అదుర్స్ (సినిమా)

2010 సినిమా దర్శకుడు వి .వి .వినాయక్
(అదుర్స్ నుండి దారిమార్పు చెందింది)

అదుర్స్ 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. 2010 జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా 1300 తెరలమీద విడుదలైన ఈ సినిమా వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో కవచం అనే పేరుతో అనువాదం చేశారు.

అదుర్స్
దర్శకత్వంవి. వి. వినాయక్
రచనకోన వెంకట్
నిర్మాతవల్లభనేని వంశీ మోహన్
తారాగణంజూనియర్ ఎన్.టి.ఆర్
నయనతార
షీలా
మహేష్ మంజ్రేకర్
ఫిష్ వెంకట్
ఛాయాగ్రహణంఛోటా. కె. నాయుడు
కూర్పుగౌతం రాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ
13 జనవరి 2010
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్27 కోట్లు

పాటలు మార్చు

  • శివ శంభో, రచన: చంద్రబోస్, గానం. దేవిశ్రీ ప్రసాద్
  • చంద్రకళ , రచన, రామజోగయ్య శాస్త్రి, గానం. హారీహరన్, రీటా
  • పిల్లా నా వల్ల కాదు , రచన: చంద్రబోస్ , గానం.మిఖాసింగ్, సుచిత్ర
  • నీతోనే , రచన: కులశేఖర్ , గానం.కునాల్ గంజ్వలా, శ్రేయా ఘోషల్
  • చారీ, రచన: రామజోగయ్య శాస్త్రీ , గానం.జూనియర్ ఎన్ టి రామారావు, రీటా
  • అస్లం వెల్కమ్ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.బాబా సెహగల్ , ప్రియ హిమేష్
  • శివ శంభో ,(రీమిక్స్) , రచన: చంద్రబోస్, గానం.దేవిశ్రీ ప్రసాద్



కథ మార్చు

కథ ప్రారంభంలో ఒక ముసలామె కోడలు మూడోసారి కానుపులో మృత శిశువుకు జన్మనిచ్చేసరికి పక్కనే ఉన్న కవల పిల్లల్లో ఒకడిని తమ బిడ్డగా తీసేసుకుంటుంది. కవలపిల్లల్లో ఒకడైన నరసింహ మాత్రమే ఒంటరియైన తల్లి దగ్గర పెరుగుతాడు. పోలీసు కావాలనే లక్ష్యంతో పోలీసు అధికారియైన నాయక్ దగ్గర అండర్ కవర్ ఏజెంటుగా పనిచేస్తుంటాడు. మరో వైపు చారి బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతుంటాడు. అతనికి గురువైన భట్టు చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం చారిని ప్రేమిస్తుంటుంది. దానికి కారణం అదే పోలికలతో ఉన్న నరసింగ ఆమెను పోకిరీల నుండి ఆమెను రక్షిస్తూ ఉంటాడు. నరసింహ నాయక్ కూతురైన నందును ప్రేమిస్తూ ఉంటాడు. ధనరాజ్, బాబా అనే ఇద్దరు వ్యక్తులు ఒక పేరొందిన ఆర్మీ సైంటిస్ట్ కుటుంబంకోసం వెతుకుతుంటారు. ఆయనే నరసింహ తండ్రి. నరసింహను వారిద్దరూ కనిపెట్టి, నాయక్ తన కూతురు మీదున్న ప్రేమను ఆసరాగా తీసుకుని నరసింహను తమ దగ్గరికి రప్పించుకుంటారు. నరసింహ వారినుంచి తప్పించుకుంటాడు. కానీ అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి చారిని నరసింహగా నటించేందుకు ఒప్పిస్తారు.

నటీ నటులు మార్చు

ఫలితం మార్చు

రెడిఫ్ ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చింది.[1]

మూలాలు మార్చు

  1. "Adurs is NTR's show all the way". Rediff. Archived from the original on 16 జనవరి 2010. Retrieved 20 జూన్ 2020.

బయటి లింకులు మార్చు