స్టూడెంట్ నంబర్ 1

(స్టూడెంట్ నెం.1 నుండి దారిమార్పు చెందింది)

స్టూడెంట్ నెంబర్ 1 2001 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. దర్శకుడిగా రాజమౌళికిది తొలిచిత్రం. జైలునుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితులమూలంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథాంశము.

స్టూడెంట్ నం.1
(2001 తెలుగు సినిమా)
Studentno1.jpg
దర్శకత్వం ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాణం సి. ఆశ్వనీదత్,
కె. రాఘవేంద్రరావు
చిత్రానువాదం కె.రాఘవేంద్ర రావు
తారాగణం జూనియర్ ఎన్.టి.ఆర్.,
గజాలా,
రాజీవ్ కనకాల,
కోట శ్రీనివాసరావు,
బ్రహ్మానందం
సంగీతం ఎమ్.ఎమ్. కీరవాణి
ఛాయాగ్రహణం హరి అనుమోలు
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేదీ సెప్టెంబర్ 27, 2001
నిడివి 148 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి 1.85 కోట్లు
వసూళ్లు 12 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

కథసవరించు

ఆదిత్య (జూ. ఎన్టీఆర్) విశాఖపట్నంలో ఒక లా కాలేజీలో విద్యార్ధిగా చేరతాడు. ఈ కాలేజీలో రౌడీ విద్యార్థులు ఎక్కువనే పేరు ఉంది. ఈ రౌడీ ముఠాకి సత్య (రాజీవ్ కనకాల) అనే విద్యార్ధి నాయకుడు. ఈ సినిమాలో ఆదిత్యని ఒక అనామక యువకుడు లా చూపిస్తారు, సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతుంది.ఆదిత్య ఈ రౌడీ విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్థుడు అని తెలుస్తుంది. జైలు అధికారులు ప్రత్యేక అనుమతితో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.

ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసుకున్నాక ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు, కానీ తన తండ్రికి తాను లా (న్యాయశాస్త్రం) చేయాలనుకున్నాడు, ఈ విషయం వీళిద్దరి మధ్య విభేదాలకు దరి తీస్తుంది, తరువాత గొడవకు కారణమవుతుంది. ఈ లోపు ఆదిత్య ఒక మహిళని మానభంగం నుండి కాపాడబోతు, అనుకోకుండా ఒక గూండాని హత్య చేస్తాడు. దీంతో తన తండ్రి వాడిని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. ఆదిత్య పోలీసులకు లొంగిపోతాడు. హీరో న్యాయ పట్టా సంపాదించుకుని, అతడి తండ్రి మెప్పు తిరిగి ఎలా పొందుతాడో అనేది మిగితా చిత్ర సారాంశం.

సాంకేతిక నిపుణులుసవరించు

విదుదలసవరించు

ఈ సినిమా రాష్త్రవ్యప్తంగా 40 ప్రింట్లతో విడుదలయింది.[3]

బాక్స్ఆఫీస్ సమాచారంసవరించు

 • స్టూడెంట్ నం. 1 సినిమా 2.75 కోట్లకు అమ్మకం అవ్వగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
 • జూనియర్ ఎన్.టి.ఆర్ తన కెరీర్ లో సాధించిన తోలి విజయం ఈ చిత్రం.
 • ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులకు ప్రదర్శింపబడింది.[4]
 • ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులకు ప్రదర్శింపబడింది.[5]
 • ఈ సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేసారు.ఇందులో నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. మాటే త లవ్ హేలరే పేరుతో ఒరియాలో అనుభవ మొహంతి హీరోగా రీమేక్ చేసారు.
 • ఈ సినిమాకి ₹2.75 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ వ్యాపారం జరిగింది (US$410,000).
 • ఈ సినిమాని 1.85 కోట్లతో నిర్మించగా, 12 కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

పాటలుసవరించు

ఈ సినిమాలో పాటలన్ని ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. ఈ సినిమా పాటల సి.డి ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి వచ్చింది. పాటలు మంచి ప్రజాదరణ పొందింది.

క్రమసంఖ్య పేరుగాయకు(లు) నిడివి
1. "కూచిపూడి కైనా"  టిప్పు  
2. "కాస్త నిన్ను"  ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర  
3. "ఒక్కరికీ ఒక్కరికీ"  కేకే , శ్రీవర్తిని  
4. "పడ్డానండి ప్రేమలో మరి"  ఉదిత్ నారాయణ్, చిత్ర  
5. "ఎక్కడో పుట్టి"  ఎం.ఎం.కీరవాణి  
6. "ఏమెట్టి చేసాడో"  ఉదిత్ నారాయణ్, చిత్ర  


అవార్డులుసవరించు

 1. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Retrieved 18 May 2020. Check |archiveurl= value (help)
 2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020. Check date values in: |archivedate= (help)
 3. Cycle Stand – Telugu Cinema Trade Story Archived 2016-03-03 at the Wayback Machine. Idlebrain.com (26 December 2001). Retrieved on 2015-09-27.
 4. Cycle Stand – Telugu Cinema Trade Story Archived 2011-09-29 at the Wayback Machine. Idlebrain.com (13 November 2001). Retrieved on 2015-09-27.
 5. Cycle Stand – Telugu Cinema Trade Story Archived 2015-08-26 at the Wayback Machine. Idlebrain.com (31 December 2001). Retrieved on 2015-09-27.