ప్రధాన మెనూను తెరువు

1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు (Ambati Thirupathi Rayudu) క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మరియు సెంచరీ పూర్తిచేశాడు. 2005-06 సీజన్‌లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున కూడా ఆడినాడు.

అంబటి తిరుపతి రాయుడు
Ambati Rayudu.jpg
అంబటి రాయుడు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు అంబటి తిరుపతి రాయుడు
జననం (1985-09-23) 1985 సెప్టెంబరు 23 (వయస్సు: 33  సంవత్సరాలు)
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
బ్యాటింగ్ శైలి కుడి చేతి బ్యాట్స్ మన్
బౌలింగ్ శైలి రైట్ ఆర్మ్ , ఆఫ్ స్పిన్
పాత్ర బ్యాట్స్ మన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2001/02–2009/10 హైదరాబాద్
2005/06 ఆంధ్రా క్రికెట్ టీమ్
2010/11–present బరోడా క్రికెట్ టీమ్
2007/08 హైదరాబాద్ హార్సెస్
2010–present ముంబై ఇందియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ FC List A T20
మ్యాచులు 63 45 50
సాధించిన పరుగులు 3754 1335 1128
బ్యాటింగ్ సగటు 42.17 32.56 24.52
100 పరుగులు/50 పరుగులు 9/19 1/11 0/8
ఉత్తమ స్కోరు 210 117 75*
వేసిన బాల్స్ 660 216
వికెట్లు 9 8
బౌలింగ్ సగటు 47.88 25.25
ఇన్నింగ్స్ లో వికెట్లు 0 0
మ్యాచులో 10 వికెట్లు 0 n/a n/a
ఉత్తమ బౌలింగు 4/43 4/45
క్యాచులు/స్టంపింగులు 48/– 19/– 26/3
Source: Cricinfo, 10 October 2011

రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించి 305 పరుగుల పక్ష్యఛేధనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకు క్రితం మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి అందులోనూ భారత జట్టు లక్ష్యసాధనకు తోడ్పడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఎంపికైన భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు.[1]

మూలాలుసవరించు

  1. ఎడిటర్ (07-01-2015). "ప్రపంచకప్పుకు అంబటిరాయుడు ఎంపిక". సాక్షి. Retrieved 7 January 2015. Check date values in: |date= (help)

బయటి లింకులుసవరించు