హరిశ్చంద్ర (1956 సినిమా)
రాజ్యం ప్రొడక్షన్స్ పతాకంపై'నిర్మించిన 'హరిశ్చంద్ర'1956 మే 31 న విడుదల. ఈ చిత్రంలో హరిశ్చంద్రుడు గా ఎస్.వి.రంగారావు, చంద్రమతి గా లక్ష్మీరాజ్యo నటించారు. ఇంకా గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి వెంకట్రామయ్య, కల్యాణం రఘురామయ్య, పి.సూరిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు. ఈ చిత్రానికి జంపన చంద్రశేఖరరావు దర్శకత్వం వహించారు.
హరిశ్చంద్ర (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంపన చంద్రశేఖరరావు |
---|---|
తారాగణం | యస్వీ రంగారావు, లక్ష్మీరాజ్యం, రేలంగి, గుమ్మడి వెంకటేశ్వరరావు, కె.రఘురామయ్య, సూర్యకాంతం, పి. సూరిబాబు, రాజసులోచన, జానకి |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నిర్మాణ సంస్థ | రాజ్యం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుపాత్రధారి | పాత్ర |
---|---|
యస్వీ రంగారావు | హరిశ్చంద్రుడు |
లక్ష్మీరాజ్యం | చంద్రమతి |
రేలంగి[1] | నక్షత్రకుడు-విశ్వామిత్రుని శిష్యుడు |
గుమ్మడి వెంకటేశ్వరరావు | విశ్వామిత్రుడు |
మాస్టర్ శేషగిరి | లోహితుడు |
పి.సూరిబాబు | వశిష్ఠుడు |
కె.రఘురామయ్య | ఇంద్రుడు |
గౌరీపతిశాస్త్రి | కాలకౌశికుడు |
సూర్యకాంతం | కలహకంటి |
ఏ.వి.సుబ్బారావు. | వీరబాహు - యమధర్మరాజు |
రాజసులోచన, కుచలకుమారి | మాతంగకన్యలు |
ఈ.వి.సరోజ, రీటా | అప్సరసలు |
జానకి, చలం, సూర్యకళ | అతిథులు |
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: జంపన చంద్రశేఖరరావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ: రాజ్యం ప్రొడక్షన్స్
గీత, పద్య కవులు: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా,కొసరాజు రాఘవయ్య చౌదరి, జంపన చంద్రశేఖరరావు
గాయనీ గాయకులు:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.లీల, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత, సత్యవతి, కల్యాణం రఘురామయ్య, పి.సూరిబాబు, సుసర్ల దక్షిణామూర్తి
విడుదల:31:05:1956.
కథాంశం
మార్చుహరిశ్చంద్రుడు (ఎస్వీ రంగారావు) తన రాజ్యంలో ప్రజలకు న్యాయం చేకూరుస్తూ సపరిపాలన చేస్తూ వుంటాడు. ఇంద్రలోకంలో వశిష్ట మహామునిని ఇంద్రుడు (కె.రఘురామయ్య) భూలోకంలో సత్యపాలకుడు ఎవరైనా వున్నారా అని అడగగా మునివర్యుడు హరిశ్చంద్రుడు అని జవాబు చెప్పుతాడు. దానికి విశ్వామిత్రుడు (గుమ్మడి) మండిపడుతూ హరిశ్చంద్రుడిని సత్యభ్రష్టుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకని ముందు అయోధ్య రాజ్యంలో తన తపశ్శక్తితో మృగ సంచారం పెంచుతాడు. ఈ విషయం ప్రజలు హరిశ్చంద్రుని చెవిన వేస్తారు. అందుకని హరిశ్చంద్రుడు రాణి చంద్రమతి (లక్ష్మీరాజ్యం), యువరాజు లోహితుడు, మహామంత్రితో సహా వేటకు వెళ్ళతాడు. విశ్వామిత్రుడు తన శక్తితో ఇద్దరు మాతంగకన్యల (రాజసులోచన, కుచలకుమారి)ను సృష్టించి హరిశ్చంద్రుడిని ధర్మమార్గం నుండి మళ్లించుటకు తన శిష్యుడు నక్షత్రకుడిని (రేలంగిని) వారికి తోడుగా పంపిస్తాడు. కానీ వారు పరాభావం పొందుతారు. ఇది తెలిసిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మాతంగ కన్యలను వివాహమాడమని ఆజ్ఞాపిస్తాడు. కానీ హరిశ్చంద్రుడు తాను ధర్మమార్గం నుండి తప్పనని చెప్పుతాడు, ఇంకేదైనా విషయం అడగమని చెప్పగా అతనిని తన రాజ్యానిని దానం చేయమని అంటాడు, ఇంతకు ముందు విశ్వామిత్రునికి ఇవ్వవలసిన యాగధనం అడగగా అతని దగ్గర ఏమీ లేక పోవటంతో ఎదైనా పనిచేసి ఋణాన్ని తీర్చడానికి సిద్ధమవుతాడు. వారి వెంట తన శిష్యుడు నక్షత్రకుడిని పంపిస్తాడు విశ్వామిత్రుడు. అలా వారు కాశీకి చేరుకుని కాశీనాథుడిని దర్శించుకుంటారు. తర్వాత విశ్వామిత్రుని ఋణాన్ని ఎలా తీర్చాలని ఆలోచిస్తుండగా చంద్రమతి తనను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఋణాన్ని తీర్చమంటుంది. దానికి హరిశ్చంద్రుడు ముందు అంగీకరించడు, కానీ అంగీకరించవలసి వస్తుంది. చంద్రమతిని అమ్మడానికి తీసుకెళ్ళగా ఒక బ్రాహ్మణుడు అయిన కాలకౌశికుడు (గౌరీపతిశాస్త్రి) ఆమెతో పాటు వారి పుత్రుడిని కూడా ఇవ్వమని పట్టుబడుతాడు, వారు తప్పక అలానే చేయవలసి వస్తుంది. ఆ బ్రాహ్మణుని భార్య అయిన కలహకంఠి (సూర్యకాంతం) పరమ గయ్యాళి చంద్రమతి, ఆమె కొడుకుని ఏంతో బాధ పెడుతుంది. మరో వైపు నక్షత్రకుడు అడగగా హరిశ్చంద్రుడు తనను కూడా అమ్మేసి డబ్బుని అతనికి తమతోపాటుగా వచ్చినందుకు ఇస్తానంటాడు. అలా హరిశ్చంద్రుణ్ణి ఒక కాటికాపరి అయిన వీరబాహు (ఎ.వి.సుబ్బారావు)కి అమ్మేస్తాడు. ఒకసారి చంద్రమతి తన కొడుకుని కొందరితో చిన్న పనికి పంపిస్తుంది, దారిలో అతన్ని పాము కాటువేయగా మరణిస్తాడు. అలా కాటు వేయమని విశ్వామిత్రుడు చెప్పుతాడు. చంద్రమతి తన కొడుకు మృతదేహాన్ని దహనం చేయటానికి శ్మశానానికి తీసుకువెళ్తుంది. అక్కడ కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు ముందు వారిని గుర్తించడు, గుర్తించిన తరువాత బాధతో కుంగిపోతాడు. ఉద్యోగధర్మం గుర్తుకు వచ్చి శిస్తు చెల్లించనిదే దహన సంస్కారాలను జరుపవలదని చెప్పుతాడు. చంద్రమతి ఇంటికి వెళ్ళి ఏదైనా తేవటానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఒక రాక్షసుడు విశ్వామిత్రుని ఆదేశంపై కాశీ రాజకుమారుడిని హత్యచేసి ఆ నిందను చంద్రమతిపై పడేటట్టు చూస్తాడు. చంద్రమతికి కాశీరాజు మరణదండన విధిస్తాడు. వీరబాహు హరిశ్చంద్రుణ్ణి ఆ శిక్ష అమలు చేయమని పంపిస్తాడు. శిక్ష వేయాల్సింది తన భార్యకేనని తెలిసి బాధపడతాడు. చివరికి శిక్ష వేయటానికి కత్తి పైకి ఎత్తుతాడు. ఆపు విశ్వామిత్రుదు ప్రత్యక్షమై అతను స్త్రీ హత్యకు పాల్పడబోతున్నాడని హెచ్చరిస్తాడు. అయినా అతని మాట వినకుండా తల నరకడానికి సిద్ధమవుతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా కత్తితో చంద్రమతి మెడ మీద దెబ్బ వేస్తాడు, అది పూలదండగా చంద్రమతి మెడలో పడుతుంది. దేవతలందరు ప్రత్యక్షమై హరిశ్చంద్రుణ్ణి దీవించి, కాశీ రాజకుమారుడిని, లోహితుడిని బ్రతికిస్తారు. హరిశ్చంద్రుడు తిరిగి అయోధ్య రాజ్యాన్ని జనరంజకంగా పాలిస్తాడు.
పాటలు_పద్యాలు
మార్చు01. అంతటి రాజచంద్రునికాత్మజవై కసువంతకాంతవిశ్రాంత (పద్యం) -ఘంటసాల , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
02. అకటా ఒక్కనిపంచ దాసియై అట్లాల్లడు ఇల్లాలు పాట్లకై (పద్యం) - ఘంటసాల , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
03. అయోధ్య రాజ్యమురా మనది అయోధ్య రాజ్యమురా హరిశ్చంద్రుడు - మాధవపెద్ది బృందం , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
04. అలయక గుళ్ళుగోపురములన్నియు చూచుచు అప్పు మాటయే (పద్యం) - మాధవపెద్ది, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
05. అరయన్ వంశమునిల్పనే కదా వివాహంబు అటి వైవాహిక (పద్యం) - ఘంటసాల , రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
06. ఆవుల్ మందలలోన నిల్వక అవే అంబా యనుచు లేదూడలన్ (పద్యం) - పి.లీల , రచన: బలిజేపల్లి
07. ఇది సమయమురా శుభ సమయమురా శుకపికరవములు శృతి - జిక్కి బృందం , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
08. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగి (పద్యం) - ఘంటసాల , రచన: జాషువా
09. ఈ అలివేణి నోట వచియించెడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై (పద్యం) - ఘంటసాల , రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
10. ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా - పిఠాపురం, స్వర్ణలత, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
11. ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మ - పి.లీల, రచన: జంపన చంద్రశేఖరరావు
12. ఏ ఇంట పుట్టావో ఏ ఇంట పెరిగావో ఏ రాజు లక్ష్మివై ఏ పూజలందావో - ఘంటసాల, రచన: జంపన చంద్రశేఖరరావు
13. కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండబోవు (పద్యం) - మాధవపెద్ది, రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
14. కొంపా గోడా ఇంత కూడే లేదు ఏమిటికింక చంపెదవు (పద్యం) - మాధవపెద్ది , రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
15. కట్టాయె కడలి దీన రక్షాదక్షుని దు:ఖపున్నటేశంబడి ఏడ్చు (పద్యం) - పి.లీల, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
16. చనుబాలిచ్చినతోడనే నిదురబుచ్చన్ పొత్తులనుంచి (పద్యం) - పి.లీల, రచన: బలిజేపల్లి
17. చక్కదనాల చుక్కలం చందమామ రెక్కలం మక్కువతో - జిక్కి,సత్యవతి, రచన: జంపన చంద్రశేఖరరావు
18. చతురంభోధిపరీత భూత ధరణీ సామ్రాజ్య సర్వత్వసంతత (పద్యం) - ఘంటసాల , రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
19. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షచామీకరాయత దండంబు (పద్యం) - ఘంటసాల , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
20. చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు నేనేనయా - ఘంటసాల బృందం , రచన కొసరాజు
21. చెప్పింది చెయ్యబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా - స్వర్ణలత, ఘంటసాల, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
22. జనని జనని జగన్మాతా శుభచరితా మాతా జనని జనని - పి.లీల
23. జయ కాశీ విశ్వనాధా మము కాపాడుమా జగన్నాధా - ఘంటసాల,పి.లీల,సత్యవతి బృందం , రచన: జంపన చంద్రశేఖరరావు
24. జవదాటి ఎరుగదీ యువతీలలామంబు పతిమాట రతనాల (పద్యం) - ఘంటసాల, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
25. తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ బాయనీ (పద్యం) - కె. రఘురామయ్య , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
26. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దానమిచ్చిన (పద్యం) - మాధవపెద్ది , రచన: బలిజేపల్లి
27. దేవ బ్రాహ్మణమాన్యముల్ విడచి భక్తుల్ సప్తపాదోధి (పద్యం) - ఘంటసాల, రచన:బలిజేపల్లి
28. ప్రత్యూషమంబున లేచి నాధుని పదాజ్యాటంబులన్ వ్రాలుటో (పద్యం) - పి.లీల, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
29. ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు హేమశైలంబు కొనవ్రేల ఎత్తవచ్చు (పద్యం) - పి. సూరిబాబు, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
30. మధురం మధురం మదవతి హృదయం మనోఙ్ఞశాలికి - పి.లీల, సత్యవతి , రచన:జంపన చంద్రశేఖరరావు
31. శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం) - పి. సూరిబాబు, రచన బలిజేపల్లి
32. శ్రీమన్ మహా యఙ్ఞ్నమూర్తి జగజ్జాల రక్షా (దండకం) - పి.లీల
33. హిమశైలముంబున వాయుభక్షణుడనై మృత్యుజయన్ గూర్చి (పద్యం) - మాధవపెద్ది, రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
34. హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి ఆశ (పద్యం) - ఘంటసాల, రచన:బలిజేపల్లి లక్ష్మీకాంతం
35. అయ్యో ఇదేం న్యాయమో అయ్యో ఇదేం ఘోరమో _సుసర్ల దక్షిణామూర్తి కోరస్
36. ఏ వెలకైనను తెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే (పద్యం)_ఘంటసాల వెంకటేశ్వరరావు , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
37.కొడుకా కష్టాలెన్ని వచ్చినను నీకున్నాకు నా కీడులం(పద్యం )_ఘంటసాల వెంకటేశ్వరరావు, రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
38. కాబోలు బ్రహ్మ రాక్షస్స మూహంబిది ఘోషించుచుండే (పద్యం)_ఘంటసాల వెంకటేశ్వరరావు, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.