్ సెకండరీ స్కూల్, కొండలంపట్టి, సేలం.
- లిటిల్ ఫ్లవర్ హయర్ సెకండరీ స్కూల్, 4 రోడ్స్, సేలం.
- లిటిల్ ఫ్లవర్ మెట్రికులేషన్ స్కూల్, 4 రోడ్స్, సేలం.
- క్రిస్టోఫర్ మెట్రికులేషాన స్కూల్, సేలం
- C.S.I. హయర్ సెకండరీ స్కూల్, శేవపేట్, సేలం. (బాలలకు మాత్రమే)
- C.S.I. మెట్రికులేషన్ హై స్కూల్, శేవపేట్, సేలం.
- హోలీ క్రాస్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం (బాలలుకు మాత్రమే)
- హోలీ ఏంజెల్స్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, ఫెయిర్లాండ్స్, సేలం.
- నోట్రేడెం అఫ్ హోలీ క్రాస్ స్కూల్ [సిబిఎస్ఇ], గుండుకలూర్, సేలం - 636104.
- క్లునీ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం (బాలికలకు మాత్రమే)
- గోల్డెన్ గేట్స్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం.
- గోల్డెన్ ఛాయస్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం.
- గుగై హయర్ సెకండరీ స్కూల్, లైన్ మేదు, సేలం.
- గుగై మెట్రికులేషన్ హయర్ స్కూల్, లైన్ మేదు, సేలం.
- శ్రీ విద్య మందిర్ [సిబిఎస్ఇ], అమ్మాపేట్, సేలం.
- శ్రీ విద్య మందిర్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్ (స్టీల్ ప్లాంట్)
- శ్రీ విద్య మందిర్ [సిబిఎస్ఇ], శేవపేట్, సేలం.
- శ్రీ విద్య మందిర్ [సిబిఎస్ఇ], కొండలంపట్టి, సేలం.
- వాసవి హయర్ సెకండరీ స్కూల్, శేవపేట్, సేలం.
- శ్రీ రామకృష్ణ సరదా హయర్ సెకండరీ స్కూల్, సేలం.
- శ్రీ శారద విద్యాలయ, సేలం.
- సౌరాష్ట్ర హై స్కూల్, సేలం - 1.
- St.జాన్స్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం - 16. (బాలలుకు మాత్రమే) హాస్టల్ కలదు
- బాల భారతి మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం - 7.
- St.పాల్స్ హయర్ సెకండరీ స్కూల్, సేలం-07 (బాలలుకు మాత్రమే)
- St.జోసెఫ్స్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, లైన్ మేడు, సేలం - 6. (బాలికలకు మాత్రమే)
- St.మేరీస్ హయర్ సెకండరీ స్కూల్, అరిసిపాలయం, సేలం. (బాలికలకు మాత్రమే)
- St.మేరీస్ మెట్రికులేషన్ స్కూల్, అరిసిపాలయం, సేలం. (బాలికలకు మాత్రమే)
- శ్రీ విద్య మందిర్ హయర్ సెకండరీ స్కూల్, అత్తయంపట్టి .
- శ్రీ శారద బాల మందిర్ హయర్ సెకండరీ స్కూల్ (బాలలకు మాత్రమే), సేలం.
- సరస్వతి మెట్రిక్ హయర్ సెకండరీ స్కూల్, అత్తుర్.
- మారుతీ హయర్ సెకండరీ స్కూల్, మనివిలుందన్ (దక్షిణం), అత్తుర్.
- క్లాసిక్ మెట్రికులేషన్ స్కూల్ - సిరువాచుర్, అత్తుర్.
- హోలీ ఫ్లవర్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, సేలం.
- టాగూర్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, అత్తుర్.
- జాతి మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, అమ్మాపేట్, సేలం.
- రాజ్ మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్, P.G. పాలయం, అత్తుర్.
- సింది హిందూ హై స్కూల్, నరయ నగర్. సేలం
- గవర్నమెంట్ గిర్ల్స్ హయర్ సెకండరీ స్కూల్, వళ్ళువర్ విగ్రహం దగ్గిర, సేలం-1.
- సెయింట్ మేరీస్ గిర్ల్స్ హయర్ సేక్., స్కూల్ ఈ సంవత్సరము డయమండ్ జూబిలీ జరుపుకుంది.
మూలాలు
మార్చు- ↑ "My Salem - My Pride". Government of India. 30 October 2015. Retrieved 1 February 2018.
- ↑ 2.0 2.1 "Census Info 2011 Final population totals – Salem(05740)". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Primary Census Abstract - Urban Agglomeration" (XLS). Registrar General and Census Commissioner of India. Retrieved 13 October 2015.
- ↑ "About Corporation". salemcorporation.gov.in. Retrieved 27 June 2015.
- ↑ 5.0 5.1 5.2 Asha Sridhar (30 January 2015). "Winding the clock back, anti-colonial wise". The Hindu. Retrieved 25 February 2017.
- ↑ "Jungle Look". The Hindu. Archived from the original on 2007-10-17. Retrieved 2006-12-09.
- ↑ "About Salem". Vii InnovatioN. Archived from the original on 2010-01-17. Retrieved 2009-08-29.
- ↑ ఫాలింగ్ రైన్ జెనోమిక్స్, ఇంక్ - సేలం
- ↑ "Falling Rain Genomic s, Inc – Salem". Fallingrain.com. Retrieved 10 April 2012.
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. 2008-10-31. Archived from the original on 2008-10-31. Retrieved 2023-02-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
- ↑ "Salem Silver Works". Archived from the original on 2010-05-31. Retrieved 2010-03-30.
- ↑ "Sago Point of the World". Archived from the original on 2010-05-28. Retrieved 2010-03-30.
- ↑ "Dept.Geology and mining, TN". Archived from the original on 2016-03-04. Retrieved 2010-03-30.
- ↑ "Tamilnadu Elcot Website". Elcot. Archived from the original on 2008-09-18. Retrieved 2008-09-26.
- ↑ "Site for IT Park ideally situated". The Hindu. Archived from the original on 2007-09-30. Retrieved 2006-01-09.
- ↑ "Site for IT Park ideally situated". Retrieved 2008-09-26.
- ↑ "Electrical and electronics industries". Government of Tamil Nadu. Archived from the original on 2009-04-21. Retrieved 2010-03-30.
- ↑ "స్టాఫ్ (14 అక్టోబర్ 2007) "సేలం రైల్వే డివిజన్ ఏర్పాటయింది" ది హిండు". Archived from the original on 2009-02-13. Retrieved 2010-03-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-11-25. Retrieved 2010-03-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-30. Retrieved 2010-03-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-06-24. Retrieved 2010-03-30.
నగర సరిహద్దులు
మార్చుబయటి లింకులు
మార్చు- SelamJilla.com సేలం నగరం, తమిళనాడు-1 పోర్టల్ Archived 2010-04-09 at the Wayback Machine
- ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో సేలం
- సేలం సిటీ మునిసిపల్ కార్పోరేషన్ అధికారిక వెబ్ సైట్
- సేలం, తమిళ్ నాడు యొక్క NIC వెబ్ సైట్ Archived 2021-01-26 at the Wayback Machine
- పోలీసు , జైల్లు Archived 2007-10-24 at the Wayback Machine
- డిపార్ట్మెంట్ అఫ్ జియాలజీ & మైనింగ్, తమిళనాడు ప్రభుత్వం