2004 వేసవి ఒలింపిక్ క్రీడలు
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వేసవి ఒలింపిక్ క్రీడలు 2004లో గ్రీసు రాజధాని ఎథెన్స్లో జరిగాయి. వీటికే 2004 ఒలింపిక్ క్రీడలు లేదా 2004 వేసవి ఒలింపిక్ క్రీడలు అని వ్యవహరిస్తారు. ఈ క్రీడలు 2004, ఆగష్టు 13 నుంచి ఆగష్టు 29 వరకు జరిగాయి. ఇందులో 10,625 క్రీడాకారులు, 5501 అధికారులు 201 దేశాల నుంచి పాల్గొన్నారు.[1] 1896లో తొలి ఒలింపిక్ క్రీడలు జరిగిన ఎథెన్స్‌లోనే మళ్ళీ 100 సంవత్సరాల తరువాత 1996లో కూడా ఒలింపిక్స్ నిర్వహించాలనే ఆశ నెరవేరకున్ననూ 2004 క్రీడల నిర్వహణ మాత్రం లభించడం గ్రీసు దేశానికి సంతృప్తి లభించింది.
అత్యధిక పతకాలు సాధించిన దేశాలు
మార్చు2004 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు, 301 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 36 స్వర్ణ పతకాలను సాధించి అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు చైనా, రష్యాలు పొందినాయి.
స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం 1 అమెరికా 36 39 27 102 2 చైనా 32 17 14 63 3 రష్యా 27 27 38 92 4 ఆస్ట్రేలియా 17 16 16 49 5 జపాన్ 16 9 12 37 6 జర్మనీ 13 16 20 49 7 ఫ్రాన్స్ 11 9 13 33 8 ఇటలీ 10 11 11 32 9 దక్షిణ కొరియా 9 12 9 30 10 బ్రిటన్ 9 9 12 30
క్రీడలు
మార్చు
|
|
|
|
2004 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం
మార్చు2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం లభించింది. పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రాజ్య వర్థన్ సింగ్ రాథోడ్ ఒక్కడే రజత పతకం సంపాదించి భారత్ పేరును పతకాల పట్టికలో చేర్చాడు. అథ్లెటిక్స్‌లో పలువులు భారతీయ క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జాతీయ క్రీడ హాకీలో 7 వ స్థానం లభించింది.టెన్నిస్‌లో మహేష్ భూపతి, లియాండర్ పేస్ జోడి పురుషుల డబుల్స్‌లో నాల్గవ స్థానం పొంది తృటిలో కాంస్యపతకం జారవిడుచుకున్నారు.
ఇవీ చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- IOC page on Athens
- Athens 2004 Olympic Games coverage by Community-online.com
- Costs of hosting the 2004 Olympics
- Pictures from the opening ceremony
- Pictures backstage from the opening ceremony
- Open Directory Project - 2004 Athens Olympics directory category
- Media coverage:BBC, CBC NBC, and Seven Network Archived 2006-08-20 at the Wayback Machine
- Athens Athlete NOC pins
- History of a stay during the Athens 2004 Olympic Summer Games
- Athens 2004 Olympic pins[permanent dead link]
- Apology letter to Athens from SI.com
మూలాలు
మార్చు- ↑ "Athens 2004". International Olympic Committee. www.olympic.org. Retrieved 2008-01-19.