హలో బ్రదర్

1994 సినిమా

హలో బ్రదర్ 1994లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా రమ్యకృష్ణ, సౌందర్య జంటగా నటించి మంచి ప్రజాదరణ పొందిన సినిమా ఇది.[1]

‌హలో బ్రదర్
Hello Brother poster.jpg
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
రచనఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
నిర్మాతకె. ఎల్. నారాయణ
తారాగణంఅక్కినేని నాగార్జున ,
సౌందర్య ,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంఎస్. గోపాల రెడ్డి
కూర్పుకె. రవీంద్రబాబు
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1994
భాషతెలుగు

కథసవరించు

ఎస్.పి. చక్రవర్తి మిశ్రో అనే బందిపోటు దొంగను నిర్భందిస్తాడు. తప్పించుకోవడం కోసం మిశ్రో తనను తానే కాల్చుకోవడంతో పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వస్తారు. అదే సమయానికి చక్రవర్తి భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ పిల్లలిద్దరూ దగ్గర్లో ఉంటే అసంకల్పితంగా ఒకరినొకరు అనుకరిస్తారని వైద్యులు చెబుతారు. మిశ్రో చక్రవర్తి భార్త గీతను గాయపరిచి వారిలో ఒక పిల్లాడిని తీసుకుని పారిపోతాడు. చక్రవర్తి అతణ్ణి వెంబడిస్తుంటే మిశ్రో ఆ పిల్లాడిని రైలు పట్టాలపై పడుకోబెట్టేస్తాడు. చక్రవర్తి అతన్ని కాల్చి చంపుతాడు. రైలు పట్టాలపై ఉన్న బిడ్డను వేరే దంపతులు చేరదీస్తారు.

తారాగణంసవరించు

పాటలుసవరించు

  • ప్రియరాగాలే గుండె లోన పొంగుతున్న ఈ వేళ
  • కన్నెపిట్టరో కన్ను కొట్టరో
  • అబ్బా ఏందెబ్బా
  • ఎక్కండయ్యా బాబు వచ్ఛిందయ్యా బండి
  • మనసిచ్చీ ఇచ్చీ బరువాయే
  • చుక్కేసి పక్కేసి

ఇతర వివరాలుసవరించు

  1. ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు ఉండే సన్నివేశాల్లో నాగార్జునకి డూప్ గా నటుడు శ్రీకాంత్ నటించాడు.[2].1994లో విడుదలైన ‘హలో బ్రదర్‌’ సినిమా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

మూలాలుసవరించు

  1. "హలో బ్రదర్ సినిమా". iqlikmovies.com. Retrieved 27 February 2018.
  2. Andrajyothy (29 September 2021). "Hello Brother: నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా?". Archived from the original on 29 సెప్టెంబరు 2021. Retrieved 29 September 2021.