సొర్లగొంది

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

సొర్లగొంది కృష్ణా జిల్లా లోని నాగాయలంక మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 120., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.

సొర్లగొంది
—  రెవెన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521820
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం

మార్చు

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు

మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

ప్రభుత్వ పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చ్-24వ తేదీనాడు సందడిగా సాగినది. [6]

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

వైద్య సౌకర్యం

మార్చు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, 2014, డిసెంబరు-4న ప్రారంభించెదరు. [3]

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కొసనాతి నాగేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [6]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రామాలయము:- రు. 25 లక్షల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహాలను, తొలుత కొక్కిలిగడ్డలో ఉంచారు. 2015, మార్చ్-22వ తేదీ ఆదివారం నాడు, ఈ విగ్రహాలను పూజల అనంతరం మోపిదేవి గ్రామానికి తీసికొనివచ్చి, అనంతరం, భారీ ఊరేగింపుతో, 80 మంది మురళీకోలాటకారుల ప్రదర్శనతో సొర్లగొంది గ్రామానికి తీసికొనివచ్చారు. 25వ తేదీ బుధవారంనాడు, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ విగ్రహాలను న్యాయవాది శ్రీ మత్తి వెంకటేశ్వరరావు సమకూర్చారు. [6]

గ్రామజనాబా

మార్చు

గ్రామ విశేషాలు

మార్చు
  1. అత్యంత విషాదకర ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైన 1977 నవంబరులో వచ్చిన దివిసీమ ఉప్పెన అనంతరం, ఈ గ్రామాన్ని పోలీసుశాఖ దత్తత తీసికొని, అక్క్డి నిర్వాసితులకు నివాసగృహాలను నిర్మించడంతోపాటు, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినది. [4]
  2. కృష్ణాజిల్లాలో తొలిసారిగా నెడ్ క్యాప్ వారు జూలై 1, 2013 నాడు ఇక్కడ, గాలివేగం, దిశలను అంచనా వేయడానికి ప్రత్యేక సాధనాలను ఏర్పాటుచేసి, ప్రయోగాలు మొదలు పెట్టినారు. ఈ ప్రయోగాలు ఫలితాలనిస్తే, నాగాయలంకతో పాటు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని తీరప్రాంతాలలో పవన విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.[2]
  3. సొర్లగొంది గ్రామంలో వేటకు వెళ్ళి వచ్చే మత్స్యకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఒక కోటి రూపాయల వ్యయంతో "షోర్ బేస్డ్ ఫెసిలిటీ" కేంద్రాన్ని ఏర్పాటు చేసేటందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ కేంద్రంలో వలలు దాచుకొనేటందుకు ప్రత్యేక గదులు, బోట్ల మరమ్మత్తులు చేసుకొనేటందుకు ప్రత్యేక ప్లాట్ ఫారం, సామాజిక కార్యక్రమాలను నిర్వహించుకొనడానికి ఒక హాలు తదితర సౌకర్యాలు లభ్యమవుతవి. [2]
  4. ఈ గ్రామాన్నీ, ఈ గ్రామ పరిధిలోని ఆవాస గ్రామాలను, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో, ఆకర్షణీయ గ్రామాలు (స్మార్ట్ విలేజెస్) గా అభివృద్ధి చేయడానికై, మిట్-సుబిషి కార్పొరేషన్ అను ఒక ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. [7]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Sorlagondi". Archived from the original on 24 ఏప్రిల్ 2017. Retrieved 27 June 2016.
  2. [ఈనాడు కృష్ణా; జులై-3,2013; 9వపేజీ.]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, అక్టోబరు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-4; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఫిబ్రవరి-20; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చ్-23; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చ్-26; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-13; 13వపేజీ.