అంతకు ముందు... ఆ తరువాత...

అంతకుముందు... ఆ తరువాత... 2013 లో విడుదలై విజయం సాధించిన తెలుగు చిత్రం. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, ఇషా జంటగా దామోదర్‌ప్రసాద్ నిర్మించారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ప్రేమకథా చిత్రం అంతకు ముందు ఆ తర్వాత. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, ఈశ, రావు రమేశ్, రోహిణి, రవిబాబు, మధుబాల ముఖ్యపాత్రలు పోషించగా కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని అందించారు. 2013 ఆగస్టు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల మరియూ ప్రేక్షకుల విశేషాదరణ చూరగొని భారీ విజయం సాధించింది.

అంతకు ముందు ఆ తర్వాత
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాణం కె.ఎల్. దామోదర ప్రసాద్
కథ ఇంద్రగంటి మోహన కృష్ణ
చిత్రానువాదం ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం సుమంత్ అశ్విన్,
ఈశ,
రావు రమేశ్,
రోహిణి,
రవిబాబు,
మధుబాల,
ఝాన్సీ (నటి)
సంగీతం కళ్యాణీ మాలిక్
నేపథ్య గానం కళ్యాణీ మాలిక్,
హేమచంద్ర,
శ్రీకృష్ణ,
కాళభైరవ,
కోగంటి దీప్తి,
టి. ప్రశాంతి,
సునీత
నృత్యాలు నోబుల్,
సుచిత్ర
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి,
అనంత శ్రీరామ్,
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
సంభాషణలు ఇంద్రగంటి మోహన కృష్ణ
ఛాయాగ్రహణం పి.జి. విందా
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్
పంపిణీ శ్రీ రంజిత్ మూవీస్
భాష తెలుగు
అంతకుముందు... ఆ తరువాత...లో దృశ్యం

ఉత్తమ కథా రచయిత , ఇంద్రగంటి మోహన కృష్ణ, నంది పురస్కారం

కథ మార్చు

23 ఏళ్ల కుర్రాడు ఓ ఫంక్షన్‌లో అమ్మాయిని చూసీ చూడగానే మనసు పారేసుకుంటాడు. తను కూడా ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. కానీ ఏవో కన్‌ఫ్యూజన్లు. ఈ ప్రేమ జీవితాంతం ఇంతే ఫ్రెష్‌గా, క్వాలిటీగా ఉంటుందా? ప్రేమలో ఉండగా రంగు రంగుల సీతా కోకచిలుకలా ఉండే జీవితం పెళ్ళి కాగానే గొంగళిపురుగులా కనిపిస్తుందా? అని రకరకాల సందేహాలు. దీనికి పరిష్కారం ఏంటి? అబ్బాయికో ఐడియా వస్తుంది. ఇద్దరం రెండు నెలల పాటు భార్యాభర్తలుగా సహజీవనం చేద్దామంటాడు. ఆ అమ్మాయి భయపడుతూ, ఇబ్బందిపడుతూనే ఒకే అంటుంది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ప్రణయం. సెకండాఫ్ ఏమో సహజీవనం. ఫైనల్‌గా ఈ జంట ఏం తెలుసుకున్నారు? ఏం తేల్చుకున్నారన్నదే మిగిలిన కథ.

నటులు మార్చు

తారాగణం మార్చు

సాంకేతికత మార్చు

  • కళ్యాణి కోడూరి - రీరికార్డింగ్
  • పీజీ విందా - ఫొటోగ్రఫీ
  • దామోదర ప్రసాద్ - నిర్మాత

సంగీతం మార్చు

కళ్యాణీ మాలిక్ ఈ సినిమాకి సంగీతం అందించారు. హైదరాబాదులో 2013 మే 30న మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.

పాట గానం రచన నిడివి
గమ్మతుగా ఉన్నది హేమచంద్ర, కోగంటి దీప్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి 4:09
హేయ్ కనిపెట్టేశా కాళభైరవ, శ్రవంతి అనంత శ్రీరామ్ 3:13
తేనెముల్లులా కళ్యాణీ మాలిక్, శ్రవంతి సిరివెన్నెల సీతారామశాస్త్రి 3:52
నేనేనా ఆ నేనేనా శ్రీకృష్ణ, సునీత సిరివెన్నెల సీతారామశాస్త్రి 3:46
తమరితోనే కళ్యాణీ మాలిక్, సునీత అనంత శ్రీరామ్ 4:04
ఏ ఇంటి అమ్మాయివే హేమచంద్ర అనంత శ్రీరామ్ 4:29
నా అనురాగం కళ్యాణీ మాలిక్, టి. ప్రశాంతి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 3:08

విమర్శకుల స్పందన మార్చు

అంతకు ముందు ఆ తర్వాత సినిమాకి విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభించింది. 123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "అంతకు ముందు ఆ తరువాత ఒక మంచి, ఆలోచింపజేసే ప్రేమ కథా చిత్రం. ఈ సినిమాలో మొదటి భాగం వచ్చే సున్నితమైన సన్నివేశాలు యువకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాలో లోపాలు లేవని కాదు. కానీ సినిమాలో వచ్చే చమత్కారమైన డైలాగ్స్ క్లాస్ పెర్ఫార్మెన్స్, కొన్ని ఆలోచింపజేసే సన్నివేశాలు, చివర్లో తీసిన సీన్స్ మంచి ఫీల్ ను కలుగజేస్తాయి. ఇది చూడవలసిన సినిమా" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇచ్చారు.[1] వన్ ఇండియా వారు తమ సమీక్షలో "సినిమా చూడకముందు..సినిమా చూసాక ...ప్రేక్షకుడు పరిస్ధితి ఏమిటన్న విషయమై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పక్కా మాస్ మసాలా చిత్రాలు,ప్యూర్ కామెడీలు వస్తున్న ఈ టైమ్ లో ఈ ప్రయత్నం మంచిదే కానీ...అది కొన్ని వర్గాలకే పరిమితం అయ్యేలా ఉంది. కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రం ఓ మంచి ఆప్షన్" అని వ్యాఖ్యానించారు.[2] సినీఅవుట్లుక్.కామ్ వారు తమ సమీక్షలో "ఇంద్రగంటి చిత్రాలు మనం చూస్తే చాల వరకు మానవత విలువలకు అద్దం పట్టేలా ఉంటాయి. అలాగే ఈ చిత్రం లో కూడా తన మార్క్ ని మరో సారి ప్రేక్షకులకు రుచి చూపించాడు. కొన్ని సీన్స్ బోర్ కొట్టించిన చివరికి ఒక మంచి చిత్రం చూసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రాణం పోసిందని చెప్పాలి. కేవలం మల్టీ థియేటర్స్ ఆడియన్స్ కాకుండా అందరు చూడాల్సిన చిత్రం" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[3] సాక్షి దినపత్రిక తమ సమీక్షలో "వినగానే రెగ్యులర్ స్టోరీ కాదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ రెండు నెలల సహజీవనం కాన్సెప్ట్ అంటేనే, మన థాట్స్ ఎటెటో వెళ్లిపోవడం, బోలెడంత రొమాన్స్‌ని ఆశించడం సహజం. కానీ ఇంద్రగంటి ఈ కథను డీల్ చేసిన విధానం ఎక్స్‌లెంట్. ఇంతటి గంభీరమైన, సంప్రదాయ విరుద్ధమైన కథాంశాన్ని చాలా హోమ్లీగా, లవ్లీగా, సెన్సిబుల్‌గా, క్లీన్‌గా చూపించాడు. సినిమా చూసిన తర్వాత కూడా... కూల్" అని వ్యాఖ్యానించారు.[4] నమస్తేఅమెరికా.కామ్ వారు తమ సమీక్షలో "మోహనకృష్ణ ఇంద్రగంటి సాహసం చేశారు. తన మార్కు క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు మంచి సినిమాను అందించారు. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా చెప్పదలుచుకున్న పాయింట్ మీదే సాగే ఈ సినిమాకు నటీనటుల ప్రతిభ, చక్కటి సంగీతం, ఫొటోగ్రఫీ తోడై మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు మిగిలింది. అక్కడక్కడా కొన్ని మైనస్ లను పక్కనబెడితే ‘అంతకుముందు ఆ తరువాత‘ చూడదగ్గ చిత్రం అనడంలో సందేహం లేదు. చాన్నాళ్లుగా మంచి సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమా వైపు చూడొచ్చు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[5]

మూలాలు మార్చు

  1. "సమీక్ష : అంతకు ముందు ఆ తరువాత – ఆలోచింపజేసే ప్రేమ కథ". 123తెలుగు.కామ్. Archived from the original on 2013-08-27. Retrieved ఆగస్టు 23, 2013.
  2. "అంతకు ముందు ఆ తరువాత రివ్యూ". వన్ ఇండియా. Retrieved ఆగస్టు 23, 2013.[permanent dead link]
  3. "రివ్యూ : అంతకు ముందు ఆ తరువాత". సినీఅవుట్లుక్.కామ్. Archived from the original on 2013-09-07. Retrieved ఆగస్టు 23, 2013.
  4. "'అంతకు ముందు, ఆతరువాత' సినిమా రివ్యూ". సాక్షి దినపత్రిక. Retrieved ఆగస్టు 23, 2013.
  5. "'అంతకుముందు.. ఆ తరువాత' రివ్యూ". నమస్తేఅమెరికా.కామ్. Archived from the original on 2013-08-29. Retrieved ఆగస్టు 23, 2013.

బయటి లింకులు మార్చు