హంగామా (సినిమా)
ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు కామెడీ చిత్రం హంగామా. ఈ చిత్రం 2005 ఏప్రిల్ 28 న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇది 100 రోజులు నడిచింది. ఇది మలయాళ చిత్రం మట్టుపేట్టి మచ్చన్ (1998) కు రీమేక్. దీన్ని తమిళంలో బండా పరమశివం (2003) గాను, హిందీలో హౌస్‌ఫుల్ 2 (2012) గానూ పునర్నిర్మించారు. ఈ చిత్రం 23 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది.
హంగామా (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్వీ కృష్ణారెడ్డి |
---|---|
తారాగణం | ఆలీ, అభినయశ్రీ, వేణుమాధవ్, జ్యోతి |
సంగీతం | ఎస్వీ కృష్ణారెడ్డి |
భాష | తెలుగు |
కథ
మార్చుపెద్దబాబు ( కోట శ్రీనివాసరావు ), చిన్నబాబు ( తనికెళ్ళ భరణి ) సవతి సోదరులు, ఇరుగు పొరుగువారు. ఇద్దరికీ చెరో అందమైన కుమార్తె ఉన్నారు. పెళ్ళిచూపుల కోసం బాలరాజు ( సునీల్ ) చిన్నబాబు ఇంటికి వచ్చినపుడు అవమానానికి గురవుతాడు. విద్యాజ్యోతికి - చిన్న బాబు కుమార్తె - భర్తగా చెత్త యువకుడు వచ్చేలా చూసి ప్రతీకారం తీర్చుకోవాలని బాలరాజు అనుకుంటాడు.
బాగా వెతికి బాలరాజు మూలికలు అమ్మే మోసగాడు బాలూ ( వేణు మాధవ్ ) ను ఎంచుకుంటాడు. కొన్ని అపార్థాల కారణంగా, అతను పెద్దబాబు ఇంటికి వెళ్ళి అతడి కుమార్తె దివ్య ( అభినయ శ్రీ ) ను వలలో వేసుకోడానికి ప్రయత్నిస్తాడు. వృత్తిపరంగా తార్పుడుగాడు అయిన బద్రీ (అలీ) అనే మరో పనికిరాని వాణ్ణి బాలరాజు కలుస్తాడు. బాలూ, బద్రి ఇద్దరూ చిన్నబాబు, పెద్దబాబులను ఆకట్టుకోవడానికి జమీందారు కుమారులం అని చెప్పుకుంటారు. బాలు, బద్రిలతో దివ్య, విద్యలు ప్రేమలో పడతారు. వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరుగుతాయో మిగతా సినిమాలో చూడవచ్చు
నటవర్గం
మార్చు- అలీ
- వేణు మాధవ్
- కోట శ్రీనివాసరావు
- తనికెళ్ళ భరణి
- బ్రహ్మానందం
- నర్సింగ్ యాదవ్
- ఎం.ఎస్.నారాయణ
- రాజేంద్ర బాబు
- రామరాజు
- ధర్మవరపు సుబ్రమణ్యం
- సునీల్
- గుండు హన్మంతరావు
- రఘు బాబు
- జ్యోతి
- అభినయశ్రీ
- ఆముక్త మాల్యద
- జయలలిత
- శోభారాణి
- శోభన
- విమలశ్రీ
పాటల జాబితా
మార్చు- ముత్తమ్మ ముత్తమ్మ
- మాణిక్యవీణా
- చిరు చిరు
సాంకేతిక వర్గం
మార్చు- కథ: ఎస్.వి.కృష్ణారెడ్డి
- సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
- చిత్రానువాదం: ఎస్.వి.కృష్ణారెడ్డి
- దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
- ఛాయాగ్రాహకుడు: వి శ్రీనివాసరెడ్డి
- సంభాషణలు: జనార్థన్ మహర్షి
- కళ: జెపి
- పోరాటాలు: విజయ్
- సాహిత్యం: భువన చంద్ర, చంద్రబోస్ & భాస్కరభట్ల
- కూర్పు: వి నాగిరెడ్డి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి సురేష్ రెడ్డి
- నిర్మాత: వెంకట్
- విడుదల తేదీ: 2005 ఏప్రిల్ 28