2013 భారత హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం

భారతదేశంలో హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన కుంభకోణం

హెలికాప్టర్ల కొనుగోలులో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన లంచాల కుంభకోణాన్ని హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం అంటారు. దీన్ని అగస్టావెస్ట్‌ల్యాండ్ VVIP ఛాపర్ డీల్ అని కూడా అంటారు. 2006, 2007 లో ఉన్నత స్థాయి భారతీయ రాజకీయ నాయకుల కోసం అధిక రేట్లకు హెలికాప్టర్లను కొనుగోలు చేయడం కోసం, మధ్యవర్తులకు, అధికారులకూ లంచాలు ఇచ్చారు.[1] సిబిఐ ప్రకారం, ఈ కుంభకోణంలో భాగంగా రూ 2500 కోట్లను UK UAEల లోని బ్యాంక్ ఖాతాల ద్వారా బదిలీ చేసారు.

ఇటలీ నేవీకి చెందిన AW101. ఈ ఒప్పందంలో కొనుగోలు చేయబోయిన హెలికాప్టర్ మోడలు ఇదే

2013 ప్రారంభంలో, హెలికాప్టర్ తయారీదారు అగస్టావెస్ట్‌ల్యాండ్‌ నుండి కొత్త హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి అనేక మంది సీనియర్ అధికారులు లంచాలు తీసుకున్నారన్న అవినీతి ఆరోపణలపై పార్లమెంటరీ దర్యాప్తు ప్రారంభించినప్పుడు, ఇది వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణాన్ని మీడియా ఛాపర్ స్కామ్ లేదా ఛాపర్‌గేట్‌గా పేర్కొన్నాయి.[2] 12 అగస్టావెస్ట్‌ల్యాండ్ AW101 హెలికాప్టర్ల సరఫరా కోసం రూ 3600 కోట్ల కాంట్రాక్టును ఇవ్వడానికి అనేక మంది భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకులు, సైనిక అధికారులు అగస్టా వెస్ట్‌ల్యాండ్ నుండి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ హెలికాప్టర్లు భారత రాష్ట్రపతి, ఇతర ముఖ్యమైన నాయకుల కోసం VVIP విధులను నిర్వహించడానికి ఉద్దేశించారు.[3] కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ ఒప్పందం నుండి లంచాలు తీసుకునాడని ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.[4]

మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ (2018 డిసెంబరు 4 న భారతదేశానికి రప్పించారు) అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఉద్యోగి పీటర్ హులెట్‌కు పంపిన నోట్‌లో - ఈ నోట్‌ను తరువాత ఇటలీ కోర్టుకు సమర్పించారు - సోనియా గాంధీకి ముఖ్య సలహాదారులను లక్ష్యంగా చేసుకోమని కోరాడు. వారి పేర్లను ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ, M. వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, MK నారాయణన్, వినయ్ సింగ్ అని నోట్‌లో పేర్కొన్నాడు. "AF" € 6 మిలియన్లు, "BUR" € 8.4 మిలియన్లు, "Pol" € 6 మిలియన్లు, "AP" € 3 మిలియన్లుగా లంచాలను విభజించమని కూడా నోట్‌లో ఉంది.[5][6][7] 2018 జనవరి 8 న, మిలన్ మూడవ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, ఈ ఆరోపణలన్నిటి లోనూ ప్రతివాదులను నిర్దోషులుగా ప్రకటించింది.[8] అభయ్ త్యాగి కూడా ₹69,00,000 విలువైన లంచం అందుకున్నాడని ఆరోపించారు.

ఈ కేసును భారత ప్రభుత్వం, సిబిఐలు భారతదేశంలో దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి.[1]

అవలోకనం

మార్చు

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తదితర VVIPలను తీసుకువెళ్లడానికి భారత వైమానిక దళానికి చెందిన కమ్యూనికేషన్ స్క్వాడ్రన్ కోసం 2010 ఫిబ్రవరిలో 12 అగస్టావెస్ట్‌ల్యాండ్ AW101 హెలికాప్టర్‌లను కొనుగోలు చేసే ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) సంతకం చేసింది. 2013 ఫిబ్రవరి 12 న అవినీతి, లంచం ఆరోపణలపై ఇటాలియన్ అధికారులు అగస్టావెస్ట్‌ల్యాండ్ మాతృ సంస్థ అయిన ఫిన్‌మెకానికా ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన గియుసేప్ ఓర్సీని అరెస్టు చేయడంతో ఈ కాంట్రాక్టుపై వివాదం వెలుగులోకి వచ్చింది;[9] మరుసటి రోజు, భారత రక్షణ మంత్రి AK ఆంటోనీ ఒప్పందంపై విచారణకు ఆదేశించాడు.[10]

సంఘటనలు

మార్చు
  • 2013 మార్చి 25న, భారత రక్షణ మంత్రి AK ఆంటోనీ అవినీతి ఆరోపణలను ధ్రువీకరించాడు: "అవును, హెలికాప్టర్ ఒప్పందంలో అవినీతి జరిగింది, లంచాలు తీసుకున్నారు. సిబిఐ ఈ కేసును చాలా తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది." అన్నాడు.[11] 2014 జూన్ నాటికి, భారత ప్రభుత్వం మొత్తం రూ 2068 కోట్లను పట్టుకుంది.[12] అగస్టావెస్ట్‌ల్యాండ్‌కు చెల్లించిన దాదాపు రూ 1620 కోట్లను వెనక్కి రాబట్టింది (మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ. 3600 కోట్లలో ఇది 45%).[13]
  • 2016 ఏప్రిల్ 8న, మిలన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్, 225 పేజీల తీర్పులో, దిగువ కోర్టు తీర్పును తోసిపుచ్చింది. భారతీయ రాజకీయ నాయకులు, అధికారులు, భారత ఎయిర్ ఫోర్స్ అధికారులకు €3 కోట్ల లంచాలు ఇచ్చినందుకు హెలికాప్టర్ తయారీదారు అగస్టావెస్ట్‌ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ గియుసేప్ ఓర్సీకి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.[14]
  • 2016 డిసెంబరు 9 న సిబిఐ, భారత వాయుసేన మాజీ చీఫ్ SP త్యాగితో పాటు అతని బంధువు సంజీవ్ త్యాగి, న్యాయవాది గౌతం ఖైతాన్‌లను అరెస్టు చేసింది.[15] 2017 సెప్టెంబరులో సీబీఐ, ఎస్పీ త్యాగితో పాటు మరో తొమ్మిది మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది.
  • 2016 డిసెంబరు 16 న, ఇటాలియన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కాసాజియోన్, 2016 ఏప్రిల్ నాటి నేర నిరూపణ శిక్షను రద్దు చేసి, మిలన్‌లో మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది.
  • 2018 జనవరి 8న, మిలన్ మూడవ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆరోపణలన్నిటి లోను ప్రతివాదులను నిర్దోషులుగా ప్రకటించింది.[8]
  • 2018 డిసెంబరు 5 న, ముద్దాయి, దళారీ అయిన క్రిస్టియన్ మిచెల్‌ను దుబాయ్ నుండి భారతదేశానికి రప్పించారు.[16]
  • 2019 జనవరి 31 న, మరో సహ నిందితుడు రాజీవ్ సక్సేనా, లాబీయిస్ట్ దీపక్ తల్వార్‌లను దుబాయ్ నుండి భారతదేశానికి రప్పించారు.[17]
  • 2019 ఏప్రిల్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో రాజు సంతానం, మను పబ్బితో పాటు శేఖర్ గుప్తాతో సహా ముగ్గురు జర్నలిస్టుల పేరును ప్రస్తావించారు.[18][19][20][21][22][23]

విచారణ

మార్చు

భారీ వివాదం, అవినీతి ఆరోపణల తర్వాత,[24][25] రక్షణ మంత్రి AK ఆంటోనీ, 2013 ఫిబ్రవరి 12న, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ను దర్యాప్తుకు ఆదేశించాడు.[26][27]

2013 ఫిబ్రవరి 25 న, నాలుగు కంపెనీల పైన, భారత వైమానిక దళ మాజీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ SP త్యాగి, అతని బంధువులతో సహా 11 మంది వ్యక్తులపైనా సిబిఐ ప్రాథమిక విచారణ (PE) నమోదు చేసింది.[28] ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత, సీబీఐ తగిన సాక్ష్యాలను కనుగొని 2013 మార్చి 13న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. భారత వాయుసేన మాజీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి, అతని ముగ్గురు సోదరులు: జూలీ, డోక్సా, సందీప్, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియా సోదరుడైన సతీష్ బగ్రోడియా, ప్రతాప్ అగర్వాల్ (IDS ఇన్ఫోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) సహా 13 మందిని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో ఇటలీకి చెందిన ఫిన్‌మెకానికా, యుకెకు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్, చండీగఢ్‌కు చెందిన ఐడిఎస్ ఇన్ఫోటెక్, ఏరోమ్యాట్రిక్స్ అనే నాలుగు కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి.[29][30]

2013లో ఈ కుంభకోణంలో బిలియనీర్ భారతీయ ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మ, రొమేనియాలో జన్మించిన అతని భార్య అంకా నెక్సును అనుమానితులుగా పేర్కొన్నారు. అభిషేక్ ఈ ఒప్పందంలో మధ్యవర్తి పాత్ర పోషించాడు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నుండి ఆమోదం పొందడంలో రాజకీయ నాయకులను సంప్రదించాడు. ఈ సంబంధాన్ని టైమ్స్‌నౌ టీవీ తమ ప్రపంచ పరిశోధనతో బహిర్గతం చేసింది.[31][32] పరిశోధకుల ప్రకారం, అగస్టా వెస్ట్‌ల్యాండ్ నుండి వచ్చిన లంచాలలో కొంత భాగాన్ని అభిషేక్ కంపెనీలైన మారిషస్‌లోని అట్లాస్ డిఫెన్స్ సిస్టమ్స్[33] ఖాతాలకు, అట్లాస్ గ్రూప్ లిమిటెడ్‌కు చెందిన బెర్ముడా ఖాతాలకు మరొక భాగాన్ని న్యూయార్క్‌లోని అతని భార్య కంపెనీ గాంటన్ లిమిటెడ్‌కూ మళ్లించారు.[34][35] ఈ కుంభకోణంలో లబ్ధిదారులుగా ఉన్న భారతీయ రాజకీయ నాయకులకు ఈ నిధులు పంపినట్లు అనుమానిస్తున్నారు. బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి 2013లో అభిషేక్ వర్మ[36] అతని భార్య అంకా నీక్సు[37] ల పాత్రను తన అనేక బ్లాగులు, పత్రికా ప్రకటనలలో ప్రస్తావించాడు.[38][39] తర్వాత 2017 ఏప్రిల్‌లో, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అంజు బజాజ్ చందనా ఈ అవినీతి ఆరోపణల నుంచి వర్మ దంపతులను విముక్తి చేసింది.[40]

2015 సెప్టెంబరులో ప్రత్యేక సిబిఐ కోర్టు, క్రిస్టియన్ మిచెల్‌ ఈ ఒప్పందంలో "కమీషన్"గా ఎంత మొత్తం పొందాడో తెలుసుకోవడానికి ఈ కేసులో అతన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిబిఐ అడిగిన మీదట, అతనిపై ఓపెన్ నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఈ అరెస్ట్ వారెంట్ ఆధారంగా క్రిస్టియన్ మిచెల్ జేమ్స్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని, ఆ వారెంట్‌ను అమలు చేయాలని ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించనున్నట్లు సీబీఐ పేర్కొంది.[41] ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను తన జీవితంలో ఏ "గాంధీ"ని కలవలేదని పేర్కొంటూ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించాడు.[42]

మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. 2015 మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, క్రిస్టియన్ మిచెల్‌కు చెందిన సుమారు 1.12 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి, తాత్కాలిక జప్తు ఆదేశం జారీ చేసింది. దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో మీడియా ఎగ్జిమ్ అనే మీడియా సంస్థ పేరుతో మిచెల్, లంచం సొమ్ముతో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు ఇడి పేర్కొంది. అతనికి ఒక లగ్జరీ కారు 54 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కూడా ఉన్నట్లు సమాచారం. 2015 సెప్టెంబరులో కోర్టు ఆస్తుల జోడింపును ధృవీకరిస్తూ, ఆస్తులను నిలుపుకోవడానికి ఏజెన్సీని అనుమతించింది.[43] 2015 సెప్టెంబరులో మాజీ వాయుసేన చీఫ్ ఎస్‌పి త్యాగి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న సుమారు 7 కోట్ల విలువైన ఆస్తులను ED జప్తు చేసింది.[44]

సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ

మార్చు

2013 ఫిబ్రవరి 27న, UPA-II ప్రభుత్వం 30 మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నేతృత్వంలోని దర్యాప్తు కోసం రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బిజెపి, జెడి(యు), తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, ఎజిపి వంటి చాలా ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేసిన తర్వాత ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.[45][46] చర్చ సందర్భంగా, ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, జెపిసి "వృథా కసరత్తు" అని, ఇది "దృష్టి మళ్లింపు వ్యూహం" అనీ విమర్శించాడు. ఈ కేసులో నిందితులైన విదేశీయులను అప్పగించడం, కస్టడీ విచారణ వంటి వివిధ చట్టపరమైన అంశాలు ఉన్నాయని, JPCకి "ఈ అధికారాలు ఏవీ ఉండవనీ", ఇది పనికిరాకుండా పోతుందనీ వాదించాడు. చాలా మంది ప్రతిపక్ష సభ్యులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు (2G స్పెక్ట్రమ్ కేసులో చేసినట్లుగా). మనీ ట్రయిల్‌ను ఏర్పాటు చేసి లెటర్ రోగేటరీ (ఎల్‌ఆర్) జారీ చేయాలని కూడా డిమాండ్ చేశారు.[45]

UPA ప్రభుత్వం మొదట్లో అన్ని ఆరోపణలను ఖండించింది. "మేం దాచిపెట్టిన దేమీ లేదు", "కప్పి పెట్టడం మా ట్రాక్ రికార్డ్ కాదు" అని పేర్కొంది.[45]

భారత ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేయడం

మార్చు

2014 జనవరిలో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో 3,600 కోట్ల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. "కాంట్రాక్టుకు ముందు చేసుకునే సమగ్రత ఒప్పందాన్నీ, AWIL (అగస్టావెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్) తో చేసుకున్న ఒప్పందాన్నీ ఉల్లంఘించిన కారణంగా" ప్రభుత్వం ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. 2013 లో లంచాల ఆరోపణలు వచ్చినపుడే ఒప్పందాన్ని స్తంభింపజేసారు.[47]

నిర్ణయం తీసుకునేవారు

మార్చు

VVIP ఉపయోగం కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ల ఎంపికకు దారితీసిన నిర్ణయాత్మక ప్రక్రియలో పాల్గొన్న సీనియర్ అధికారులు MK నారాయణన్ (ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), మాజీ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఇండియా) NSA); BV వాంచూ (IPS, చీఫ్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్); శశి కాంత్ శర్మ, IAS, మాజీ రక్షణ కార్యదర్శి.[48] కేంద్రంలో వారి పదవీకాల తర్వాత UPA ప్రభుత్వం, MK నారాయణన్‌ను పశ్చిమ బెంగాల్ గవర్నరుగా, BV వాంచూను గోవా గవర్నరుగా, శశికాంత్ శర్మను భారతదేశ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్‌గా నియామకాలు చేసింది.[48]

సీబీఐ విచారణ

మార్చు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) 2014 జనవరిలో MK నారాయణన్, BV వాంచూ వాంగ్మూలాలను నమోదు చేయడానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించింది [49] సిబిఐ అభ్యర్థన సమయంలో ఎంకె నారాయణన్, బివి వాంచూలు పశ్చిమ బెంగాల్, గోవాలకు గవర్నర్లుగా ఉన్నారు. అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో వారు జాతీయ భద్రతా సలహాదారు, ప్రత్యేక రక్షణ బృందం (SPG) చీఫ్‌లుగా ఉన్నందున వారి ప్రకటనలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో భారత ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, కపిల్ సిబల్ అధినేతగా ఉన్న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, "ఇమ్యూనిటీ" అనే సాధారణ సాకుతో వారిని పరిశీలించాలన్న సిబిఐ అభ్యర్థనను తిరస్కరించి, సిబిఐ దర్యాప్తును అడ్డుకుంది. అందువల్ల వీరిద్దరినీ ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించింది.[50] MK నారాయణన్, BV వాంచూలను 2014 జూన్, జూలైలో సిబిఐ ప్రశ్నించింది.[51][52]

బ్యాంక్ గ్యారెంటీ రికవరీ

మార్చు

ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, భారతీయ బ్యాంకుల్లో అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇచ్చిన రూ 2500 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలను భారత ప్రభుత్వం 2014 జనవరిలో జప్తు చేసింది.[53] విడిగా, ఇటాలియన్ బ్యాంకుల్లో సంస్థ చేసిన బ్యాంక్ గ్యారెంటీ మొత్తాన్ని €275 మిలియన్లు ( 23.64 బిలియన్) తమకు ఇవ్వాలని భారతదేశం ఇటాలియన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.[54][55] 2014 మార్చి 17న, భారతదేశం చేసిన అభ్యర్థనను ఇటాలియన్ కోర్టు తిరస్కరించింది.[56] అయితే, మిలన్‌లోని అప్పీల్ కోర్టు, దిగువ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, భారత ప్రభుత్వ వాదనలను సమర్థించింది.[57] దీని ప్రకారం, 2014 జూన్‌లో భారత ప్రభుత్వం రూ 1818 కోట్ల గ్యారంటీలను క్యాష్ చేసింది. ఇప్పటివరకు రికవరీ చేసిన మొత్తం రూ 2068 కోట్లు.[12] దీనితో, భారతదేశం అప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని దాదాపు అంతా తిరిగి పొందినట్లు నివేదించబడింది.[13] అయితే, అగస్టావెస్ట్‌ల్యాండ్ మొత్తం మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని, అప్పటికే డెలివరీ చేసిన మూడు హెలికాప్టర్ల ఖరీదుగా €106 మిలియన్లను ఉంచుకున్నట్లు తర్వాత నివేదించబడింది.[58]

ఇటాలియన్ కోర్టు తీర్పులు

మార్చు

ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు 2011 చివరలో కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత, వారు కేసును విచారణ కోసం బస్టో ఆర్సిజియో కోర్టుకు పంపారు. ఇటాలియన్ కోర్టు, 2014 అక్టోబరులో తన తీర్పును వెలువరిస్తూ, అన్ని అవినీతి ఆరోపణల నుండి మాజీ IAF చీఫ్ SP త్యాగిని నిర్దోషిగా ప్రకటించింది.[59] ఇది "అంతర్జాతీయ అవినీతి ఆరోపణల" నుండి మాజీ ఫిన్‌మెకానికా CEO గియుసెప్ ఓర్సీ, అగస్టావెస్ట్‌ల్యాండ్ మాజీ హెడ్ బ్రూనో స్పాగ్నోలినిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో "తప్పుడు ఇన్‌వాయిస్" అనే తక్కువ అభియోగంపై కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.[60] 2016 ఏప్రిల్ 8న, మిలన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్, 225 పేజీల తీర్పులో, దిగువ కోర్టు తీర్పును తోసిపుచ్చి, గియుసేప్ ఓర్సీకి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.[14]

ఆపై, 2016 డిసెంబరు 16 న, కోర్టే డి కాస్సాజియోన్ (సుప్రీం కోర్ట్) అప్పీల్స్ కోర్టు ఆ తీర్పును రద్దు చేసి, మిలన్‌లోని వేరే అప్పీల్ కోర్ట్‌కు ఈ విషయాన్ని సూచిస్తూ పునఃవిచారణకు ఆదేశించింది.[61] తొమ్మిది నెలల విచారణ తర్వాత, 2018 జనవరి 8న, మిలన్ థర్డ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ చివరకు ప్రతివాదులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆరోపణలకు మద్దతుగా ప్రాసిక్యూషన్ అందించిన తగిన సాక్ష్యాధారాలు లేవని చెబుతూ, అన్ని ఆరోపణలను కొట్టివేసింది.[8] మిలన్ జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అటార్నీ జనరల్ మద్దతును పొందడంలో విఫలమైన తర్వాత 2019 మే 22న ఆ తీర్పును కాస్సాజియోన్ సుప్రీం కోర్టు సమర్థించింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "CBI gets Michel custody: Bank linked to payoff taken over, account details are missing". The Indian Express. 5 December 2018. Retrieved 6 December 2018.
  2. "SEARCH RESULTS FOR Choppergate". India Today. Retrieved 4 March 2013.
  3. Kumar, Vinay (18 February 2013). "Chopper scam: Long-drawn legal battle ahead". The Hindu. Chennai, India. Retrieved 25 February 2013.
  4. "Does AP mean Ahmed Patel, asks prosecutor in Italy court; middleman says don't know". The Indian Express. 10 January 2014.
  5. "Sonia Gandhi, PM tainted by chopper scam as note reveals Agusta was advised to target top leaders to win contract".
  6. "AgustaWestland scam: Has UPA subverted India into a kleptocracy, asks Jaitley". News18. Archived from the original on 2014-02-21.
  7. FP Staff (2 February 2014). "'Target' Sonia, her key advisers: Middleman told AgustaWestland". Firstpost.
  8. 8.0 8.1 8.2 "Reuters". Archived from the original on 2020-09-06. Retrieved 2024-07-10.
  9. Emilio Parodi and Stephen Jewkes (12 February 2013). "Finmeccanica head arrested over India bribe allegations". Reuters.[permanent dead link]
  10. "VVIP chopper deal scam: Italy arrests Finmeccanica CEO, India orders CBI probe". ZEE News. 13 February 2013. Retrieved 28 February 2013.
  11. "Bribes were taken in the VVIP helicopter deal, admits Defence Minister AK Antony". India today. 25 March 2013. Retrieved 19 March 2013.
  12. 12.0 12.1 "India recovers Rs.1818 crore from AgustaWestland". Retrieved 8 June 2014.
  13. 13.0 13.1 "India Scraps Rs. 3,600 crore AgustaWestland Chopper Deal". Archived from the original on 2 January 2014. Retrieved 8 June 2014.
  14. 14.0 14.1 "CBI Seeks Italian Court's Order on AgustaWestland Graft". NDTV.com. 27 April 2016. Retrieved 3 May 2016.
  15. Pandey, Devesh K. (9 December 2016). "Former Air Force chief Tyagi arrested by CBI in AgustaWestland case". The Hindu (in Indian English). Retrieved 25 October 2017.
  16. Ohri, Raghav (5 December 2018). "Christian Michel lands in India, to face court today". The Economic Times. Retrieved 28 February 2019.
  17. Ohri, Raghav (31 January 2019). "AgustaWestland scam co-accused Rajeev Saxena, lobbyist Deepak Talwar extradited to India". The Economic Times. Retrieved 28 February 2019.
  18. "AgustaWestland: Michel hired advisor to 'influence' public opinion, chargesheet mentions 3 journalists". Archived from the original on 2024-07-10. Retrieved 2024-07-10.
  19. "Three Journalists Mentioned in AgustaWestland Chargesheet".
  20. "AgustaWestland chargesheet mentions three journalists". Business Standard India. 5 April 2019.
  21. "Christian Michel asked Shekhar Gupta, Manu Pubby, Raju Santhanam to influence public opinion on AgustaWestland: ED".
  22. "AgustaWestland chargesheet mentions three journalists". 5 April 2019.
  23. "Agusta Westland deal: Ahmad Patel, Sonia Gandhi, journalists mentioned in ED chargesheet - APN Live". 5 April 2019. Archived from the original on 4 డిసెంబరు 2021. Retrieved 10 జూలై 2024.
  24. "Chopper Deal: BJP Attacks UPA, Says It's 'Raining Scams'". 15 February 2013. Archived from the original on 5 October 2013. Retrieved 5 October 2013.
  25. "St Antony needs to be decanonised". 13 February 2013. Retrieved 5 October 2013.
  26. Kumar, Vinay (13 February 2013). "CBI probe ordered". The Hindu. Chennai, India. Retrieved 5 October 2013.
  27. "Italy arrests Finmeccanica CEO, India orders CBI probe". 13 February 2013. Retrieved 5 October 2013.
  28. Pandey, Devesh K. (25 February 2013). "CBI names Tyagi, cousins in PE". The Hindu. Chennai, India. Retrieved 5 October 2013.
  29. "CBI registers FIR against former Air chief SP Tyagi". The Times of India. 13 March 2013. Archived from the original on 6 October 2013. Retrieved 5 October 2013.
  30. "CBI files FIR against Air Force ex-chief SP Tyagi, 11 others". 13 March 2013. Archived from the original on 14 March 2013. Retrieved 5 October 2013.
  31. "Times Now TV global investigation role of Abhishek Verma and his wife Anca Neacsu in 12 VVIP Chopper scandal".
  32. "Times of India role of Abhishek Verma middleman in Agusta VVIP choppers".
  33. "Atlas Defence Systems - Abhishek Verma". Archived from the original on 2016-05-13. Retrieved 2024-07-10.
  34. "Ganton Ltd front company of Abhishek Verma newsitem".
  35. "Ganton Limited New York is a front of Abhishek Verma controlled by his wife Anca Neacsu - Delhi High Court order".
  36. "MOD seeks info from Italy on Abhishek Verma's role in VVIP chopper Scam".
  37. "Role of Anca Neacsu wife of Abhishek Verma in VVIP Chopper Scam identified".
  38. "Role of Abhishek Verma identified by Subramanian Swamy MP". Archived from the original on 2016-10-04. Retrieved 2024-07-10.
  39. "Role of Abhishek Verma in helicopter scandal - Wikileaks". Archived from the original on 30 April 2016.
  40. "Court discharges Abhishek Verma in graft case". The Economic Times. 2017-04-26. Retrieved 2020-04-18.
  41. "Open NBW Issued Against Accused UK National". Retrieved 30 September 2015.
  42. "VVIP chopper scam: Never met Sonia Gandhi in my life, says accused middleman". ABP Live. ABP News Bureau. 27 April 2016.
  43. "First property attachment in AgustaWestland VVIP helicopter deal scam". Archived from the original on 2015-10-01. Retrieved 30 September 2015.
  44. "ed-attaches-assets-of-tyagi-family".
  45. 45.0 45.1 45.2 "Parliament passes JPC probe into chopper scam". The Indian Express. 27 February 2013. Retrieved 28 February 2013.
  46. "Govt adopts motion for JPC probe, opposition walks out". FirstPost. 28 February 2013. Retrieved 4 March 2013.
  47. "Rs 3,600 crore VVIP chopper deal with AgustaWestland scrapped in view of bribery allegations". The Times of India. 2 January 2014.
  48. 48.0 48.1 "All linked to Agusta got good posts, says Manohar Parrikar". Deccan Chronicle. 9 May 2016. Retrieved 9 May 2016.
  49. "CBI seeks Home, Law ministries' advice to examine B V Wanchoo, M K Narayanan". 22 January 2014.
  50. "VVIP chopper deal: CBI seeks President's permission to question Narayanan, Wanchoo". The Times of India. Archived from the original on 2014-01-25.
  51. "CBI questions West Bengal governor M K Narayanan as witness in VVIP chopper deal". Patrika Group. 28 June 2014. Archived from the original on 14 July 2014. Retrieved 4 July 2014.
  52. "Goa Governor, Questioned By the CBI in AugustaWestland Chopper Deal, May Resign". Patrika Group. 4 July 2014. Archived from the original on 14 July 2014. Retrieved 4 July 2014.
  53. "India encashes over Rs 250 cr bank guarantee of AgustaWestland". Retrieved 8 June 2014.
  54. "AgustaWestland deal: Italy court rejects India's plea to recover bank guarantee". The Indian Express. 18 March 2014.
  55. "Italy judge rejects India bid to recover AgustaWestland guarantees". NDTV. 18 March 2014.
  56. "Italy judge rejects India request to recover AgustaWestland guarantees: Sources". The Times of India. 18 March 2014. Archived from the original on 18 March 2014.
  57. "India to encash 228 m euros bank guarantees of Agusta". Retrieved 8 June 2014.
  58. "AgustaWestland Hasn't Returned 106 Million Euros For 3 Choppers: Sources". NDTV. 29 April 2016.
  59. "AgustaWestland chopper scam: No corruption by ex-IAF chief SP Tyagi, says Italian court".
  60. "Chopper scam: Finmeccanica ex-heads cleared of graft charge, get 2 yrs in jail". The Indian Express. 10 October 2014.
  61. "Italy's Highest Court of Appeal Orders Retrial of Top AgustaWestland, Finmeccanica Officials".