హబీబ్ ఫైసల్
హబీబ్ ఫైసల్ మధ్యప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, గీత రచయిత. దో దూనీ చార్ (2010), ఇషాక్‌జాదే (2012) సినిమాలకు దర్శకత్వం వహించాడు.
హబీబ్ ఫైసల్ | |
---|---|
జననం | |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జననం
మార్చుహబీబ్ ఫైసల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు.
సినిమారంగం
మార్చుజామియా మిలియా ఇస్లామియా పూర్వ విద్యార్థి. కరీనా కరీనా అనే టెలివిజన్ సీరియల్ కు దర్శకత్వం వహించాడు.[1] న్యూఢిల్లీలో ఎన్డీటీవిలో కెమెరా పర్సన్‌గా పనిచేశాడు.[2]
2010లో దో దూని ఛార్ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.[3] ఆ తరువాత సిద్ధార్థ్ ఆనంద్ తీసిన సలామ్ నమస్తేకు సహ రచయితగా పనిచేశాడు.[4] అభిషేక్ బచ్చన్, ప్రీతి జింటాలతో దర్శకుడు షాద్ అలీ తీసిన ఝూమ్ బరాబర్ ఝూమ్,[4] సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన సిద్ధార్థ్ ఆనంద్ తీసిన తరా రమ్ పమ్,[4] 2010లో విడుదలైన బ్యాండ్ బాజా బారాత్ సినిమాలకు కూడా రాశాడు.[5]
2012లో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రాలతో ఇషాక్‌జాదే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.[6] ఈ సినిమా విమర్శకుల నుండి సానుకూల స్పందనను పొందడంతోపాటు బాక్సాఫీస్ వద్ద చాలా మంచి వసూళ్ళను సాధించింది.[7] ఆ తర్వాత నూపూర్ అస్థాన దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, సోనమ్ కపూర్, రిషి కపూర్‌లు నటించిన బెవకూఫియాన్ సినిమాకు రాశాడు.[8] 2014లో ఆదిత్య రాయ్ కపూర్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలతో దావత్-ఎ-ఇష్క్ అనే సినిమా తీశాడు.[9] దావత్-ఎ-ఇష్క్ 2014 సెప్టెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[10][11]
2017 ఆగస్టు 25న ఇతని నాలుగవ సినిమా ఖైదీ బ్యాండ్ విడుదలైంది.
పాటలు
మార్చుపేరు | సంవత్సరం | గాయకుడు | సినిమా |
---|---|---|---|
"చోక్రా జవాన్" | 2012 | అమిత్ త్రివేది | ఇషాక్జాదే |
"జగ్ మాగ్" | 2017 | ఖైదీ బ్యాండ్ | |
"ఐ అయామ్ ఇండియా" | 2017 |
సినిమాలు
మార్చు- 2021: దిల్ బెకరార్ (దర్శకుడు, అదనపు మాటలుస్)
- 2020: ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్) (రచయిత)
- 2018: రాజుగాడు (తెలుగు సినిమా) (రచయిత, మారుతితో పాటు)
- 2018: హోమ్ (దర్శకుడు, బాలాజీ ఒరిజినల్ సిరీస్)
- 2017: ఖైదీ బ్యాండ్ (రచయిత, దర్శకుడు)
- 2016: ఫ్యాన్ (రచయిత)
- 2014: దావత్-ఎ-ఇష్క్ (రచయిత, దర్శకుడు)
- 2014: బెవకూఫియాన్ (రచయిత)
- 2012: ఇషాక్‌జాదే (దర్శకుడు)
- 2011: లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (మాటలు)
- 2010: బ్యాండ్ బాజా బారాత్ (స్క్రీన్ ప్లే, మాటలు)
- 2010: దో దూని చార్ (రచయిత, దర్శకుడు)
- 2007: జూమ్ బరాబర్ ఝూమ్ (రచయిత)
- 2007: త ర రమ్ పమ్ (స్క్రీన్ ప్లే, మాటలు)
- 1996: ఓపస్ 27 (షార్ట్ ఫిల్మ్)
- 1992: ఎలక్ట్రిక్ మూన్ (అసిస్టెంట్ డైరెక్టర్)
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | వర్గం | శీర్షిక | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2010 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ సంభాషణలు | బ్యాండ్ బాజా బారాత్ | గెలుపు | [12] |
2010 | స్క్రీన్ అవార్డులు | ఉత్తమ సంభాషణలు | గెలుపు | [13] | |
2010 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ | డూ దూని ఛార్ | గెలుపు | |
2012 | మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ | గీత రచయిత | ఇషాక్జాదే నుండి "చోక్రా జవాన్" | ప్రతిపాదించబడింది | [14] |
2021 | ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డులు | ఉత్తమ ఒరిజినల్ కథ | ఆశ్రమ్ | ప్రతిపాదించబడింది | [15] |
మూలాలు
మార్చు- ↑ "Writing is a very solitary experience: Habib Faisal". Hindustan Times. 18 October 2015. Retrieved 2023-07-29.
- ↑ "Jhoom celebrates a positive attitude". Rediff.com. 15 June 2007. Retrieved 31 December 2010.
- ↑ "Do Dooni Chaar about state of teachers in India". The Indian Express. 5 October 2010. Retrieved 2023-07-29.
- ↑ 4.0 4.1 4.2 "Middle Class Hero". The Indian Express. 15 October 2010. Retrieved 2023-07-29.
- ↑ "Nothing filmy about Band Baaja Baarat". The Indian Express. 24 November 2010. Retrieved 2023-07-29.
- ↑ "Ishaqzaade - Yash Raj Films". Yash Raj Films. Retrieved 2023-07-29.
- ↑ "Rowdy Rathore Bumper Opening In Single Screens Good At Multiplexes". Box Office India. Archived from the original on 5 November 2013. Retrieved 2023-07-29.
- ↑ "Bewakoofiyaan - Yash Raj Films". Yash Raj Films. Retrieved 2023-07-29.
- ↑ "Daawat-e-Ishq - Yash Raj Films". Yash Raj Films. Retrieved 2023-07-29.
- ↑ "Daawat-E-Ishq to release on September 19". The Times of India. Retrieved 2023-07-29.
- ↑ "Daawat-e-Ishq release date shifted to 19 Sept". India Today. Retrieved 2023-07-29.
- ↑ "Filmfare Awards: Bollywood and Regional Film Awards". filmfare.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-12-07. Retrieved 2023-07-29.
- ↑ "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-07-29.
- ↑ "Nominations - Mirchi Music Award Hindi 2012". www.radiomirchi.com. Retrieved 2023-07-29.
- ↑ "Nominees for the MyGlamm Filmfare OTT Awards 2021". Filmfare (in ఇంగ్లీష్). 2 December 2021. Retrieved 2023-07-29.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హబీబ్ ఫైసల్ పేజీ