రాజన్ - నాగేంద్ర
రాజన్ - నాగేంద్ర దక్షిణ భారతానికి చెందిన సంగీత దర్శకద్వయం. వీరిద్దరూ అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా చేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపుగా అన్ని సినిమాలలోని పాటలు ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.
రాజన్ - నాగేంద్ర | |
---|---|
జననం | రాజన్, నాగేంద్రప్ప 1933 (రాజన్) 1935 (నాగేంద్ర) శివరాం పేట, మైసూర్,బెంగళూరు, కర్ణాటక |
మరణం | 2020 అక్టోబరు 11 2000 నవంబరు 4 (వయసు 65) (నాగేంద్ర) | (వయసు 87) (రాజన్)
ఇతర పేర్లు | రాజన్, నాగేంద్రప్ప |
వృత్తి | సంగీత దర్శకత్వం |
భార్య / భర్త | నాగరత్న |
తండ్రి | రాజప్ప |
బాల్యం
మార్చురాజన్ (1933–2020) - నాగేంద్ర (1935–2000)[1] లు ఇద్దరూ మైసూరుకి దగ్గరలోని శివరాంపేట అనే ఊరిలో జన్మించారు. వీరి బాల్యం అంతా ఆ ఊరిలోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. అతను అప్పట్లో మూకీ సినిమాలకు సంగీతాన్నందించేవాడు. [2]ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా యీదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా హర్మోనియం, వేణువుపై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్లిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూరులో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు. నాగేంద్ర 12 ఏళ్ల వయసుకే రాజన్ అనే ఆర్కెస్ట్రాలో చేరాడు. అతనికి తొందరగానే ఆ గ్రూప్ లో పేరు వచ్చింది. కొంత కాలం తర్వాత రాజన్ వాయులీన విధ్వాంసునిగా, నాగేంద్ర జల తరంగ్ విద్వాంసునిగా గుర్తింపు పొందారు.
యవ్వనం
మార్చు1947 వ సంవత్సరంలో హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి నాగేంద్ర గొంతు విని, ఎంతో ఆనందించి ఈ అన్నదమ్ములిద్దరిని తనతో పాటు మద్రాసు తీసుకువచ్చారు. ఆయన దగ్గర ఓ తమిళ సినిమాకి పనిచేశారు. 1951 లో ఇద్దరూ మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్.కళింగరావు దగ్గర చేరారు. ఈయన దగ్గర ఎన్నో సంగీత సూత్రాలను ఆకళింపు చేసుకున్నారు. ఇలా ఓ పక్క సంగీతం నేర్చుకుంటుంటేనే ఓ పక్క మెట్రిక్ చదివేవారు.
సినీ ప్రస్థానం
మార్చు1952 వ సంవత్సరంలో "సౌభాగ్యలక్ష్మి" అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు.[3] ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 వ సంవత్సరంలో "వద్దంటే పెళ్ళి" అనే తెలుగు సినిమాద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. అలా మొదలైన వీరి సినీ జేవితం 1994 వ సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా బి.విఠలాచార్య సినిమాలు చేసినా, 1976లో పూజ అనే సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది. కన్నడ రాజ్ కుమార్తో తెలుగులో పాడించిన ఘనత ఈ సోదరులకే దక్కుతుంది. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే...1994 వ సంవత్సరంలో వచ్చిన "అ ఆ ఇ ఈ" అనే సినిమా చివరిది.
ముగింపు
మార్చునాగేంద్ర బెంగళూరులో 2000 నవంబరు 4 తేదీన పరమపదించాడు. ఇతని భార్య నాగరత్న ప్రస్తుతం మైసూర్ లో నివసిస్తున్నది. రాజన్ తన కుమారుడు ఆర్. అనంతకుమార్ తో కలసి ఇప్పటికీ సంగీత పరమైన పనిచేసేవారు.
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
మార్చుతెలుగు
మార్చు- వద్దంటే పెళ్ళి (1957)
- శ్రీకృష్ణ గారడి (1958)
- జయ విజయ (1959)
- పెళ్లి మీద పెళ్లి (1959)
- అన్నా చెల్లెలు (1960)
- కనకదుర్గ పూజా మహిమ (1960)
- వరలక్ష్మీ వ్రతం (1961)
- మదనకామరాజు కథ (1962)
- ఖైదీ కన్నయ్య (1962)
- నాగార్జున (1962)
- మాయా మోహిని (1962)
- నవగ్రహ పూజా మహిమ (1964)
- అగ్గిపిడుగు (1964)
- ఆకాశ రామన్న (1965)
- దేవుని గెలిచిన మానవుడు (1967)
- తిరుపతి క్షేత్ర మహత్యం (1978)
- Panthulamma (1978)
- ఇంటింటి రామాయణం (1979)
- సొమ్మొకడిది సోకొకడిది (1979)
- అల్లరి బావ (1980)
- తాతయ్య ప్రేమలీలలు (1980)
- నాగమల్లి (1980)
- ప్రణయ గీతం (1981)
- అద్దాల మేడ (1981)
- మా పెళ్లి కథ (విడుదల కాలేదు)
- నాలుగు స్తంభాలాట (1982)
- వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
- మంచు పల్లకి (1982)
- రాజు రాణీ జాకి (1983)
- మా ఇంటాయన కథ (1983)
- పులి బెబ్బులి (1983)
- కోటికొక్కడు (1983)
- లంకె బిందెలు (1983)
- అమ్మాయి మనసు (1983)
- మూడు ముళ్ళు (1983)
- అనురాగబంధం (1985)
- కిలాడి దొంగలు (1985)
- రెండు రెళ్ళు ఆరు (1986)
- ఆడపడుచు (1986)
- రాగలీల (1987)
- సర్దార్ ధర్మన్న (1987)
- రౌడీ పోలీస్ (1987)
- చూపులు కలసిన శుభవేళ (1988)
- అమ్మాయి మనసు (1989)
- విజయసింహ
- సీత పుట్టిన దేశం
- ప్రేమ ఖైదీ (1991)
- అప్పుల అప్పారావు (1992)
- అ ఆ ఇ ఈ (1994)
ప్రజాదరణ పొందిన పాటలు
మార్చు- ఏమో ఏమో ఇది .. నాకేమో ఏమో ఐనది... (అగ్గిపిడుగు)
- ఎన్నెన్నో జన్మలబంధం (పూజ)
- నింగీ నేలా ఒకటాయెలే (పూజ)
- పూజలు సేయా పూలు తెచ్చాను (పూజ)
- మల్లెలు పూసే వెన్నెల కాసే
- వీణ వేణువైన సరిగమ విన్నావా
- చినుకులా రాలి... (నాలుగు స్తంభాలాట (సినిమా))
- మానసవీణ మధుగీతం... (పంతులమ్మ (1978 సినిమా))
- సిరిమల్లె నీవే...విరిజల్లు కావే...వరదల్లే రావే..వలపంతి నీవే.... (పంతులమ్మ (1978 సినిమా))
- లేత చలిగాలులు (మూడు ముళ్ళు)
- నీకోసం యవ్వనమంతా (మూడు ముళ్ళు)
- నీకళ్ళలో స్నేహము.. (ప్రేమ ఖైదీ)
కన్నడ
మార్చు- సౌభాగ్యలక్ష్మి (1953) (కన్నడం)
- చంచలకుమారి (1953) (కన్నడం)
- కన్యాదాన (1954) (కన్నడం)
- రాజలక్ష్మి (1954) (కన్నడం)
- మనె తుంబెద హెణ్ణు (1958) (కన్నడం)
- అన్నపూర్ణ (1964) (కన్నడం)
- మేయర్ ముత్తణ్ణ (1969) (కన్నడం)
- కణ్ణీరు (1970) (కన్నడం)
- విజయవాణి (1976) (కన్నడం)
- పూజ (1976)
- దేవదుడ్డు (1977) (కన్నడం)
- శ్రీనివాస కల్యాణ (1977) (కన్నడం)
- శివగంగ (1992) (కన్నడం)
- అర్జున్ అభిమన్యు (1998) (కన్నడం)
- జగత్ కిలాడి (1998) (కన్నడం)
- హృదయాంజలి (1998) (కన్నడం)
- ప్రేమ ప్రేమ ప్రేమ (1999) (కన్నడం)
తమిళం
మార్చు- వీరాది వీరన్ (తమిళం)
- మధురై మణ్ణన్ (తమిళం)
- మందిరి కుమార్ (తమిళం)
మూలాలు
మార్చు- ↑ The Man Behind Evergreen Songs. The Hindu.
- ↑ "Rajan-Nagendra Childhood". tollywoodtimes.com. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 23 September 2013.
- ↑ "చినుకులా రాలి... నదులుగా సాగి". Sakshi. 2020-10-13. Retrieved 2020-11-06.