నాగాయలంక

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, నాగాయలంక మండల గ్రామం
(Nagayalanka నుండి దారిమార్పు చెందింది)

నాగాయలంక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా నాగాయలంక మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2636 ఇళ్లతో, 9321 జనాభాతో 1260 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4851, ఆడవారి సంఖ్య 4470. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 867 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 227. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589778[3]

నాగాయలంక
పటం
నాగాయలంక is located in ఆంధ్రప్రదేశ్
నాగాయలంక
నాగాయలంక
అక్షాంశ రేఖాంశాలు: 15°56′57.408″N 80°55′4.764″E / 15.94928000°N 80.91799000°E / 15.94928000; 80.91799000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంనాగాయలంక
విస్తీర్ణం12.6 కి.మీ2 (4.9 చ. మై)
జనాభా
 (2011)[2]
9,321
 • జనసాంద్రత740/కి.మీ2 (1,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,851
 • స్త్రీలు4,470
 • లింగ నిష్పత్తి921
 • నివాసాలు2,636
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521120
2011 జనగణన కోడ్589778

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉంది.సమీప జూనియర్ కళాశాల అవనిగడ్డలోను, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

మారుతీ పాలిటెక్నిక్

మార్చు

బి.సి.బాలికల వసతిగృహం

మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

మార్చు

ఈ పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ తలశిల ప్రభాకరరావు, ఈ పాఠశాలలో చదివే విద్యార్థుల సౌకర్యార్ధమై, పాఠశాల ఆవరణలో ఒక భోజనశాల ఏర్పాటు కొరకు, 40 లక్షల రూపాయలను వితరణగా అందజేసినారు. ఈ భవన నిర్మాణం 2015,జూన్-29వ తేదీ నాడు ప్రారంభించారు. ఈ భోజనశాల (ఆడిటోరియం) లో, ఒకేసారి 1000 మందితో సమావేశం నిర్వహించేటందుకు వీలుగా ఉండును.

విద్యభారతి

మార్చు

ఆంగ్ల మాధ్య పాఠశాల.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

నాగాయలంకలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఏడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

నాగాయలంకలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

నాగాయలంకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1088 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 3 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 54 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 8 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 100 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 18 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 90 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

నాగాయలంకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 90 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

నాగాయలంకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, మినుము

గ్రామ చరిత్ర

మార్చు

పూర్వము నాగాయలంక ఒక దట్టెమయిన అటవి ప్రదేశం'నాగయ్య అనే వ్యక్తి ద్వారా గ్రామానికి ఆ పేరు వచ్చింది.

మౌలిక సదుపాయాలు

మార్చు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మార్చు
  • ఈ కేంద్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో, రికార్డుస్థాయిలో 165 ప్రసవాలు నిర్వహించారు. దీనితోపాటు ఆసుపత్రి సిబ్బంది కుటుంబసంక్షేమ కార్యక్రమాలలో చేసిన కృషికి గుర్తింపుగా, జిల్లాస్థాయిలో పురస్కారం లభించింది. 2015-16 సంవత్సరంలో ఇప్పటికి 49 ప్రసవాలు చేసారు. ఈ సంవత్సరం, వీరి లక్ష్యం=200.
  • ఈ కేంద్రంలో ఆయుష్ ఆధ్వర్యంలో నడిచే హోమియో వైద్యశాల ఉంది.

త్రాగు/సాగునీటి సౌకర్యం

మార్చు

ఈ గ్రామములో 15,000 మందికి దాహార్తిని తీర్చే రక్షిత మంచినీటి చెరువు ఉంది.

గ్రామ పంచాయితీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శీలి రాము, 111 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.[4] ఈ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో, నూతన భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిదులు మంజూరయినవి. దీనిలో 13.5 లక్షలు ప్రభుత్వ నిధులు, 1.5 లక్షలు పంచాయతీ నిధులు, మిగతా 5 లక్షలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు. ఈ నిధులతో నూతన భవన నిర్మాణం చేపట్టినారు. [22]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

మార్చు

ఈ గ్రామంలో వేంచేసియున్న తలశిలవారి గంగానమ్మ జాతరమహోత్సవాలు. 2014,మే-25 ఆదివారం, 26 సోమవారం, రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయం వద్ద జాతర నిర్వహించి, అనంతరం అమ్మవారి ఘటాలతో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి తెల్లవార్లూ, అమ్మవారిని అశ్వవాహనంపై ఊరేగించారు. సోమవారం ఉదయం పోతురాజుస్వామివారికి చద్ది నైవేద్యం, గంగానమ్మ తల్లికి పాలపొంగళ్ళు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన తలశిల వంశస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక జాతర మహోత్సవం, 2014, జూలై-19 శనివారం నాడూ మరియూ 20వ తేదీ ఆదివారం నాడు, ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించగా, స్వామివారి ఘటాలకు అడుగడుగునా వార పోయుచూ మహిళలు స్వాగతం పలికినారు. ఆదివారం నాడు ఆలయం వద్ద చద్ది నైవేద్యాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9 గంటల నుండి, భక్తులు పెద్ద సంఖ్యలో చద్ది నైవేద్యాలతో ఆలయానికి తరలివచ్చి, స్వామివారికి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.

శ్రీ ప్రసన్న గణపతి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక నవరాత్రులు, 58 సంవత్సరాల నుండి, ప్రతి సంవత్సరం 18 నుండి 23 రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసే నవరాత్రి పందిరిలో, ప్రతి నిత్యం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐకమత్యంతో నిర్వహించెదరు. ఈ పందిరి ఎంతోమంది హరికథా భాగవతార్లకు, బుర్రకథ కాళాకారులకూ ప్రోత్సాహానిచ్చుచూ ముందుకు సాగుచున్నది. రాష్ట్రంలోనే ప్రముఖ హరికథా విద్వాంసులైన శ్రీ అమ్ముల విశ్వనాథం, శ్రీ కడలి వీరదాసు, శ్రీమతి ఎం.లలితకుమారి, శ్రీ కోట సచ్చిదానందశాస్త్రి తదితరులు నాగాయలంక పందిరిలో తమ హరికథా గానాన్ని అందించడం గౌరవంగా భావించెదరు. బుల్లితెర, సినిమాల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ, నేటికీ ఇక్కడ నిర్వహించే హరికథ, బుర్రకథలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. వీటికితోడు, సామూహిక కుంకుమపూజలు, సామూహిక సరస్వతీ వ్రతాలు, అనఘాష్టమి వ్రతాలు మొదలగు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పందిరిలో ప్రతి నిత్యం జరగడం ఇక్కడి ప్రత్యేకత.

శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం

మార్చు
  • ఈ అలయం నాగాయలంకలో, కృష్ణానది ఒడ్డున వేంచేసియున్న రామపాదక్షేత్రంలో ఉంది.
  • ఈ అలయంలో, 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు కార్తీకమాస పూజలను పునఃప్రారంభించారు.
  • ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణం, 2016,మే-21వ తేదీ శనివారం, వైశాఖ పౌర్ణమినాడు కన్నులపండువగా నిర్వహించారు.

శ్రీ రామపాద క్షేత్ర ఆలయాలు

మార్చు

నాగాయలంక లాంచీలరేవద్ద ఉన్న శ్రీ రామపాద క్షేత్రంలోని ఈ పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం, 50 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టబోవు పనులకు, 2015,నవంబరు-20వ తేదీ శుక్రవారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు:-

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయ ప్రాంగణంలో, శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి జీవ శిల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు ప్రారంభమైనవి. సాయంత్రం 6 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణలమధ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి అంకురార్పణ చెసినారు. ఈ సందర్భంగా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో, 10 మంది వేదపండితులు, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అజస్ర దీపారాధన, రక్షాబంధనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 10వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు అగ్నిమథనంతో శాంతిహోమం, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. మహిళలు స్వామివారిని జాలాధివాసానికి ఊరేగింపుగా తీసుకొనివెళ్ళినారు. 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ

శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం

మార్చు

శ్రీ శివనాగరాజస్వామివారి ఆలయం

మార్చు

నాగాయలంక మండలపరిధిలోని మర్రిపాలెం-నంగేగడ్డ శివారు, శివనాగపురంలో వేంచేసియున్న ఈ ఆలయ 24వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని, 2015,మే నెల-14వ తేదీ గురువారంనాడు, శివపార్వతీ కళ్యాణం, వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆలయం

మార్చు

నాగాయలంక గ్రామములోని సబ్బినేనివారి ఇలవేలుపు శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పటాలను నాగాయలంకలో గ్రామోత్సవం నిర్వహించి, ఆదివారం రాత్రి, సబ్బినేనివారి గృహాలనుండి, అమ్మవారి సారెలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పలువురు సబ్బినేని కుటుంబీకులు పాల్గొన్నారు.

శ్రీ దుర్గామాత ఆలయం

మార్చు

ఈ ఆలయం స్థానిక లాంచీల రేవు వద్ద ఉంది.

ఏకలవ్యుని విగ్రహం

మార్చు

నాగాయలంక గ్రామములో, 2017, జూన్-29న ఏకలవ్యుని విగ్రహం ఆవిష్కరించారు.

ప్రధాన వృత్తులు

మార్చు

నాగాయలంక ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, మత్స్య సాగు మీద అధారపడి జీవిస్తున్నారు.

గ్రామములో జన్మించిన ప్రముఖులు

మార్చు
  • మండలి బుద్ధ ప్రసాద్
  • కీ.శే.కావూరి వెంకటరామయ్య:- వీరు ఉపాధ్యాయులుగా పనిచేయుచూనే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. వీరి సతీమణి కావూరి సావిత్రమ్మ కృషి గూడా అమోఘం. ఆ ఉద్యమంలో మహిళలను కలుపుకొని ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అంతటి పోరాటం చేసి గూడా ఆమె ఎలాంటి ప్రచారాన్నీ కోరుకోలేదు.
  • తలశిల ప్రభాకరరావు:- ఈ గ్రామంలో జన్మించిన వీరు, స్వశక్తితో వ్యాపరవేత్తగా ఎదిగి, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పలు వ్యాపారాలు నిర్వహించుచూ, ఎంతోమందికి జీవనోపాధి కలిగించుచున్నారు. వీరు రెండుదశాబ్దాల క్రితమే గ్రామాన్ని వీడినా స్వగ్రామంపై మక్కువతో, గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినారు. మొదటగా గ్రామంలోని పాఠశల ఆవరణలో 45 లక్షలు వెచ్చించి ఒక అడిటోరియం నిర్మించుచున్నారు. ఇదిగాక, తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రామములో ఏర్పాటు చేయుచున్న కళ్యాణమంటపం నిర్మాణానికి తన నాయనమ్మ, తాతయ్యల పేరుమీద 32 లక్షల రూపాయలను విరాళంగా అందజేసినారు.

గ్రామ విశేషాలు

మార్చు
  • దివిసీమలో నాగాయలంక ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం.
  • మేడా శివనాగప్రసాదు :- నాగాయలంక గ్రామానికి చెందిన వీరు, గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన బ్యాండ్ మింటను పోటీలకు మ్యాచ్ కంట్రోలరుగా, విశ్లేషకుడిగా వ్యవహరించారు. తాజాగా ఈయన 2015,ఫిబ్రవరి-25 నుండి నెదర్లాండు దేశంలో నిర్వహించే డచ్-జెర్మన్ ఓపెన్ పోటీలకు విశ్లేషకుడిగా నియమింపబడినారు.
  • తలశిల జనార్ధనరావు :- ఈ గ్రామానికి చెందిన వీరు రాజమండ్రి, నాగాయలంక ప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. హైదరాబాదులోని మియపూర్ కేంద్రంగా పనిచేయుచున్న "ధర్మపురి క్షేత్ర ట్రస్ట్ బోర్డ్" అను సంస్థ, వీరికి కర్షకరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలనుండి 108 మంది రైతులను ఈ పురస్కారానికి ఎంపికచేయగా, వారిలో శ్రీ జనర్ధనరావు ఒకరు. ఈ పురస్కారాన్ని వీరికి, మాజీమంత్రి శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ట్రస్టీ శ్రీమతి జి.సత్యవేణిల చేతులమీదుగా అందించారు.
  • సబ్బినేని మేఘన:- నాగాయలంక గ్రామానికి చెందిన శ్రీ సబ్బినేని శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నంలోని ఎన్.టి.టి.పి.ఎస్.లో ఎ.డి.యి.గా విధులు నిర్వహించుచున్నారు. వీరి కుమార్తె మేఘన, క్రికెట్టులో శిక్షణ పొంది ఆ క్రీడలో రాణించుచున్నది. తాజాగా ఈమె ఇంటర్ స్టేట్ మీట్ లో పాల్గొని తన ప్రతిభతో ఐదు సెంచరీలు చేసి, భారత మహిళా క్రికెట్టు జట్టులో స్థానం సంపాదించింది. ఇంతవరకు వి.స్నేహదీప్తి, ఆర్.కల్పన అను ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారత మహిళా క్రికెట్టు జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈమె, ఆ ఘనత సాధించిన మూడవ క్రీడాకారిణి.
  • మండవ వెంకటరామయ్య ఛారిటబుల్ ట్రస్ట్ :- శ్రీ మండవ బాబూరావు, ఈ ట్రస్ట్ అధ్యక్షులు. ఈ ట్రస్ట్ తరఫున వీరు ఈ గ్రామంలో వేసవికాలంలో, 11 సంవత్సరాల నుండి వరుసగా చలివేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇంతేగాక వీరు ఈ గ్రామాభివృద్ధికోసం పలు సేవాకార్యక్రమాలను నిర్వహించుచున్నారు.
  • మత్స్య వనరుల కేంద్రం గుంటూరు కృష్ణా జిల్లాల మత్స్యకారులకు ప్రయోజనకారిగా ఉండేటందుకు వీలుగా నాగాయలంకలోని పడవల రేవువద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేసేటందుకు అధికారులు ప్రతిపాదనలు పంపినారు. ఈ కేంద్రానికి తరచుగా పెద్ద బోట్లు వస్తున్న విషయాన్ని పరిగణనలోనికి తీసికొని ఇక్కడ జలవనరుల కేంద్రాన్ని, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావించుచున్నారు. పడవలరేవు సమీపంలోనే ఐస్ పరిశ్రమలు, కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ఏరాటై ఉన్నందున మినీ హర్బర్ తరహాలో ఈ రెండు కేంద్రాలను ఏర్పాటుచేయాలని భావించుచున్నారు.

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. http://www.onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Nagayalanka. {{cite web}}: Missing or empty |title= (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ ఆగష్టు 1, 2013. 2వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగాయలంక&oldid=4257542" నుండి వెలికితీశారు