2018 ఆసియా కప్
2018 ఆసియా కప్ (స్పాన్సర్‌షిప్ వల్ల యునిమోని ఆసియా కప్ [1] కూడా అంటారు) [2] అనేది వన్డే అంతర్జాతీయ (వన్‌డే) క్రికెట్ టోర్నమెంటు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2018 సెప్టెంబరులో జరిగింది. ఇది ఆసియా కప్ టోర్నమెంట్లలో 14వది. 1984, 1995 టోర్నమెంట్ల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడడం ఇది మూడవసారి. డిఫెండింగ్ ఛాంపియనైనభారతదేశం,[3] ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. [4]
2018 ఆసియా కప్ | |
---|---|
తేదీలు | సెప్టెంబరు 16 – సెప్టెంబరు 28 |
నిర్వాహకులు | ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
ఛాంపియన్లు | భారతదేశం (7th title) |
పాల్గొన్నవారు | 6 |
ఆడిన మ్యాచ్‌లు | 13 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | శిఖర్ ధావన్ |
అత్యధిక పరుగులు | శిఖర్ ధావన్ (342) |
అత్యధిక వికెట్లు | రషీద్ ఖాన్ (10) ముస్తాఫిజుర్ రహమాన్ (10) కుల్దీప్ యాదవ్ (10) |
← 2016 2022 → |
ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని ఐదు పూర్తి సభ్యులు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక టోర్నమెంటులో పాల్గొన్నాయి. 2018 ఆసియా కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటును గెలుచుకున్న హాంకాంగ్ వారితో చేరింది. [5] 2018 మార్చిలో క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో పదో స్థానంలో నిలిచిన తర్వాత హాంకాంగ్ తమ వన్‌డే హోదాను కోల్పోయింది. [6] [7] అయితే, 2018 సెప్టెంబరు 9న, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి), ఈ టోర్నమెంటులోని అన్ని మ్యాచ్‌లకు వన్‌డే హోదాను ఇచ్చింది. [8]
నేపథ్యం
మార్చువాస్తవానికి ఈ టోర్నీని భారత్‌లో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. [9] [10] భారత, పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు. [1]
2015 అక్టోబరు 29న, సింగపూర్‌లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) సమావేశం తరువాత, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెక్రటరీ, 2018 లో ఈ టోర్నమెంటును భారతదేశంలో నిర్వహిస్తామని చెప్పాడు.[11] 2017 ఎసిసి అండర్-19 ఆసియా కప్‌ను మలేషియాకు తరలించిన తర్వాత, ఈ టోర్నమెంటును నిర్వహించడానికి బిసిసిఐ 2017 ఆగస్టులో ప్రభుత్వ అనుమతి కోరింది. [12] టోర్నమెంటులో పాకిస్తాన్ కూడా పాల్గొనేలా చేసేందుకు గాను, ఈ టోర్నమెంటును అబుదాబిలో నిర్వహించడాన్ని పరిశీలిస్తారా అని 2018 ఏప్రిల్లో, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బిసిసిఐ, ఎసిసి లను అడిగారు. [13]
ఏప్రిల్‌లో జరిగే టోర్నమెంటుకు ముందు 2018 ఎసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. [14] ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతుందని ప్రకటించడంతో, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ను 2018 డిసెంబరుకు మార్చారు. టోర్నమెంటుకు శ్రీలంక సహ-ఆతిథ్యం ఇచ్చింది. [1]
ఫార్మాట్
మార్చుటోర్నమెంటు షెడ్యూలు, రూపం 2018 జూలై 24న ప్రకటించారు. ఆరు జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. [15] ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నమెంటులో సూపర్ ఫోర్ విభాగానికి చేరుకున్నాయి. [15] అక్కడి నుంచి సూపర్ ఫోర్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. [15] మొదట్లో, గ్రూప్ Aలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తమ మొదటి సూపర్ ఫోర్ గేమ్‌ను అబుదాబిలో ఆడాల్సి ఉంది. అయితే భారత్ మాత్రం, పూల్‌లో ఏ స్థానంలో ఉన్నా, దుబాయ్‌లోనే ఉంటుంది. [16] 2018 సెప్టెంబరు 19న, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) సూపర్ ఫోర్ సెక్షన్ షెడ్యూల్‌ను సవరించింది [17] ఎసిసి కొత్త షెడ్యూల్‌ను బంగ్లాదేశ్, పాకిస్తాన్ కెప్టెన్‌లు తీవ్రంగా విమర్శించారు. [18] [19]
జట్లు
మార్చు- ఆఫ్ఘనిస్తాన్, ఐసిసి పూర్తి సబ్యురాలు
- బంగ్లాదేశ్, ఐసిసి పూర్తి సబ్యురాలు
- భారతదేశం, ఐసిసి పూర్తి సబ్యురాలు
- పాకిస్తాన్, ఐసిసి పూర్తి సబ్యురాలు
- శ్రీలంక, ఐసిసి పూర్తి సబ్యురాలు
- హాంగ్‌కాంగ్, 2018 Asia Cup Qualifier
జట్లు
మార్చుఆఫ్ఘనిస్తాన్[20] (12) | బంగ్లాదేశ్[21] (11) | హాంగ్‌కాంగ్[22] (19) | భారతదేశం[23] (1) | పాకిస్తాన్[24] (8) | శ్రీలంక[25] (3) |
---|---|---|---|---|---|
|
|
|
|
|
|
టోర్నమెంటు ప్రారంభానికి ముందు, ఆఫ్ఘనిస్తాన్ జట్టు లోని వఫాదర్ మోమండ్ గాయం కారణంగా అతని స్థానంలో యామిన్ అహ్మద్జాయ్ను తీసుకున్నారు. [26] బంగ్లాదేశ్ జట్టులో మోమినుల్ హక్ చేరాడు. [27] గాయం కారణంగా శ్రీలంక జట్టులో దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక దూరమయ్యారు. వీరి స్థానంలో నిరోషన్ డిక్వెల్లా, షెహన్ జయసూర్యలు ఎంపికయ్యారు. [28] [29] బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్ ఇక్బాల్ ప్రారంభ మ్యాచ్‌లో మణికట్టు గాయంతో మిగిలిన టోర్నీకి దూరమయ్యాడు. [30]
గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌లు గాయాల కారణంగా భారత జట్టు నుండి తప్పుకున్నారు. వారి స్థానంలో రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, సిద్దార్థ్ కౌల్ లు ఎంపికయ్యారు. [31] టోర్నీ సూపర్ ఫోర్ దశలో సౌమ్య సర్కార్, ఇమ్రుల్ కయేస్‌లు బంగ్లాదేశ్ జట్టులోకి వచ్చారు. [32] 2018 జనవరిలో బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో గాయం కారణంగా షకీబ్ అల్ హసన్‌ను బంగ్లాదేశ్ చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ నుండి మిగిలిన టోర్నమెంటు అంతటికీ తొలగించారు. [33]
మ్యాచ్ అధికారులు
మార్చుఐసిసి మొత్తం పదమూడు మ్యాచ్‌లకు కింది అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను నియమించింది. ఐసిసి అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్న ఆసియా కప్‌లో పాల్గొనే దేశాలకు చెందినవారు ఆరుగురు, తటస్థ దేశాలకు చెందినవారు నలుగురు కాగా, మిగిలిన ఇద్దరు ఐసిసి అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌కు చెందినవారు. [34]
- మ్యాచ్ రిఫరీలు
వేదికలు
మార్చుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | |
---|---|
దుబాయ్ | అబూ ధాబీ |
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం |
అక్షాంశాలు: |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | |
---|---|
దుబాయ్ | అబూ ధాబీ |
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం |
నిర్దేశాంకాలు: 25°2′48″N 55°13′8″E / 25.04667°N 55.21889°E | నిర్దేశాంకాలు: 24°23′47″N 54°32′26″E / 24.39639°N 54.54056°E |
సామర్థ్యం: 25,000 | సామర్థ్యం: 20,000 |
మ్యాచ్‌లు: 8 | మ్యాచ్‌లు: 5 |
గ్రూప్ దశ
మార్చుదుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకతో తలపడింది. [35] 1995 ఏప్రిల్ లో, 1995 ఆసియా కప్‌లో, పాకిస్తాన్‌తో తలపడిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బంగ్లాదేశ్‌కు ఇది మొదటి మ్యాచ్. [36]
గ్రూప్ Bలో, శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు సూపర్ ఫోర్ విభాగానికి చేరుకున్నాయి. [37] [38] గ్రూప్ Aలో, హాంకాంగ్ కూడా తమ రెండు మ్యాచ్‌లలో ఓడిపోగా, భారత, పాకిస్తాన్‌లు సూపర్ ఫోర్స్‌కు చేరుకున్నాయి. [39]
గ్రూప్ A
మార్చు
|
|
Pos | Team | Pld | W | L | T | NR | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | India | 3 | 2 | 0 | 1 | 0 | 5 | 0.863 |
2 | Bangladesh | 3 | 2 | 1 | 0 | 0 | 4 | −0.156 |
3 | Pakistan | 3 | 1 | 2 | 0 | 0 | 2 | −0.599 |
4 | Afghanistan | 3 | 0 | 2 | 1 | 0 | 1 | −0.044 |
గ్రూప్ బి
మార్చుసూపర్ ఫోర్
మార్చుసూపర్ ఫోర్ మ్యాచ్‌ల చివరి రౌండ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలుపొందగా, బంగ్లాదేశ్ మూడు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. తద్వారా టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరి ఆఫ్ఘనిస్థాన్ నిష్క్రమించింది. [40] [41] చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. [42]సూపర్ ఫోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ లిద్దరికీ ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. మహేంద్రసింగ్ ధోని వారి స్థానంలో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వన్‌డేలలో భారతదేశానికి 200 సార్లు నాయకత్వం వహించిన క్రికెటరయ్యాడు.[43] భారత వన్‌డే జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పెద్దవయసు క్రికెటరు కూడా అయ్యాడు. [44] ఆ మ్యాచ్ టై అయింది. అసియా కప్‌లో మ్యాచ్ టై అవడం ఇదే మొదటిసారి. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన తొలి టై వన్‌డే మ్యాచ్ కూడా. [44]
Pos | Team | Pld | W | L | T | NR | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | India | 3 | 2 | 0 | 1 | 0 | 5 | 0.863 |
2 | Bangladesh | 3 | 2 | 1 | 0 | 0 | 4 | −0.156 |
3 | Pakistan | 3 | 1 | 2 | 0 | 0 | 2 | −0.599 |
4 | Afghanistan | 3 | 0 | 2 | 1 | 0 | 1 | −0.044 |
ఫైనల్
మార్చుగణాంకాలు
మార్చుఅత్యధిక పరుగులు
మార్చుఆటగాడు | ఇన్నింగ్స్ | పరుగులు | సగటు | SR | HS |
---|---|---|---|---|---|
శిఖర్ ధావన్ | 5 | 342 | 68.40 | 102.08 | 127 |
రోహిత్ శర్మ | 5 | 317 | 105.66 | 93.51 | 111 * |
ముష్ఫికర్ రహీమ్ | 5 | 302 | 60.40 | 81.18 | 144 |
మహ్మద్ షాజాద్ | 5 | 268 | 53.60 | 83.23 | 124 |
హష్మతుల్లా షాహిదీ | 5 | 263 | 65.75 | 72.25 | 97 * |
మూలం: [46] |
అత్యధిక వికెట్లు
మార్చుఆటగాడు | ఇన్నింగ్స్ | వికెట్లు | ఓవర్లు | BBI | ఎకాన్. |
---|---|---|---|---|---|
రషీద్ ఖాన్ | 5 | 10 | 46.1 | 46/3 | 3.72 |
ముస్తాఫిజుర్ రెహమాన్ | 5 | 10 | 42 | 45/4 | 4.4 |
కుల్దీప్ యాదవ్ | 5 | 10 | 58 | 45/3 | 4.08 |
జస్ప్రీత్ బుమ్రా | 4 | 8 | 34.5 | 37/3 | 3.67 |
రవీంద్ర జడేజా | 4 | 7 | 35 | 29/4 | 4.45 |
మూలం: [47] |
గమనికలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "2018 Asia Cup moved from India to UAE". ESPN Cricinfo. Retrieved 10 April 2018.
- ↑ "Unimoni to title sponsor UAE's Asia Cup". SportBusiness Group (in ఇంగ్లీష్). 15 August 2018. Retrieved 27 August 2018.
- ↑ "India to host Asia Cup 2018 in UAE". International Cricket Council. Retrieved 10 April 2018.
- ↑ "India creep home in final-over thriller to defend Asia Cup title". International Cricket Council. Retrieved 28 September 2018.
- ↑ "Hong Kong hold their nerve to clinch Asia Cup berth". International Cricket Council. Retrieved 6 September 2018.
- ↑ "Norman Vanua, Charles Amini help PNG defend 200". ESPN Cricinfo. Retrieved 9 September 2018.
- ↑ "Asia Cup participation highlights the ironies of Hong Kong's ODI existence". ESPN Cricinfo. Retrieved 15 September 2018.
- ↑ "ICC awards Asia Cup ODI status". International Cricket Council. Retrieved 9 September 2018.
- ↑ "Future Tours Programme" (PDF). International Cricket Council. Retrieved 24 August 2017.
- ↑ "IPL now has window in ICC Future Tours Programme". ESPN Cricinfo. Retrieved 12 December 2017.
- ↑ "2016 Asia Cup in Bangladesh, 2018 in India: Thakur". The Times of India.
- ↑ "BCCI to seek government clearance to host 2018 Asia Cup in India after losing rights for U-19 event". FirstPost. Retrieved 24 August 2017.
- ↑ "UAE Sheikh asks BCCI, ACC to stage Asia Cup in the Gulf". Mumbai Mirror. Retrieved 9 April 2018.
- ↑ "Pakistan to host Emerging Asia Cup in 2018". Wisden India. Archived from the original on 29 October 2017. Retrieved 30 October 2017.
- ↑ 15.0 15.1 15.2 "Asia Cup 2018: No break for India in group stage; will face qualifier and Pakistan on consecutive days". Times Of India. Retrieved 24 July 2018.
- ↑ "Sarfraz miffed by skewed Asia Cup scheduling". ESPN Cricinfo. Retrieved 19 September 2018.
- ↑ "ACC releases new schedule for Super Four stage of Asia Cup". Geo TV. Retrieved 19 September 2018.
- ↑ "Sarfraz, Mortaza Unhappy With Super Fours Schedule". News18. Retrieved 19 September 2018.
- ↑ "Even a mad person would be upset, says Mash on fixture change". The Daily Star. Retrieved 19 September 2018.
- ↑ "Afghanistan pick four spinners for Asia Cup". ESPN Cricinfo. Retrieved 2 September 2018.
- ↑ "Mohammad Mithun, Ariful Haque in Bangladesh squad for Asia Cup 2018". International Cricket Council. Retrieved 30 August 2018.
- ↑ "Anshuman Rath to lead Hong Kong into the 2018 Unimoni Asia Cup". Hong Kong Cricket. Archived from the original on 10 September 2018. Retrieved 10 September 2018.
- ↑ "India rest Virat Kohli for Asia Cup, Rohit Sharma to lead; uncapped Khaleel Ahmed called up". ESPN Cricinfo. Retrieved 1 September 2018.
- ↑ "Shaheen Afridi included in Pakistan squad for Asia Cup 2018". International Cricket Council. Retrieved 4 September 2018.
- ↑ "Lasith Malinga recalled for Asia Cup". ESPN Cricinfo. Retrieved 1 September 2018.
- ↑ "Wafadar ruled out of Asia Cup". Afghanistan Cricket Board. Archived from the original on 25 December 2018. Retrieved 6 September 2018.
- ↑ "Asia cup UAE 2018: Mominul Haque included in Bangladesh Squad". Bangladesh Cricket Board. Retrieved 7 September 2018.
- ↑ "Dinesh Chandimal ruled out of Asia Cup". International Cricket Council. Retrieved 10 September 2018.
- ↑ "Shehan Jayasuriya replaces injured Danushka gunathilaka in Sri Lanka's Asia Cup squad". International Cricket Council. Retrieved 13 September 2018.
- ↑ "Tamim Iqbal ruled out of Asia Cup". International Cricket Council. Retrieved 15 September 2018.
- ↑ "Hardik, Axar, Shardul all out of Asia Cup with injury". ESPN Cricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Soumya Sarkar, Imrul Kayes added to Bangladesh's Asia Cup squad". ESPN Cricinfo. Retrieved 21 September 2018.
- ↑ "Injured Shakib Al Hasan flies home after being ruled out of Asia Cup". ESPN Cricinfo. Retrieved 26 September 2018.
- ↑ "ICC Umpire Appointments for Asia Cup 2018", International Cricket Council, retrieved 21 September 2018
- ↑ "Asia Cup 2018 Revealed: Asia Cup Schedule". International Cricket Council. Retrieved 24 July 2018.
- ↑ "Akila, Chandimal absence gives slight edge to Bangladesh". ESPN Cricinfo. Retrieved 15 September 2018.
- ↑ "Afghanistan knock Sri Lanka out of the Asia Cup". International Cricket Council. Retrieved 17 September 2018.
- ↑ "Rahmat, spinners knock Sri Lanka out of Asia Cup". ESPN Cricinfo. Retrieved 17 September 2018.
- ↑ "Hong Kong give India a scare, but Dhawan century proves just enough". International Cricket Council. Retrieved 18 September 2018.
- ↑ "Bangladesh edge out Afghanistan in last-ball thriller". International Cricket Council. Retrieved 24 September 2018.
- ↑ "Mustafizur defends seven in last over to knock out Afghanistan". ESPN Cricinfo. Retrieved 24 September 2018.
- ↑ "Bangladesh stun Pakistan to reach Asia Cup final and set up showdown with India". The National. Retrieved 26 September 2018.
- ↑ "Asia Cup 2018: MS Dhoni creates history, leads India for 200th time". Hindustan Times. Retrieved 25 September 2018.
- ↑ 44.0 44.1 "Asia Cup 2018: Super-4s, Match 5, India vs Afghanistan – Statistical Highlights". Crictracker. Retrieved 26 September 2018.
- ↑ "Asia Cup 2018 final: Liton Das slams maiden ODI hundred". The Indian Express. Retrieved 28 September 2018.
- ↑ "Asia Cup 2018 — Most Runs — Records". ESPNcricinfo. ESPN. Retrieved 8 September 2022.
- ↑ "Asia Cup 2022 — Most Wickets — Records". ESPNcricinfo. ESPN. Retrieved 8 September 2022.