2000 వేసవి ఒలింపిక్ క్రీడలు
21 వ శతాబ్దములో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలకు ఆస్ట్రేలియాలోని సుందరనగమైన సిడ్నీ వేదికగా నిలిచింది. 2000 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన 27 వ ఒలింపిక్ క్రీడలలో 199 దేశాల నుంచి 10651 క్రీడాకారులు పాల్గొని తమ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. 298 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా 37 క్రీడాంశాలలో నెగ్గి అత్యధిక స్వర్ణ పతకాలతో ప్రథమస్థానంలో నిలిచింది.భారత్కు చెందిన కరణం మల్లేశ్వరి మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిప్టింగ్లో కాంస్యం సాధించి భారత్‌కు ఏకైక పతకం సంపాదించిపెట్టింది.
అత్యధిక పతకాలు సాధించిన దేశాలు
మార్చు2000 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు 300 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 37 స్వర్ణ పతకాలను సాధించి అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు రష్యా, చైనాలు పొందినాయి.
స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం 1 అమెరికా 37 24 31 92 2 రష్యా 32 28 28 88 3 చైనా 28 16 15 59 4 ఆస్ట్రేలియా 16 25 17 58 5 జర్మనీ 13 17 26 56 6 ఫ్రాన్స్ 13 14 11 38 7 ఇటలీ 13 8 13 24 8 నెదర్లాండ్స్ 12 9 4 25 9 క్యూబా 11 11 7 29 10 బ్రిటన్ 11 10 7 28
క్రీడలు
మార్చు2000 ఒలింపిక్ క్రీడలలో భాగంగా జరిగిన క్రీడలు
|
2000 ఒలింపిక్స్‌లో భారత్ స్థానం
మార్చు2000 ఒలింపిక్ క్రీడలలో భారత్ ఒకే ఒక్క కాంస్య పతకాన్ని సాధించి పతకాల పట్టికలో 70వ స్థానాన్ని పొందినది. మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లేశ్వరి భారతదేశానికి ఏకైక స్వర్ణాన్ని సాధించిపెట్టింది. అథ్లెటిక్స్‌లో చాలా భారత క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా రాజీవ్ బాల కృష్ణన్, బీనామోల్‌లు సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగాలు. పురుషుల లైట్ వెయిట్ లిఫ్టింగ్ (81 కేజీల విభాగం)లో గురుబచన్ సింగ్ క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయాడు. హాకీలో 7వ స్థానాన్ని మాత్రమే పొందగలిగింది.
సిడ్నీ ఒలింపిక్ క్రీడలు - కొన్ని ముఖ్య విషయాలు
మార్చు- 2000 ఒలింపిక్ క్రీడల నిర్వహణకై హోరాహోరీ పోరులో 1993లో జరిగిన ఓటింగ్‌లో సిడ్నీ, బీజింగ్‌ను కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడించింది.
- సిడ్నీ ఒలింపిక్ క్రీడల నిర్వహణకై 6.6 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అయింది.
- ఆస్ట్రేలియా గవర్నర్-జనరల్ విలియం డీన్ ఈ క్రీడలకు ప్రారంభోత్సవం చేశాడు.
- 3 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించిన అమెరికాకు చెందిన మరియన్ జోన్స్ మాదక ద్రవ్యాలు సేవించినట్లు విశదం కావడంతో ఏడేళ్ళ తరువాత పతకాలు స్వాధీనం చేసుకొని రెండేళ్ళ నిషేధం కూడా విధించారు.[1][2][3][4][5][6][7][8][9][10][11][12][13]
ఇవి కూడా చూడండి
మార్చు
బయటి లింకులు
మార్చు- Sydney Olympic Games Information
- Sydney Olympic Park
- Sydney Olympic Games Opening Ceremony - Australian Special Events
- Australian Olympic Committee site on 2000 Sydney Olympics - includes information and photo gallery
- IOC Site on 2000 Summer Olympics
- Sydney 2000 Games Collection at the Powerhouse Museum - information and audio files
A Look Back at the Sydney Olympics and Paralympics[permanent dead link] - Australian Bureau of Statistics[అచేతన లింకు]- 2000 Sydney Olympics - Culture and Recreation
- Satellite view of 2000 Sydney Olympics sites
- Sydney 2000 Olympic Games Archived 2020-10-06 at the Wayback Machine - archived websites in PANDORA
- Sydney 2000 Olympic and Paralympic Games Photo Map - Photomap of Venues, Events and Construction leading up to Sydney 2000
- Volunteers Website - Website maintained by and for Sydney 2000 Volunteer Alumni
- Official Report Vol. 1 Archived 2008-04-13 at the Wayback Machine - Digital Archive from the Amateur Athletic Foundation of Los Angeles
Sydney 2000 Olympic pins[permanent dead link][అచేతన లింకు]- http://news.parseek.com/sport
- http://www.isna.ir
మూలాలు
మార్చు- ↑ BBC Sport
- ↑ ABC News
- ↑ Guardian Unlimited
- ↑
msnbc[అచేతన లింకు] - ↑ ESPN Track and Field News
- ↑ Blogsport[permanent dead link]
- ↑ FoxNews.com
- ↑
The Irish Times Archived 2008-06-02 at the Wayback Machine[అచేతన లింకు] - ↑ "Wikio sports". Archived from the original on 2008-05-29. Retrieved 2008-05-21.
- ↑
Marion Jones stripped of Medals Philadelphia Daily News[అచేతన లింకు] - ↑
Marion Jones stripped of Medals Philadelphia Daily News - Sports[అచేతన లింకు] - ↑ Detroit Free Press[permanent dead link]
- ↑ "Jones stripped of Sydney medals". Archived from the original on 2008-05-29. Retrieved 2008-05-21.