అల్లరి సుభాషిణి

అల్లరి సుభాషిణి (తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.[1]

అల్లరి సుభాషిణి
జననం
తిరుమల సుభాషిణి

విద్య7వ తరగతి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈవిడ స్వస్థలం భీమవరం.[2] చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో 7వ తరగతి వరకే చదువుకున్నారు. చిన్న వయస్సులో పెళ్ళి అయింది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

వృత్తి జీవితం

మార్చు

సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయంలో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి,, రజినీకాంత్ వంటి నటులతో నటించారు.[3]

నటించిన చిత్రాలు

మార్చు
 1. అల్లరి
 2. శ్రీఆంజనేయం
 3. కితకితలు
 4. అమరావతి
 5. సుడిగాడు
 6. హీరో (2008)
 7. నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ (2009)
 8. సూర్య వర్సెస్ సూర్య (2015)
 9. లవ్ స్టేట్స్ (2015)

మూలాలు

మార్చు
 1. తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్, సినిమాలు. "అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల". www.telugunris.com. Retrieved 16 September 2016.[permanent dead link]
 2. "Telugu Movie Actress Allari Subhashini". nettv4u.com. Retrieved 2021-06-21.
 3. "Allari Subhashini Telugu Movie Actress". 99doing.com. Retrieved 2021-06-21.