అగ్గిపిడుగు
ఇది 1964లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. 'సయామీస్ ట్విన్స్' (ఒకే లక్షణాలున్న, ఒకే భావాలు ఏకకాలంలో కలిగే కవలలు) అయిన ఇద్దరు రామారావుల (ద్విపాత్రాభినయం) కథ. మిగతా కథ విఠలాచార్య మిగతా చిత్రాలవంటిదే. చక్కటి సంగీతం, హాస్యం, గుర్రపు స్వారీలతో చిత్రం సాగుతుంది. (నాగార్జున చిత్రం హలో బ్రదర్ ఇదేతరహా కథ. అయితే హలో బ్రదర్ జాకీచాన్ చిత్రం ట్విన్స్ ఆధారంగా తీశారు.
అగ్గిపిడుగు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. విఠలాచార్య |
---|---|
నిర్మాణం | బి. విఠలాచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, చిత్తూరు నాగయ్య, రాజనాల, సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజశ్రీ, జయంతి |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి |
గీతరచన | సి. నారాయణరెడ్డి , జి. కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఎవరనుకున్నావే ఏమనుకున్నావే - సుశీల, ఎస్. జానకి , రచన: సి నారాయణ రెడ్డి
- ఏమోఏమో ఇది నాకేమో ఏమో - ఎస్. జానకి, ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.
- కన్నుకన్నుచేర పున్నమి వెన్నెలేరా చిన్నబోవనేర - ఎస్. జానకి, రచన: జి కృష్ణమూర్తి
- నీ చిన్నదానను నేనే నీ చేతి వీణను నేను - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: సి నారాయణ రెడ్డి
- తప్పంటావా నా తప్పంటావా తెలియని ప్రేమకు - ఎస్. జానకి , రచన: సి నారాయణ రెడ్డి
- లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు - ఘంటసాల,ఎస్. జానకి . రచన. జీ కృష్ణమూర్తి.
- ఏమో ఏమో ఇది నాకేమో ఏమో ఐనది , ఎస్.జానకి , రచన: సి. నారాయణ రెడ్డి.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు
- [1] Archived 2010-09-13 at the Wayback Machine