కాపీహక్కు

(Copyright నుండి దారిమార్పు చెందింది)

కాపీహక్కు అనేది ఒక రకమైన మేధో సంపత్తి. దీని ద్వారా హక్కుదారుకి, తాను చేసిన సృజనాత్మక పనిని ఇతరులు కాపీ చేయడానికి, పంపిణీ చేయడానికి, స్వీకరించడానికి, ప్రదర్శించడానికి, నిర్వహించడానికీ పరిమిత కాలం పాటు ప్రత్యేక హక్కు కలుగుతుంది.[1] [2][3][4] సృజనాత్మక పని సాహిత్య, కళాత్మక, విద్య లేదా సంగీత రూపాల్లో ఉండవచ్చు. కాపీహక్కు అనేది సృజనాత్మక పని రూపంలో వ్యక్తి తన ఆలోచనకు చేసిన ఒరిజినల్ వ్యక్తీకరణను రక్షించడానికి ఉద్దేశించబడినదే గానీ, ఆలోచనను రక్షించేందుకు కాదు.[5][6][7] యునైటెడ్ స్టేట్స్‌లో కాపీహక్కు, సముచిత వినియోగ సిద్ధాంతం వంటి ప్రజా ప్రయోజన పరిమితులకు లోబడి ఉంటుంది.

కొన్ని న్యాయాధికార పరిధుల్లో కాపీహక్కు ఉన్న కృతులను ప్రత్యక్ష రూపంలో "పరిష్కరించాల్సిన" అవసరం ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ కర్తలున్నపుడు వారంతా వివిధహక్కులను పంచుకుంటారు. ఆ హక్కులను అనుసరించి వారికి ఆ పనిని వినియోగించడం లేదా లైసెన్సు ఇవ్వడం వంటివి చేస్తారు. వీరిని హక్కు దారులు అంటారు.[8] [9] ఈ హక్కులలో పునరుత్పత్తి, ఉత్పన్న పనులపై నియంత్రణ, పంపిణీ, బహిరంగ ప్రదర్శనలతో పాటు ఆపాదింపు వంటి నైతిక హక్కులు ఉంటాయి.[10]

ప్రజా చట్టం ద్వారా కాపీహక్కు‌లను మంజూరు చేయవచ్చు. ఆ సందర్భంలో వీటిని "ప్రాదేశిక హక్కులు" అని పరిగణిస్తారు. దీనర్థం నిర్దుష్ట దేశపు చట్టం ద్వారా మంజూరైన కాపీహక్కు‌లు ఆ దేశపు అధికార పరిధికి మించి విస్తరించవు. ఈ రకమైన కాపీహక్కు‌లు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి; అనేక దేశాలు, కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో దేశాలు, తమతమ దేశాల మధ్య హక్కుల స్థితి అస్థిరంగా ఉన్నప్పుడు, వర్తించే విధానాలపై ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి.[11]

సాధారణంగా అధికార పరిధిని బట్టి, సృష్టికర్త మరణించిన తర్వాత 50 నుండి 100 సంవత్సరాల వరకు కాపీహక్కు వ్యవధి ముగుస్తుంది. కొన్ని దేశాల్లో కాపీహక్కు‌ను స్థాపించడానికి కొన్ని కాపీహక్కు లాంఛనాలను పూర్తి చెయ్యాల్సిన అవసరం ఉంటుంది.[4] మరికొన్ని దేశాల్లో అధికారిక నమోదు చేయాల్సిన అవసరమేమీ లేకుండానే పూర్తయిన పనిలో కాపీహక్కు‌ను గుర్తిస్తారు. కాపీహక్కు గడువు ముగిసినప్పుడు, అది ప్రజోపయోగ పరిధి లోకి ప్రవేశిస్తుంది.

అంతర్జాతీయ కాపీహక్కు ఒప్పందాలు

మార్చు

1886 లో జరిగిన బెర్న్ ఒప్పందం మొదట సార్వభౌమ దేశాల మధ్య కాపీహక్కు‌ల గుర్తింపును ఏర్పాటు చేసింది. బెర్న్ కన్వెన్షన్ ప్రకారం, సృజనాత్మక రచనల కోసం కాపీహక్కు‌లను నొక్కిచెప్పాల్సిన అవసరం లేదు లేదా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయా కృతులను సృష్టించేటపుడే ఆటోమాటిగ్గా అవి అమలు లోకి వస్తాయి: బెర్న్ కన్వెన్షన్‌కు కట్టుబడి ఉన్న దేశాల్లో కాపీహక్కు‌ను పొందాలంటే కర్తలకు "నమోదు" లేదా "దరఖాస్తు" చేసుకోవాల్సిన అవసరం లేదు.[12] ఒక పని ఏదైనా భౌతిక మాధ్యమంలో రాయడమో, రికార్డ్ చేయడమో జరిగిన వెనువెంటనే, ఆ పనిలోని అన్ని కాపీహక్కు‌లకు, దానినుండి ఉత్పన్నమయ్యే కృతులకూ దాని కర్త ఆటోమాటిగ్గా అర్హులు అవుతారు. కర్త వాటిని స్పష్టంగా తిరస్కరించే వరకు లేదా కాపీహక్కు గడువు ముగిసేవరకూ ఇది అమల్లో ఉంటుంది. బెర్న్ ఒప్పందం ఫలితంగా విదేశీ రచయితలు కన్వెన్షన్‌పై సంతకం చేసిన ఏ దేశంలోనైనా స్థానిక దేశీయ రచయితలతో సమానంగా పరిగణించబడతారు. ప్రత్యేకంగా, విద్య, శాస్త్రీయ పరిశోధన ప్రయోజనాలకు సంబంధించి, అభివృద్ధి చెందుతున్న దేశాలు బెర్న్ ఒప్పందం సూచించిన పరిమితుల్లో కాపీహక్కు చేయబడిన కృతుల అనువాదానికి లేదా పునరుత్పత్తికీ తప్పనిసరిగా లైసెన్సులు జారీ చెయ్యాలని నిబంధన విధిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల బలమైన డిమాండ్ల కారణంగా 1971 లో చేసిన ఒప్పందపు పునర్విమర్శలో ప్రత్యేక నిబంధనగా దీన్ని చేర్చారు. యు.కె. 1887 లోనే బెర్న్ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, ఆ తరువాత 100 సంవత్సరాల వరకు దానిలో ఎక్కువ భాగాన్ని అమలు చేయలేదు. అమెరికా, 1989 వరకు బెర్న్ కన్వెన్షన్‌పై సంతకం చేయలేదు [13]

అమెరికా, అనేక లాటిన్ అమెరికన్ దేశాలు కలిసి 1910లో బ్యూనస్ ఎయిర్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం, కృతిపై కాపీహక్కు నోటీసు అవసరం (అన్ని హక్కులు రిజర్వ్ చేయబడినవి వంటివి). కాపీహక్కు‌ల వ్యవధిని కుదించడానికీ, కొత్త నిబంధనలు విధించి వాటికే పరిమితం చేయడానికీ ఈ ఒప్పందంలో వీలుంది. [14] [15] [16] బెర్న్ కన్వెన్షన్‌ కంటే తక్కువ కట్టుదిట్టంగా ఉండే ప్రత్యామ్నాయంగా యూనివర్సల్ కాపీహక్కు ఒప్పందాన్ని 1952లో రూపొందించారు. సోవియట్ యూనియన్ తో పాటు, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని ఆమోదించాయి.

బెర్న్ ఒప్పందపు నిబంధనలను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను వారి TRIPS ఒప్పందం (1995)లో చేర్చారు. తద్వారా బెర్న్ ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా వర్తించినట్లైంది. [17]

బెర్న్ ఒప్పందం, యూనివర్సల్ కాపీహక్కు ఒప్పందం వంటి ఈ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా కాపీహక్కు చట్టాలు కొంతవరకు ప్రామాణీకరించబడ్డాయి. ఈ బహుపాక్షిక ఒప్పందాలను దాదాపు అన్ని దేశాలు ఆమోదించాయి. యూరోపియన్ యూనియన్ లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల సభ్య దేశాలు వాటిని పాటించడం తప్పనిసరి.

రక్షణ పొందడం

మార్చు

స్వామిత్వం

మార్చు

కృతి "కిరాయికి పని" అయినట్లైతే, కర్తకు బదులుగా కర్త యొక్క యజమాని ఒరిజినల్ కాపీహక్కు దారు కావచ్చు. [18] [19] ఉదాహరణకు, ఇంగ్లాండులో కాపీహక్కు, డిజైన్‌లు, పేటెంట్ల చట్టం 1988 ప్రకారం, ఒక సంస్థ లోని ఉద్యోగి కాపీహక్కు చేయబడిన కృషి చేస్తే, ఆ కృతికి కాపీహక్కు ఆటోమేటిక్‌గా యజమానికి చెందుతుంది. అది "వర్క్ ఫర్ హైర్" అవుతుంది. సాధారణంగా, కాపీహక్కు మొదటి యజమాని పనిని సృష్టించిన వ్యక్తి అంటే కర్త. [20] కానీ ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిని సృష్టించినప్పుడు, కొన్ని నియమాలకు లోబడి ఉన్నట్లయితే ఉమ్మడి కర్తృత్వాన్ని పొందవచ్చు.

అర్హత కలిగిన పనులు

మార్చు

సృజనాత్మక, మేధోపరమైన, కళాత్మక రూపాలు లేదా "కృతుల"కు కాపీహక్కు వర్తించవచ్చు. అధికార పరిధిని బట్టి వివరాలు మారుతూ ఉన్నప్పటికీ, వీటిలో పద్యాలు, సిద్ధాంతాలు, కాల్పనిక పాత్రలు, నాటకాలు, ఇతర సాహిత్య రచనలు, చలన చిత్రాలు, కొరియోగ్రఫీ, సంగీత కంపోజిషన్‌లు, సౌండ్ రికార్డింగ్‌లు, పెయింటింగ్‌లు, డ్రాయింగ్‌లు, శిల్పాలు, ఛాయాచిత్రాలు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, రేడియో, టెలివిజన్ ప్రసారాలు, పారిశ్రామిక నమూనాలు ఉంటాయి. గ్రాఫిక్ డిజైన్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్‌లకు సంబంధించి కొన్ని అధికార పరిధుల్లో ప్రత్యేకమైన లేదా అతివ్యాప్తి చెందే చట్టాలు ఉండవచ్చు. [21] [22]

కాపీహక్కు ఆలోచనల పైన, సమాచారం పైనా ఉండదు. వాటిని వ్యక్తీకరించిన రూపం లేదా పద్ధతుల పైన మాత్రమే ఉంటుంది. [23] ఉదాహరణకు, మిక్కీ మౌస్ కార్టూన్ కాపీహక్కు, ఇతరులు ఆ కార్టూనుకు కాపీలు చేయకుండాను, డిస్నీ రూపొందించిన విధంగా మానవుని లాగా హావభావాలు ప్రదర్శించే (ఆంత్రోపోమోర్ఫిక్) ఎలుక రూపం ఆధారంగా కొత్త ఉత్పత్తులను రూపొందించకుండానూ నియంత్రిస్తుంది. అయితే డిస్నీ వారి ఎలుక రూపానికి భిన్నంగా, ఇతర ఆంత్రోపోమోర్ఫిక్ రూపంలో ఉండే ఎలుకల గురించి వేరే కృతులను రూపొందించడాన్ని ఇది నిషేధించదు. [23] గమనించాల్సిన సంగతి ఏంటంటే, పాత్రలకు కాపీహక్కు ఉండదు కాబట్టి, మిక్కీ మౌస్‌కు కాపీహక్కు లేదు; స్టీమ్‌బోట్ విల్లీకి కాపీహక్కు ఉంది. కాపీహక్కు ఉన్న ఆ పనిలో ఒక పాత్రగా ఉన్న మిక్కీ మౌస్‌కు రక్షణ కల్పించబడింది.

మౌలికత్వం

మార్చు

సాధారణంగా, ఒక పని కాపీహక్కు‌కు అర్హత పొందాలంటే దానికి, మౌలికతకు సంబంధించి కనీస ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. నిర్దుష్ట సమయం తర్వాత కాపీహక్కు గడువు ముగుస్తుంది (కొన్ని అధికార పరిధుల్లో దీనిని పొడిగించడానికి అనుమతించవచ్చు). దీనికి సంబంధించి సాధారణంగా ఆవశ్యకతలు తక్కువగానే ఉన్నప్పటికీ, వివిధ దేశాలు వేర్వేరు పరీక్షలను విధిస్తాయి; యునైటెడ్ కింగ్‌డమ్‌లోనైతే, ఈ కృతిలోకి కొంత "నైపుణ్యం, శ్రమ, విచక్షణ" చేరి ఉండాలి. [24] ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో కాపీహక్కు కలిగి ఉండటానికి ఒక్క పదం సరిపోదని నిర్ధారించారు. అయితే, ఒకే పదం లేదా కొద్దిపాటి పదాలు కలిగిన చిన్న పదబంధాన్ని ట్రేడ్‌మార్క్‌గా నమోదు చేస్తారు.

కాపీహక్కు చట్టం, ఓ కృతి ప్రత్యేకమైనదా కాదా అనేదానిపై ఆధారపడి కాకుండా అది మౌలికమైన (ఒరిజినల్) సృజనా కాదా అనే దాని ఆధారంగా ఒక కర్త హక్కును గుర్తిస్తుంది; యాదృచ్చికంగా ఒకేలా ఉన్నాయనీ, ఒకదాని నుండి మరొకటి కాపీ చేయలేదని నిర్ధారించబడినట్లయితే, ఇద్దరు రచయితలు ఒకేలా ఉన్న రెండు కృతులపై కాపీహక్కు పొందవచ్చు.

నమోదు

మార్చు

బెర్న్ ఒప్పందం వర్తించే అన్ని దేశాలలో, కాపీహక్కు ఆటోమాటిగ్గా వర్తిస్తుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలో అధికారిక నమోదు ద్వారా పొందవలసిన అవసరం లేదు. ఒక ఆలోచనను ప్రత్యక్ష రూపంలోకి సృజించిన వెంటనే (ఉదాహరణకు డ్రాయింగ్, షీట్ మ్యూజిక్, ఫోటోగ్రాఫ్, వీడియో టేప్ లేదా కంప్యూటర్ ఫైల్ వంటివి), కాపీహక్కుదారు తన ప్రత్యేకత హక్కులను అమలు చేయడానికి అర్హులౌతారు. [12] అయితే, కాపీహక్కు‌ను అమలు చేయడానికి నమోదు అవసరం లేనప్పటికీ, నమోదు అవసరమైన చోట్ల, ఇది కాపీహక్కు‌కు ప్రాథమిక సాక్ష్యంగా పనిచేస్తుంది. కాపీహక్కుదారు చట్టబద్ధమైన నష్టపరిహారాన్ని, న్యాయవాది రుసుములనూ కోరే వీలు కలిగిస్తుంది. [25] (అమెరికాలో, ఉల్లంఘన జరిగిన తర్వాత నమోదు చేస్తే వాస్తవంగా జరిగిన నష్టం, నష్టపోయిన లాభాలను పొందేందుకు మాత్రమే వీలు కలుగుతుంది. )

కాపీహక్కు నోటీసు

మార్చు
 
కాపీహక్కు నోటీసులో ఉపయోగించే కాపీహక్కు చిహ్నం

మంజూరు చేయదగ్గ హక్కులు

మార్చు

వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రకారం, కాపీహక్కు రెండు రకాల హక్కులను రక్షిస్తుంది. ఆర్థిక హక్కులు హక్కు యజమానులు తమ రచనలను ఇతరులు ఉపయోగించడం ద్వారా ఆర్థిక ప్రతిఫలాన్ని పొందేందుకు అనుమతిస్తాయి. నైతిక హక్కులు - రచయితలు, సృష్టికర్తలు తమ కృతితో తమకున్న లింకును సంరక్షించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలు కలిగిస్తాయి. కర్త ఆర్థిక హక్కులకు తానే యజమాని కావచ్చు లేదా ఆ హక్కులను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మందికి బదిలీ చేయవచ్చు. చాలా దేశాలు నైతిక హక్కుల బదిలీని అనుమతించవు. [26]

ఆర్థిక హక్కులు

మార్చు

ఏ రకమైన ఆస్తి విషయంలో నైనా, దానిని ఎలా ఉపయోగించాలో యజమాని నిర్ణయించుకోవచ్చు. ఇతరులు దాన్ని వాడాలంటే యజమాని అనుమతి ఇస్తేనే (లైసెన్స్ ద్వారా) దానిని చట్టబద్ధంగా ఉపయోగించగలరు. అయితే, యజమాని ఆ ఆస్తిని వాడే సందర్భంలో సమాజంలోని ఇతర సభ్యుల హక్కులు, ప్రయోజనాలను తప్పనిసరిగా గౌరవించాలి. కాబట్టి కాపీహక్కుకు లోబడి ఉన్న కృతిని ఎలా ఉపయోగించాలో యజమాని నిర్ణయించుకోవచ్చు. తన అనుమతి లేకుండా ఉపయోగించకుండా ఇతరులను నిరోధించవచ్చు. చట్టబద్ధంగా గుర్తించబడిన హక్కులు, ప్రయోజనాలకు లోబడి, తమ రచనలను ఇతరులు ఉపయోగించడాన్ని అనుమతించడానికి కాపీహక్కు యజమానులకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. [26] చాలా కాపీహక్కు చట్టాలు ఒక పనికి సంబంధించి నిర్దిష్ట చర్యలను అనుమతించే లేదా నిరోధించే హక్కులు కర్తలకు లేదా ఇతర హక్కుల యజమానులకు ఉంటాయని పేర్కొంటున్నాయి. హక్కు యజమానుల కింది వాటిని అనుమతించవచ్చు లేదా నిషేధించవచ్చు:

  • ముద్రిత ప్రచురణలు లేదా సౌండ్ రికార్డింగ్‌లు వంటి వివిధ రూపాల్లో పనిని పునరుత్పత్తి చేయడం;
  • కృతి కాపీల పంపిణీ;
  • కృతిని బహిరంగంగా ప్రదర్శించడం;
  • కృతిని ప్రసారం చెయ్యడం లేదా ఇతర సమాచారాన్ని ఇవ్వడం;
  • ఇతర భాషలలోకి కృతిని అనువదించడం;
  • నవలను స్క్రీన్‌ప్లేగా మార్చడం వంటి అనుసరణలు చెయ్యడం.

నైతిక హక్కులు

మార్చు

నైతిక హక్కులు ఆర్థికేతర హక్కులకు సంబంధించినవి. అవి కృతో కర్త యొక్క అనుబంధాన్నీ, కృతి సమగ్రతనూ కాపాడతాయి. నైతిక హక్కులు వ్యక్తిగత రచయితలకు మాత్రమే ఇస్తారు. అనేక దేశాల చట్టాలలో కర్తలు తమ ఆర్థిక హక్కులను బదిలీ చేసినప్పటికీ నైతిక హక్కులు మాత్రం కర్తల వద్దనే ఉంటారు. ఫ్రాన్స్ వంటి కొన్ని EU దేశాలలో నైతిక హక్కులు నిరవధికంగా ఉంటాయి. అయితే UKలో నైతిక హక్కులకు కాలపరిమితి ఉంటుంది. అంటే, కృతి కాపీహక్కు‌లకు లోబడి ఉన్నంత వరకు మాత్రమే ఆపాదించే హక్కు, సమగ్రత హక్కులు ఉంటాయి. కాపీహక్కు గడువు ముగిసినప్పుడే, నైతిక హక్కులు కూడా ముగుస్తాయి. యు.కె. లోని నైతిక హక్కుల విధానం తరచుగా మిగతా ఐరోపా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న నైతిక హక్కుల రక్షణ కంటే బలహీనంగా లేదా నాసిగా ఉంటాయని పరిగణించటానికి ఇది ఒక కారణం. [27] బెర్న్ ఒప్పందం, ఆర్టికల్ 6bis ప్రకారం దాని సభ్యులు రచయితలకు ఈ క్రింది హక్కులను మంజూరు చేయవలసి ఉంటుంది:

  1. ఒక కృతికి కర్తృత్వాన్ని క్లెయిమ్ చేసే హక్కు (కొన్నిసార్లు పితృత్వ హక్కు లేదా ఆపాదించే హక్కు అని పిలుస్తారు);
  2. ఒక కృతిని వక్రీకరించడం లేదా సవరించడం లేదా ఇతర అవమానకరమైన చర్యలు చెయ్యడానికి అభ్యంతరం చెప్పే హక్కు. ఇది కర్త గౌరవానికి లేదా ప్రతిష్టకూ భంగం కలిగిస్తుంది (కొన్నిసార్లు సమగ్రత హక్కు అని పిలుస్తారు).

ఇవి,ఇ జాతీయ చట్టాలలో మంజూరు చేయబడిన ఇతర సారూప్య హక్కులనూ కలిపి సాధారణంగా రచయితల నైతిక హక్కులు అంటారు. బెర్న్ ఒప్పందం ప్రకారం, ఈ హక్కులు రచయితల ఆర్థిక హక్కుల నుండి స్వతంత్రంగా ఉండాలి. నైతిక హక్కులు వ్యక్తిగతంగా రచయితలకు మాత్రమే చెందుతాయి. అనేక జాతీయ చట్టాలలో రచయితలు వారి ఆర్థిక హక్కులను బదిలీ చేసిన తర్వాత కూడా నైతిక హక్కులు రచయితల తోనే ఉంటాయి. దీనర్థం ఏమిటంటే, ఉదాహరణకు, ఒక సినిమా నిర్మాత లేదా ప్రచురణకర్త ఒక కృతిలో ఆర్థిక హక్కులను కలిగి ఉన్నప్పటికీ, అనేక అధికార పరిదుల్లో నైతిక హక్కులు మాత్రం వ్యక్తిగత రచయితకే ఉంటాయి. [26] ఇటీవల, యునైటెడ్ స్టేట్స్‌లోని కాపీహక్కు చట్టం యొక్క ఫ్రేమ్‌వర్క్‌లో నైతిక హక్కులను కూడా చేర్చే ప్రశ్నపై US కాపీహక్కు కార్యాలయంలో జరిగిన చర్చలలో భాగంగా, కాపీహక్కు కార్యాలయం ప్రస్తుత నైతిక హక్కులకు చెందిన అనేక విభిన్న అంశాలు ప్రస్తుతం బాగానే పని చేస్తున్నాయనీ, వాటిని మార్చాల్సిన అవసరం లేదనీ నిర్ధారించింది. ఇంకా, ఈ సమయంలో నైతిక హక్కుల చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం లేదని కూడా కార్యాలయం నిర్ధారించింది. అయితే, US నైతిక హక్కుల ప్యాచ్‌వర్క్‌లో వ్యక్తిగత రచయితల కోసం, మొత్తం కాపీహక్కు వ్యవస్థ ప్రయోజనం కోసం మెరుగుపరచవలసిన అంశాలు ఉన్నాయి. [28]

TRIPS లో ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ కాపీహక్కు చట్టం సమానంగా ఉంటుంది. భారత కాపీహక్కు చట్టం 1957 కు 1999, 2002, 2012లో చేసిన సవరణల ప్రకారం, భారతదేశం ఒక పార్టీగా ఉన్న బెర్న్ ఒప్పందం, యూనివర్సల్ కాపీహక్కుల ఒప్పందాలను పూర్తిగా అనుసరిస్తుంది. ఫోనోగ్రామ్‌ల నిర్మాతల హక్కుల పరిరక్షణ కోసం కుదిరిన జెనీవా ఒప్పందంలో భారతదేశం కూడా ఒక భాగస్వామి. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO), యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO)లో క్రియాశీల సభ్యురాలు. భారతీయ వ్యవస్థ 1957 నాటి భారతీయ కాపీహక్కు చట్టంలోని వివిధ నిబంధనల ద్వారా [29] ఆర్థిక, నైతిక హక్కులు రెండింటినీ అందిస్తుంది.

పరిమితులు, మినహాయింపులు

మార్చు

అనేక అధికార పరిధుల్లో, వ్యాఖ్యానం లేదా ఇతర సంబంధిత ఉపయోగాల కోసం కృతిని కాపీ చేసినప్పుడు కాపీహక్కు చట్టం ఈ పరిమితులకు మినహాయింపులను ఇస్తుంది. అమెరికాలో పేర్లు, శీర్షికలు, చిన్న పదబంధాలు లేదా జాబితాలను (పదార్థాలు, వంటకాలు, లేబుల్‌లు లేదా సూత్రాలు వంటివి) కాపీహక్కు చట్టం పరిధి లోకి రావు. [30] అయితే, కాపీహక్కుకు లోబడని వాటికి ట్రేడ్‌మార్క్‌లు, పేటెంట్‌ల వంటి రక్షణలు అందుబాటులో ఉన్నాయి.

ఆలోచన-వ్యక్తీకరణ వైరుద్ధ్యం, విలీన సిద్ధాంతం

మార్చు

ఆలోచన-వ్యక్తీకరణ విభజన ఆలోచనలు వ్యక్తీకరణల మధ్య భేదాన్ని చూస్తుంది. కాపీహక్కు ఆలోచనల యొక్క ఒరిజినల్ వ్యక్తీకరణను మాత్రమే రక్షిస్తుంది తప్ప, ఆలోచనలను కాదని ఇది పేర్కొంటుంది. ఈ సూత్రం అమెరికాలో మొదట 1879 లో బేకర్ v సెల్డెన్ కేసులో స్పష్టం చేయబడింది. 1976 కాపీహక్కు చట్టం లో 17 USC § 102(బి) వద్ద దీన్ని చేర్చారు.

మొదటి-విక్రయ సిద్ధాంతం, హక్కులను కోల్పోవడం

మార్చు

కాపీహక్కులో ఉన్న కృతుల కాపీలను చట్టబద్ధంగా పొందాక, వాటిని తిరిగి విక్రయించకుండా కాపీహక్కు చట్టం ఆ కృతి కాపీ యజమానిని నిరోధించదు. ఆ కాపీలు వాస్తవానికి కాపీహక్కుదారు ద్వారా లేదా అనుమతితో రూపొందించబడ్డాయి. అందువల్ల కాపీహక్కు చేయబడిన పుస్తకం లేదా CD ని తిరిగి విక్రయించడం చట్టబద్ధమే. అమెరికాలో దీనిని ఫస్ట్-సేల్ సిద్ధాంతం అని పిలుస్తారు. సెకండ్ హ్యాండ్ బుక్‌స్టోర్‌లలో పుస్తకాలను తిరిగి అమ్మడం లోని చట్టబద్ధతను స్పష్టం చేయడానికి కోర్టులు దీన్ని స్థాపించాయి.

సముచితమైన ఉపయోగం, న్యాయమైన వ్యవహారం

మార్చు

కాపీహక్కు అన్ని కాపీలు లేదా ప్రతిరూపాలను నిషేధించదు. అమెరికాలో, 1976 కాపీహక్కు చట్టం ద్వారా 17 USC సెక్షన్ 107గా క్రోడీకరించబడిన న్యాయమైన ఉపయోగ సిద్ధాంతం ప్రకారం, కాపీహక్కుదారు అనుమతి లేకుండానే, దానికి చెల్లింపులేమీ చెయ్యకుండానే కొంత భాగాన్ని కాపీ చేయడం, పంపిణీ చెయ్యడానికి వీలుంది. చట్టం సముచిత ఉపయోగాన్ని స్పష్టంగా నిర్వచించడంలేదు గానీ, న్యాయమైన ఉపయోగ విశ్లేషణలో పరిగణించవలసిన నాలుగు అంశాలను ఇస్తుంది. అవి:

  1. ఉపయోగించడంలో ప్రయోజనం, స్వభావం;
  2. కాపీహక్కు చేయబడిన పని స్వభావం;
  3. మొత్తం పనిలో ఎంత మొత్తాన్ని, ఎంత నిష్పత్తినీ తీసుకున్నారు;
  4. కాపీహక్కు చేయబడిన కృతికి ఉన్న సంభావ్య మార్కెట్ లేదా విలువపై ఈ ఉపయోగపు ప్రభావం ఎలా ఉంటుంది. [31]

దృష్టిలోపం ఉన్నవారి కోసం ప్రత్యేక కాపీలు

మార్చు

అంధులు, దృష్టి లోపం ఉన్నవారూ వాడగలిగేలా కాపీహక్కు చేయబడిన కృతిని రూపొందించి (ఉదాహరణకు, పెద్ద ముద్రణలో లేదా బ్రెయిలీలో) ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాల్లో కాపీహక్కు అనుమతి అవసరం లేదు. [32] [33]

బదిలీ, కేటాయింపు, లైసెన్సింగు

మార్చు

కాపీహక్కును గానీ, దానిలోని అంశాలను (ఉదా. పునరుత్పత్తి మాత్రమే, నైతిక హక్కులు తప్ప) గానీ ఒక పక్షం నుండి మరొకరికి కేటాయించవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. [34] ఉదాహరణకు, ఆల్బమ్‌ను రికార్డ్ చేసే సంగీతకారుడు తరచుగా రికార్డ్ కంపెనీతో ఒప్పందంపై సంతకం చేస్తాడు. దీనిలో, రాయల్టీలు, ఇతర పరిహారాలను పొందిఉతున్నందుకు బదులుగా రికార్డింగ్‌లలోని మొత్తం కాపీహక్కు‌లను బదిలీ చేయడానికి సంగీతకారుడు అంగీకరిస్తాడు. ఆవిధంగా కర్త (అసలైన కాపీహక్కుదారుడు) తాను అందుకోలేనంత స్థాయిలో ఉత్పత్తి, మార్కెటింగ్ సామర్థ్యాల ప్రయోజనాలను పొందుతారు. డిజిటల్ సంగీత యుగంలో, సంగీతాన్ని ఇంటర్నెట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో కాపీ చేయవచ్చు, పంపిణీ చేయవచ్చు; అయినప్పటికీ, రికార్డ్ పరిశ్రమ కళాకారుడికి, వారి పనికీ ప్రచారాన్ని, మార్కెటింగునూ అందివ్వడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా కృతి ఎక్కువ మంది శ్రోతలను/ప్రేక్షకులను చేరుకోగలదు. ప్రచురణకర్తలు పట్టుబట్టినప్పటికీ, కాపీహక్కుదారు అన్ని హక్కులను పూర్తిగా బదిలీ చేయవలసిన అవసరం లేదు. కొన్ని హక్కులు బదిలీ చేయవచ్చు లేదా ఒక నిర్దుష్ట ప్రాంతానికి సంబంధించి లేదా నిర్దుష్ట కాలావధికు ఆ కృతిని కాపీ చేయడానికి, పంపిణీ చేయడానికీ మరొక పార్టీకి ప్రత్యేకమైన లైసెన్స్‌ను మంజూరు చేయవచ్చు.

స్వేచ్ఛా లైసెన్సులు

మార్చు

ఓపెన్ లేదా ఫ్రీ లైసెన్సులు అని పిలవబడే కాపీహక్కు లైసెన్సులు లైసెన్సుదారులకు రుసుము చెల్లించి గానీ లేదా ఏమీ చెల్లించకుండా గానీ అనేక హక్కులను మంజూరు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ సందర్భంలో ఫ్రీ అనేది ఎక్కువగా స్వేచ్ఛకు సంబంధించినదే గానీ, ధరకు సంబంధించినది కాదు. ఉచిత లైసెన్సింగ్ అనేది దీర్ఘాయువు క్రమంలో ఉచిత సాఫ్ట్‌వేర్ నిర్వచనం, డెబియన్ ఉచిత సాఫ్ట్‌వేర్ మార్గదర్శకాలు, ఓపెన్ సోర్స్ డెఫినిషన్, ఫ్రీ కల్చరల్ వర్క్స్ నిర్వచనంతో సహా అనేక సారూప్య నిర్వచనాలలో వర్గీకరించబడింది. ఈ నిర్వచనాలకు మరింత మెరుగులు దిద్దడం వల్ల కాపీ లెఫ్ట్, పర్మిసివ్ వంటి వర్గాలు ఏర్పడ్డాయి. ఉచిత లైసెన్స్‌లకు సాధారణ ఉదాహరణలు GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్, BSD లైసెన్స్‌లు, కొన్ని క్రియేటివ్ కామన్స్ లైసెన్స్‌లు .

క్రియేటివ్ కామన్స్ (CC) అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ. దీన్ని 2001లో జేమ్స్ బాయిల్, లారెన్స్ లెస్సిగ్, హాల్ అబెల్సన్‌లు స్థాపించారు. [35] ఇది సృజనాత్మక కృతులను చట్టబద్ధంగా పంచడానికి ఉద్దేశించినది. దీని కోసం సంస్థ, ప్రజలకు అనేక సాధారణ కాపీహక్కు లైసెన్స్ ఎంపికలను - ఉచితంగా - అందిస్తుంది. ఇతరులు పనిని ఉపయోగించే పరిస్థితులను నిర్వచించడానికి, ఏ రకమైన ఉపయోగం ఆమోదయోగ్యమైనదో పేర్కొనడానికి కాపీహక్కు హోల్డర్‌లకు ఈ లైసెన్స్‌లు వీలు కలిగిస్తాయి. [35]

సాంప్రదాయకంగా వినియోగ నిబంధనలు ఎలా ఉండాలన్నది కాపీహక్కుదారులకు, లైసెన్సు పొందేవారికీ మధ్య వ్యక్తిగత ప్రాతిపదికన చర్చించి నిర్ణయించుకుంటారు. అందువల్ల సాధారణ CC లైసెన్సు ద్వారా కాపీహక్కు దారు ఏ హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారో సాధారణ ప్రజలకిఉ తెలియడంతో అటువంటి కృతులను మరింత స్వేచ్ఛగా ఉపయోగించడానికి ఈ లైసెన్సు వీలు కలిగిస్తుంది. ఆరు రకాల CC లైసెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి (అయితే వాటిలో కొన్ని పైన పేర్కొన్న నిర్వచనాల ప్రకారం, క్రియేటివ్ కామన్స్ స్వంత సలహా ప్రకారం కూడా కచ్చితంగా ఉచితమైనవి కావు). ఇవి కాపీహక్కుదారు పెట్టే షరతులపై - వారు తమ కృతికి సవరణలు చెయ్యడానికి అనుమతించారా, దానినుండి కొత్త కృతుల సృష్టిని అనుమతించారా, తమ కృతిని వాణిజ్యపరమైన వినియోగాన్ని అనుమతించారా వంటివి - ఆధారపడి ఉంటాయి. [36] 2009 నాటికి దాదాపు 13 కోట్ల మంది వ్యక్తులు అలాంటి లైసెన్సులు పొందారు. [36]

పబ్లిక్ డొమెయిన్

మార్చు

ఇతర మేధో సంపత్తి హక్కుల మాదిరిగానే కాపీహక్కు కూడా చట్టబద్ధంగా నిర్ణయించిన వ్యవధికి లోబడి ఉంటుంది. కాపీహక్కు గడువు ముగిసిన తర్వాత, అప్పటి వరకు కాపీహక్కుకు లోబడి ఉన్న కృతి పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశిస్తుంది. అనుమతి పొందకుండా, చెల్లింపులేమీ చెయ్యకుండా ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా వాడుకోవచ్చు. అయితే, చెల్లింపుల పబ్లిక్ డొమైన్లలో వినియోగదారులు ప్రభుత్వానికో, రచయితల సంఘానికో రాయల్టీలు చెల్లించవలసి ఉంటుంది. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలలోని న్యాయస్థానాలు ఉమ్మడి చట్టం కాపీహక్కు సిద్ధాంతాన్ని తిరస్కరించాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్న కృతులకు, పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న కృతులకూ ఉన్న తేడాలను గ్రహించాలి, అవి రెండూ ఒకటే కాదు. ఉదాహరణకు, ఇంటర్నెట్‌లో ప్రచురించిన కృతులు పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి గానీ, సాధారణంగా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నట్లు కాదు. అటువంటి రచనలను కాపీ చేస్తే, కర్తకు ఉన్న కాపీహక్కు‌ను ఉల్లంఘించినట్లు కాగలదు.

ఇవి కూడా చూడండి

మార్చు

 

మూలాలు

మార్చు
  1. "Definition of copyright". Oxford Dictionaries. Archived from the original on 29 September 2016. Retrieved 20 December 2018.
  2. Nimmer on Copyright, vol. 2, § 8.01.
  3. "Intellectual property", Black's Law Dictionary, 10th ed. (2014).
  4. 4.0 4.1 "Understanding Copyright and Related Rights" (PDF). www.wipo.int. p. 4. Retrieved 6 December 2018.
  5. Stim, Rich (27 March 2013). "Copyright Basics FAQ". The Center for Internet and Society Fair Use Project. Stanford University. Retrieved 21 July 2019.
  6. Daniel A. Tysver. "Works Unprotected by Copyright Law". Bitlaw.
  7. Lee A. Hollaar. "Legal Protection of Digital Information". p. Chapter 1: An Overview of Copyright, Section II.E. Ideas Versus Expression. Archived from the original on 2020-10-28. Retrieved 2022-10-05.
  8. Copyright, University of California, 2014, retrieved 15 December 2014
  9. "Journal Conventions – Vanderbilt Journal of Entertainment & Technology Law". www.jetlaw.org.
  10. "Copyright Basics" (PDF). www.copyright.gov. U.S. Copyright Office. Retrieved 20 February 2019.
  11. 12.0 12.1 "Berne Convention for the Protection of Literary and Artistic Works Article 5". World Intellectual Property Organization. Archived from the original on 11 September 2012. Retrieved 18 November 2011.
  12. Garfinkle, Ann M; Fries, Janet; Lopez, Daniel; Possessky, Laura (1997). "Art conservation and the legal obligation to preserve artistic intent". JAIC 36 (2): 165–179.
  13. "International Copyright Relations of the United States", U.S. Copyright Office Circular No. 38a, August 2003.
  14. Parties to the Geneva Act of the Universal Copyright Convention Archived 25 జూన్ 2008 at the Wayback Machine as of 1 January 2000: the dates given in the document are dates of ratification, not dates of coming into force. The Geneva Act came into force on 16 September 1955, for the first twelve to have ratified (which included four non-members of the Berne Union as required by Art. 9.1), or three months after ratification for other countries.
  15. 165 Parties to the Berne Convention for the Protection of Literary and Artistic Works Archived 6 మార్చి 2016 at the Wayback Machine as of May 2012.
  16. MacQueen, Hector L; Charlotte Waelde; Graeme T Laurie (2007). Contemporary Intellectual Property: Law and Policy. Oxford University Press. p. 39. ISBN 978-0-19-926339-4.
  17. 17 U.S.C. § 201(b); Cmty. for Creative Non-Violence v. Reid, 490 U.S. 730 (1989)
  18. Community for Creative Non-Violence v. Reid
  19. Stim, Rich (27 March 2013). "Copyright Ownership: Who Owns What?". The Center for Internet and Society Fair Use Project. Stanford University. Retrieved 21 July 2019.
  20. Intellectual property and information wealth: copyright and related rights. Westport, Connecticut, USA: Praeger. 30 December 2006. ISBN 978-0-275-98882-1. Praeger is part of the Greenwood Publishing Group. Hardcover. Possible alternative ISBN 978-0-275-98883-8.
  21. Understanding Copyright and Related Rights. WIPO. ISBN 9789280528046.
  22. Express Newspaper Plc v News (UK) Plc, F.S.R. 36 (1991)
  23. "Subject Matter and Scope of Copyright" (PDF). copyright.gov. Retrieved 4 June 2015.
  24. 26.0 26.1 26.2 "World Intellectual Property Organisation (WIPO)" (PDF). 20 April 2019.
  25. "THE MUTILATED WORK" (PDF). Copyright User.
  26. "authors, attribution, and integrity: examining moral rights in the united states" (PDF). U.S. Copyright Office. April 2019.
  27. Dalmia, Vijay Pal (14 December 2017). "Copyright Law In India". Mondaq.
  28. "(2012) Copyright Protection Not Available for Names, Titles, or Short Phrases U.S. Copyright Office" (PDF).
  29. "US CODE: Title 17,107. Limitations on exclusive rights: Fair use". .law.cornell.edu. 20 May 2009. Retrieved 16 June 2009.
  30. "Chapter 1 – Circular 92 – U.S. Copyright Office". www.copyright.gov.
  31. "Copyright (Visually Impaired Persons) Act 2002 comes into force". Royal National Institute of Blind People. 1 January 2011. Archived from the original on 7 సెప్టెంబరు 2009. Retrieved 11 August 2016.
  32. 35.0 35.1 "Creative Commons Website". creativecommons.org. Retrieved 24 October 2011.
  33. 36.0 36.1 Rubin, R. E. (2010) 'Foundations of Library and Information Science: Third Edition', Neal-Schuman Publishers, Inc., New York, p. 341