బన్నీ వాసు (జననం 1981 జూన్ 11)[1]తెలుగు సినిమా నిర్మాత. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా (2021) సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. [2]

బన్నీ వాసు
జననం (1981-06-11) 1981 జూన్ 11 (age 43)
వృత్తిసినిమా నిర్మాత,
ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్

జీవిత విశేషాలు

మార్చు

ఆయన గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకొని వెళ్ళే వ్యక్తులలో ఒకరు. ఆయన అల్లు అర్జున్కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. ఆయన ఎం.ఐ.టి (మాస్టర్ ఇన్ ఐ.టి) కోర్సు నుండి తప్పుకొని పెంటా సాఫ్ట్ వద్ద 3D ఆనిమేషన్ నేర్చుకున్నారు. జానీ చిత్రం యొక్క లోగో ఏనిమేషన్ కొరకు అల్లూ బాబీ (అల్లు అర్జున్ యొక్క అన్నయ్య) వద్ద చేరారు. ఆయన బన్నీ వాస్ పనిని యిష్టపడ్డాడు. బన్నీ వాసు పాలకొల్లు వాసి. ఆయన గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు. ఆయన వంశీ (యు.వి.క్రియేషన్స్) తో కలసి 57 చిత్రాలను గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాఅల్లో పంపిణీ చేసారు. వాటిలో మంచి సినిమాలైన పోకిరి, ఆర్య, మగధీర మొదలైనవి ఉన్నాయి. చివరిగా గబ్బర్‌సింగ్ చిత్రాన్ని పంపిణీ చేసారు. ఆయన బన్నీ అన్ని చిత్రాల నిర్మాణంలో, సృజనాత్మక అంశాలలోనూ పాల్గొన్నారు. [3]

రాజకీయాలు

మార్చు

బన్నీ వాసు నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి జనసేన ప్రచార విభాగం ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4]

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Film Notes
2011 100% లవ్ నిర్మాత
2014 కొత్త జంట నిర్మాత
2014 పిల్లా నువ్వు లేని జీవితం నిర్మాత
2015 భలే భలే మొగాడివోయ్ నిర్మాత
2016 సరైనోడు సహా నిర్మాత
2017 నెక్స్ట్ నువ్వే నిర్మాత
2018 నా పేరు సూర్య Co-నిర్మాత
2018 గీత గోవిందం నిర్మాత
2019 ప్రతి రోజు పండగే నిర్మాత
2021 చావు కబురు చల్లగా నిర్మాత
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిర్మాత
2022 పక్కా కమర్షియల్ నిర్మాత
2022 18 పేజెస్ నిర్మాత
2023 వినరో భాగ్యము విష్ణు కథ నిర్మాత
కోట బొమ్మాళి పీ.ఎస్ నిర్మాత
2024 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నిర్మాత
ఆయ్ నిర్మాత
2025 తండేల్ నిర్మాత

మూలాలు

మార్చు
  1. "2002లో ఇండస్ట్రీకి, ఈ పదేళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి: బన్నీ వాసు". 10 June 2022. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
  2. Bunny Vasu Biography, Profile, Date of Birth(DOB), Star Sign, Height, Siblings[permanent dead link]
  3. Interview with Bunny Vasu about Bhale Bhale Magadivoi
  4. "బన్నీవాస్‌కు పవన్‌ కల్యాణ్‌ కీలక బాధ్యతలు." NTV Telugu. 15 December 2023. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.

ఇతర లింకులు

మార్చు