హరగోవింద్ ఖొరానా
హరగోవింద్ ఖొరానా (9 జనవరి 1922- 9 నవంబర్ 2011) భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. 1922 జనవరి 9న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది).
హరగోవింద్ ఖొరానా | |
---|---|
జననం | రాయ్ పూర్ పంజాబ్ | 1922 జనవరి 9
మరణం | 2011 నవంబరు 9 అమెరికా | (వయసు 89)
నివాసం | India |
జాతీయత | అమెరికా |
రంగములు | Molecular Biology |
వృత్తిసంస్థలు |
|
చదువుకున్న సంస్థలు |
|
ప్రసిద్ధి | First to demonstrate the role of Nucleotides in protein synthesis |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ బహుమతి (1968), Gairdner Foundation International Award, Louisa Gross Horwitz Prize, Albert Lasker Award for Basic Medical Research, పద్మ విభూషణ్ పురస్కారం |
విద్య
మార్చుఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానములో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్ లో దయానంద్ ఆర్య విద్యా (DAV) ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము, లాహోర్ ( ప్రస్తుతం పాకిస్తాన్ ) 1943 లో B.Sc, 1945లో M.Sc పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వవిద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశోధనలు చేసి Ph.D పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరములు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్లో పరిశోధనలు సాగించాడు.
పరిశోధనలు
మార్చు1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలములో చేరాడు. అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలములో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరాడు. 1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయనశాస్త్ర ఆచార్యునిగా చేరాడు. 2007లో పదవీవిరమణ చేశాడు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగిస్తున్నాడు.[1]
నోబెల్ పురస్కారము
మార్చుఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే "కృత్రిమ జీన్"ను సృష్టించగలిగాడు. ఈ ఆవిష్కరణ Genetic Engineering అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.
ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (DNA) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. DNA ముక్కలను అతికించు DNA ligase అనబడు ఎంజైమును కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవము వచ్చింది. 1968 లో వైద్యశాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది.
పరివారము
మార్చు1952లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు పిల్లలు: జూలియా ఎలిజబెత్, ఎమిలీ యాన్నె మరియూ డేవ్ రాయ్.
అవార్డులు
మార్చు- మెడిసిన్ లో నోబెల్ బహుమతి (1968),
- గైరిందర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు,
- లూయిసా స్థూల హోర్విత్జ్ బహుమతి,
- ప్రాథమిక మెడికల్ రీసెర్చ్ ఆల్బర్ట్ లస్కెర్ అవార్డు,
- పద్మ విభూషణ్,
- విల్లార్డ్ గిబ్స్ అవార్డు
మరణము
మార్చుఖొరానా నవంబర్ 9, 2011 న కంకార్డ్, మసాచుసెట్స్ లో 89వ ఏట సహజ మరణము చెందాడు.[2]
మూలాలు
మార్చు- ↑ ఖొరానా వెబ్ పుట:http://web.mit.edu/chemistry/www/faculty/khorana.html
- ↑ Mitchell, Bob (2011-11-11). "Biochemist Har Gobind Khorana, whose UW work earned the Nobel Prize, dies". News. Retrieved 2023-09-05.