హర్షవర్ధన్ పాటిల్
హర్షవర్ధన్ షాహాజీరావు పాటిల్ (జననం 21 ఆగస్టు 1963) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఇందాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]
హర్షవర్ధన్ షాహాజీరావు పాటిల్ | |||
పదవీ కాలం 1995 – 2014 | |||
ముందు | గణపతిరావు సీతారాం పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | దత్తాత్రయ్ భర్నే | ||
నియోజకవర్గం | ఇందాపూర్ | ||
వ్యవసాయ, హార్టికల్చర్, భూమి & నీటి సంరక్షణ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 1995 మార్చి 14 – 1999 అక్టోబర్ 17 | |||
ముందు | మాణిక్‌రావు ఠాక్రే | ||
తరువాత | దాదా జాదవరావు | ||
పదవీ కాలం 2004 నవంబర్ 9 – 2008 డిసెంబర్ 1 | |||
ముందు | గణపతిరావు దేశ్‌ముఖ్ | ||
తరువాత | రంజీత్ దేశ్‌ముఖ్ | ||
పదవీ కాలం 2004 నవంబర్ 9 – 2008 డిసెంబర్ 1 | |||
ముందు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | వినయ్ కోర్ మదన్ పాటిల్ | ||
పదవీ కాలం 2008 డిసెంబర్ 8 – 2009 నవంబర్ 6 | |||
ముందు | పతంగరావు కదం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | రామరాజే నాయక్ నింబాల్కర్ అశోక్ చవాన్ | ||
పదవీ కాలం 2009 నవంబర్ 7 – 2010 నవంబర్ 10 | |||
ముందు | అనీస్ అహ్మద్ | ||
తరువాత | మదన్ పాటిల్ మహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ | ||
పార్లమెంటరీ వ్యవహారాలు, మార్కెటింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2010 నవంబర్ 11 – 2014 సెప్టెంబర్ 26 | |||
ముందు | రామరాజే నాయక్ నింబాల్కర్ | ||
తరువాత | ప్రకాష్ మెహతా చంద్రకాంత్ పాటిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బవాడ, ఇందాపూర్, పూణె జిల్లా | 1963 ఆగస్టు 21||
రాజకీయ పార్టీ | ఎన్‌సీపీ - ఎస్‌పీ (2024- ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2019-2024) భారత జాతీయ కాంగ్రెస్ (2019కి ముందు) | ||
జీవిత భాగస్వామి | భాగ్యశ్రీ పాటిల్ | ||
సంతానం | అంకితా పాటిల్ థాకరే రాజవర్ధన్ పాటిల్ |
రాజకీయ జీవితం
మార్చుహర్షవర్ధన్ పాటిల్ రాజకీయాల పట్ల ఆసక్తితో 1995లో స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వ్యవసాయ, హార్టికల్చర్, భూమి & నీటి సంరక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1999, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హర్షవర్ధన్ పాటిల్ 2009లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు పార్లమెంటరీ వ్యవహారాలు & సహకార శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2014 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దత్తాత్రయ్ విఠోబా భర్నే చేతిలో 14,173 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
హర్షవర్ధన్ పాటిల్ 2019 శాసనసభ ఎన్నికలకు ఒక నెల ముందు కాంగ్రెస్‌ను వీడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఫిబ్రవరి 2024లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. హర్షవర్ధన్ పాటిల్ 2024 శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి అక్టోబర్ 7న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) పార్టీలో చేరి[3], 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ దత్తాత్రయ్ భర్నే చేతిలో 19,410 ఓట్ల తేడాతో అభ్యర్థి ఓడిపోయాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Harshvardhan Patil: The politician who deftly switches parties without ruffling feathers" (in ఇంగ్లీష్). The Indian Express. 7 October 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Former Maharashtra minister Harshvardhan Patil joins BJP ahead of Assembly elections" (in ఇంగ్లీష్). The New Indian Express. 11 September 2019. Retrieved 2 January 2025.
- ↑ "BJP's Harshvardhan Patil joins NCP (SP); Sharad Pawar hints Ramraje Naik Nimbalkar is next" (in Indian English). The Hindu. 7 October 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Indapur". Election Commission of India. 23 November 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.