అరవిందరాయుడు దేవినేని
దేవినేని అరవిందరాయుడు, తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఉపాధ్యాయుడు. అరవిందాలు (కవిత్వం), నానీ విహంగాలు (నానీలు) పేర్లతో తన రచనలు ప్రచురించాడు.[1] ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లోనూ కవితాసక్తిని పెంపొందిస్తున్నాడు. మోత్కూర్ కు చెందిన ప్రజాభారతి (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ)కి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[2]
అరవిందరాయుడు దేవినేని | |
---|---|
జననం | సెప్టెంబరు 22, 1966 మోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి, రచయిత |
భార్య / భర్త | సబిత |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు (నాగశ్రీజ, శివశ్రీని) |
తండ్రి | ప్రభువరరాయుడు |
తల్లి | అనసూయ |
జననం, విద్య
మార్చుఅరవిందరాయుడు 1966, సెప్టెంబరు 22న ప్రభువరరాయుడు - అనసూయ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ లో జన్మించాడు. స్వగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి చదివి, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేశాడు.
ఉద్యోగం
మార్చుగుండాల మండలంలోని పెద్దపడిశాల ఉన్నత పాఠశాలలో కొంతకాలం తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ప్రస్తుతం ఆత్మకూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఅరవిందరాయుడుకి సబితతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (నాగశ్రీజ, శివశ్రీ) ఉన్నారు
సాహిత్య ప్రస్థానం
మార్చుతెలుగు మాధుర్యం ఉట్టిపడేలా సన్మాన పత్రాలు రాయడంలో అరవిందరాయుడు ప్రతిభ కనబరిచాడు. మోత్కూర్ లోని శ్రీరామలింగేశ్వరస్వామి పేరుతో రామలింగేశ్వర శతకం రాశాడు. అరవిందాలు పేరుతో 365 ఏకవాక్య కవితలను రాశాడు. ప్రజాభారతి సాహితీ సాంస్కృతిక సేవాసంస్థకు అధ్యక్షుడిగా తన సేవలు అందించి, ఆ సంస్థ తరపున పలు కార్యక్రమాలు నిర్వహించాడు.[3]
రచనలు
మార్చు- అరవిందాలు (ఏకవాక్య ముక్తక కవితా సంపుటి): 2017 నవంబరు 16న మోత్కూర్ లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో సాహితివేత్త డా. తిరునగరి, ఉద్యమసినీ రచయిత అభినయ శ్రీనివాస్, చిత్రకారుడు రంగస్థల నటుడు దర్శకుడు ఉత్తమ గ్రామీణ విలేకరి అవార్డు గ్రహీత ఎస్.ఎన్. చారి, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పోరెడ్డి రంగయ్య పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.[4]
- నానీ విహంగాలు (నానీలు)
పురస్కారాలు, బిరుదులు
మార్చు- తెలుగు కవితా వైభవం నిర్వహించిన పోటిల్లో పాల్గొని 100 కవితలు చదివి `సహస్రవాణి శతకవితా కోకిల' బిరుదు పొందాడు.
- తెలుగు సారస్వత పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో నందిని సిధారెడ్డి చేతులమీదుగా `సహస్ర కవిమిత్ర' బిరుదు అందుకున్నాడు.[5]
గుర్తింపులు
మార్చుఅరవిందరాయుడు రాసిన నానీ విహంగాలు పుస్తకాన్ని చదివిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాయుడును అభినందిస్తూ లేఖను పంపాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్యం (6 December 2016). "హైదరాబాద్‌లో డిసెంబర్ 10న కవిసంగమం సిరీస్". lit.andhrajyothy.com. Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
- ↑ ఎస్.ఎన్., చారి (2024-07-29). "కళలకు హారతి.. ప్రజాభారతి". EENADU. Archived from the original on 2024-07-29. Retrieved 2024-07-29.
- ↑ ఆంధ్రజ్యోతి వెబ్ ఆర్కైవ్, యాదాద్రి భువనగిరి జిల్లా. "కవితారవిందుడు". Archived from the original on 30 ఆగస్టు 2017. Retrieved 22 September 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ తెలుగు వన్ ఇండియా, సాహితి (17 November 2017). "ప్రజల శ్రమ నుంచే తెలంగాణ సాహిత్యం: అరవిందాలు పుస్తకావిష్కరణలో డా. తిరునగరి". www.telugu.oneindia.com. Mittapalli Srinivas. Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
- ↑ కవితోపాధ్యాయులు, ఆంధ్రజ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లా, 2017 మే 6
- ↑ ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా (17 October 2021). "మోత్కూరు కవికి ఉపరాష్ట్రపతి అభినందనలు". EENADU. Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (16 October 2021). "కవి అరవిందరాయుడికి అభినందనలు". andhrajyothy. Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.