2018 (2023 సినిమా)
2018 (2018: Everyone is a Hero) అనే చిత్రం 2018లో సంభవించిన కేరళ వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మలయాళ భాషా చిత్రం. అఖిల్ పి. ధర్మజన్‌తో స్క్రీన్‌ప్లే అందించగా, జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాస్, లాల్, నరైన్ వంటి వారు తారాగణం.
2018 | |
---|---|
దర్శకత్వం | జూడ్ ఆంథనీ జోసెఫ్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అఖిల్ జార్జ్ |
కూర్పు | చమన్ చకో |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | కావ్య ఫిల్మ్ కంపెనీ |
విడుదల తేదీ | 5 మే 2023 |
సినిమా నిడివి | 154 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | మలయాళం |
బాక్సాఫీసు | ₹160 crore[1] |
2023 మే 5న విడుదలైన ఈ చిత్రం కేవలం 11 రోజులలో 100 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా 2018 నిలిచింది.
ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో నిర్మాత బన్నీ వాసు సారధ్యంలో 2023 మే 26 విడుదల అయింది.[2]
2023 సెప్టెంబరు 27న, ఈ చిత్రం 96వ అకాడమీ అవార్డులకు భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.[3]
తారాగణం
మార్చు- అనూప్, మాజీ ఆర్మీ అధికారిగా టోవినో థామస్
- హోం సెక్రటరీ షాజీ పున్నూస్‌గా కుంచాకో బోబన్
- నిక్సన్‌గా ఆసిఫ్ అలీ, మాథచ్చన్ చిన్న కొడుకు
- రమేశ్‌గా వినీత్ శ్రీనివాసన్
- మాతచ్చన్‌గా లాల్
- విన్‌స్టన్‌గా నరైన్, మాథాచన్ పెద్ద కొడుకు
- వర్గీస్‌గా సుధీష్
- టాక్సీ డ్రైవర్ కోశిగా అజు వర్గీస్
- సేతుపతిగా కలైయరసన్
- అలెక్స్, అనూప్ స్నేహితుడు, చాందీ కొడుకుగా హరికృష్ణన్
- నూరాగా అపర్ణ బాలమురళి, టీ.వి. రిపోర్టర్
- మంజుగా తన్వి రామ్, అనూప్ లవ్ ఇంట్రెస్ట్
- షాజీ భార్య సెరీనాగా శివదా
- రమేశ్ భార్య అనుపమగా గౌతమి నాయర్
- నూరా తండ్రిగా సిద్ధిక్
- అను తండ్రిగా రెంజీ పనికర్
- ముఖ్యమంత్రిగా జనార్దనన్
- భాసిగా ఇంద్రన్స్
- అరవిందన్, మంజు తండ్రిగా జాఫర్ ఇడుక్కి
- షాజీ కూతురుగా దేవానంద
- వృద్ధి విశాల్
- గర్భిణియమ్మాయిగా 'వినీత కోషి
- జీజీగా గిలు జోసెఫ్
- చాందీగా జాయ్ మాథ్యూ
- అనూప్ స్నేహితుడిగా శ్రీజిత్ రవి
- అనూప్ తండ్రిగా జి. సురేష్ కుమార్
- జిల్లా కలెక్టర్‌గా జయకృష్ణ
- సబ్ కలెక్టర్‌గా కృష్ణ
- రవిగా జయకుమార్
- జోసెఫ్ గా ఎస్.పి.శ్రీకుమార్
- క్లీటస్, జోసెఫ్ సోదరుడిగా రోనీ డేవిడ్
- డ్యామ్ ఆపరేటర్ కరుణన్ పాత్రలో కళాభవన్ హనీఫ్
- పోలీస్ కానిస్టేబుల్‌గా పౌలీ వల్సన్
- నహాస్‌గా షెబిన్ బెన్సన్
- రమేశ్ తల్లిగా శోభా మోహన్
- అనూప్ తల్లిగా శ్రీజ రవి
- పోలీస్ ఆఫీసర్ గా బోబన్ శామ్యూల్
- విలేజర్ గా శాంతకుమారి
- ఉండప్పిగా ప్రణవ్ బిను
నిర్మాణం
మార్చుఈ చిత్రం అధికారికంగా సెప్టెంబర్ 2018లో 2403 ఫీట్: ది స్టోరీ ఆఫ్ అన్ ఎక్స్‌పెక్టెడ్ హీరోస్ అనే టైటిల్‌తో అధికారికంగా ప్రకటించబడింది, అది తర్వాత ప్రస్తుత టైటిల్‌కి మార్చబడింది.[4]
చిత్రీకరణ
మార్చుప్రధాన ఫోటోగ్రఫీ 2022 మే 27న ప్రారంభమైంది. కేరళ రాష్ట్రంలో త్రిసూర్, ఎర్నాకులం, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలోని లొకేషన్‌లలో సినిమా చిత్రీకరణ జరిగింది. వైకోమ్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో వేసిన సెట్‌లో భారీ షూటింగ్ జరిగింది. తమిళనాడులోని తిరునెల్వేలి, తెలంగాణలోని హైదరాబాద్ లలోనూ ముఖ్యమైన సన్నివేశాలు తీసారు. 2022 నవంబరు 12 నాటికి చిత్రీకరణ పూర్తయింది.[5] అయితే వరద సన్నివేశాలను పూర్తిగా ప్రాక్టికల్ ఎఫెక్ట్‌లతో చిత్రీకరించారు.
మూలాలు
మార్చు- ↑ "2018: Naga Chaitanya and Anand Deverakonda heap praise on Tovino Thomas film". The Indian Express. Retrieved 2023-05-25.
- ↑ "2018 Telugu Movie Review And Rating - Sakshi". web.archive.org. 2023-05-26. Archived from the original on 2023-05-26. Retrieved 2023-05-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Malayalam Film 2018 Is India's Official Oscar Entry". NDTV. Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ "'2018': Tovino Thomas, Kunchacko Boban, Asif Ali, and more star in film on 2018 Kerala floods". The Hindu. 3 November 2022.
- ↑ "It's a wrap for Tovino Thomas, Asif Ali, and Kunchacko Boban's '2018' based on the Kerala floods". The Times of India. 16 November 2022. Retrieved 16 March 2023.
The filming of Jude Anthany Joseph's upcoming film '2018 – Everyone is a hero' has been completed. The makers wrapped up the shoot on Sunday (Nov 13).