4 లెటర్స్

2019లో విడుదలైన తెలుగు సినిమా

4లెటర్స్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై దొమ్మరాజు హేమలత, ఉదయ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్‌.ర‌ఘురాజ్ దర్శకత్వం వహించాడు. ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 15న విడుదల చేశారు.

4లెటర్స్
దర్శకత్వంఆర్‌.ర‌ఘురాజ్
రచనఆర్‌.ర‌ఘురాజ్
నిర్మాతదొమ్మరాజు హేమలత, ఉదయ కుమార్
తారాగణంఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్
విడుదల తేదీ
15 ఫిబ్రవరి 2019 (2019-02-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

వర్మ (సురేష్) వ్యాపారవేత్త కుమారుడు తన కుమారుడికి అజయ్ (ఈశ్వర్) బిజినెస్ ఆలోచనలు ఉన్న భార్య రావాలని వర్మ కోరుకొంటాడు. ఆ క్రమంలో మధ్య తరగతి యువతి అంజలి (టుయా చక్రవర్తి)తో అజయ్ ప్రేమలో పడుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల అంజలి తల్లి వారి ప్రేమను వ్యతిరేకించడంతో అజయ్‌కి అంజలి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత అనుపమ (అంకిత మహారాణా)తో అజయ్ ప్రేమలో పడుతాడు. ఇంతకీ అజయ్‌కి అంజలి బ్రేకప్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ? అజయ్‌తో ప్రేమను అంజలి తల్లి ఎందుకు వ్యతిరేకించింది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఓం శ్రీ చక్ర క్రియేషన్స్
  • నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్
  • క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్[2]
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో[3]
  • సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు కె
  • ఆర్ట్‌: వ‌ర్మ‌
  • కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌
  • పాట‌లు: సురేశ్ ఉపాధ్యాయ‌

మూలాలు

మార్చు
  1. The Times of India (19 February 2019). "Anketa Maharana talks about her role in '4 Letters'" (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. Sakshi (27 February 2019). "ఆలోచింపజేస్తోంది". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  3. The Times of India (2 February 2019). "Music Review: 4 Letters" (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=4_లెటర్స్&oldid=3572600" నుండి వెలికితీశారు