స్వాతి కిరణం

1992 సినిమా
(స్వాతికిరణం నుండి దారిమార్పు చెందింది)

స్వాతి కిరణం 1992 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రధానమైన చిత్రం. ఇందులో మమ్ముట్టి, రాధిక, మాస్టర్ మంజునాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సాంప్రదాయ సంగీత గురువు తన శిష్యుడి ఉన్నతిని తట్టుకోలేక ఈర్ష్యకు లోనై అతని మరణానికి కారణమై చివరికి తన తప్పును తెలుసుకునే కథ. ఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రంలో పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఆనతినీయరా అనే పాటను పాడినందుకు గాయని వాణీ జయరాంకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది.

స్వాతి కిరణం
దర్శకత్వంకె.విశ్వనాధ్
రచనకె. విశ్వనాథ్ (కథ), ఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు)
స్క్రీన్ ప్లేకె. విశ్వనాథ్
నిర్మాతవి మధుసుదన రావు
తారాగణంమమ్మూట్టి ,
రాధిక,
మంజునాథ్
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

చిత్రకథ

మార్చు

దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే ఒక దేశదిమ్మరి (మమ్ముట్టి) ని పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు. అక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్ (అచ్యుత్) దేశదిమ్మరిని అనంత రామశర్మగా పోలుస్తాడు.

గతంలోకి వెళితే అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం (మాస్టర్ మంజునాధ్). అతని తల్లి దండ్రులు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటారు. పక్షితీర్ధం మామ్మ (జయంతి) గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం. స్థానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మకి శిష్యునిగా చేద్దామను కుంటుంది. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు మంత్రపుష్పాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ. గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్కుతుంది. ఇంతలో కాలేజిలో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు. కాలేజిలో ఆడిషన్ లో మరో స్వరంతో అదే పాట వినిపిస్తాడు. అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు. అనంత రామశర్మ నిస్సంతు. అతని భార్య (రాధిక) గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు. అనంత రామశర్మ వలన కాని స్వర రచనను గంగాధరం ప్రయత్నిస్తాడు. ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఎంపికై శిక్షణ తీసుకుంటున్న పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణ భూతమవుతాడు. ఈ సంఘటనతో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది.

అనంత రామశర్మను పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అతనికి స్వస్థత చేకూరుతుంది. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక. దానితో సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

యాంటీ సెంటిమెంట్

మార్చు

బలమైన పతాక సన్నివేశం కోసం కథ ముగింపు ఈ విధంగా చేసి ఉంటారు కానీ, గంగాధరం మరణం ప్రేకక్షులకు ఏ మాత్రం నచ్చలేదు..యాంటీ సెంటిమెంటయ్యింది. దానితో ప్రజాదరణ పొందలేదు.

విశేషాలు

మార్చు

ఈ చిత్రంలో గణపతి సచ్చిదానంద స్వామి కనిపిస్తాడు. ఆనతి నీయరా పాట పాడిన వాణి జయరాం జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికైంది. ఈ సినిమాకు కె.వి. సత్యనారాయణ నృత్య దర్శకత్వం చేశాడు.

పాటలు

మార్చు

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: కె.వి.మహదేవన్.

పాటలు
సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."ఆనతినీయరా హరా"సిరివెన్నెలవాణీ జయరాం 
2."ఓం గురు" (శ్లోకం)   
3."కొండా కోనల్లో లోయల్లో"వెన్నెలకంటివాణీ జయరాం 
4."జాలిగా జాబిలమ్మ"సిరివెన్నెలవాణీ జయరాం 
5."తెలి మంచు కురిసిందీ"సిరివెన్నెలవాణీ జయరాం 
6."ప్రణతి ప్రణతి"సి.నా.రెఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 
7."ప్రణతి ప్రణతి"సి.నా.రెవాణీ జయరాం 
8."వైష్ణవి భార్గవి"సిరివెన్నెలవాణీ జయరాం 
9."శివానీ భవనీ"సిరివెన్నెలఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 
10."శివానీ భవనీ"సిరివెన్నెలవాణీ జయరాం 
11."శృతి నీవు గతి నీవు"సి.నా.రెవాణీ జయరాం 
12."సంగీత సాహిత్య సమలంకృతే"సి.నా.రెఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 

పురస్కారాలు

మార్చు
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1992 వాణీ జయరాం ("ఆనతినీయర హార" గానమునకు) జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయని గెలుపు

బయటి లింకులు

మార్చు