హీరో (2008 సినిమా)

జి. వి. సుధాకర్ నాయుడు దర్శకత్వంలో 2008లో తెలుగు యాక్షన్ కామెడీ సినిమా.

హీరో 2008, అక్టోబరు 24న విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ సినిమా.[1] మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మాణ సారథ్యంలో జి. వి. సుధాకర్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, భావన, రమ్యకృష్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాగేంద్రబాబు తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2][3][4] ఇది మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ చిత్రం మలయాళంలో పోలీస్ అకాడమీగా, హిందీలో లాడెంగే హమ్ మార్టే దమ్ తక్ (2011) పేర్లతో అనువాదం చేయబడింది.

హీరో
Hero 2008 Movie Poster.jpg
హీరో 2008 సినిమా పోస్టర్
దర్శకత్వంజి. వి. సుధాకర్ నాయుడు
స్క్రీన్ ప్లేజి. వి. సుధాకర్ నాయుడు
కథగోపి మోహన్
రవి
జి. వి. సుధాకర్ నాయుడు
నిర్మాతమన్యం రమేష్
తారాగణంనితిన్
భావన
రమ్యకృష్ణ
కోట శ్రీనివాసరావు
బ్రహ్మానందం
నాగేంద్రబాబు
ఛాయాగ్రహణంరాం ప్రసాద్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
మన్యం ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2008 అక్టోబరు 24 (2008-10-24)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

నాగేంద్ర నాయుడు (నాగేంద్ర బాబు) ధైర్యవంతుడైన పోలీసు అధికారి. అతను తన కొడుకు రాధాకృష్ణ (నితిన్) ను కూడా మంచి పోలీసు అధికారిగా చూడాలనుకుంటున్నాడు. తన కొడుకు మాఫియా డాన్ ల అంతంచూస్తే,తన చేతులతో కొడుకుకి రాష్ట్ర ప్రభుత్వ పతకాన్ని అందించాలని కలలు కంటుంటాడు. అయితే, అతని భార్య సరళ (కోవై సరళ) తన కొడుకును సూపర్ స్టార్‌గా చూడాలనుకుంటుంది. అంతలోనే నిజాయితీపరుడు ఎవరైనా పోలీసు ఉద్యోగానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఒక జివోని ప్రవేశపెడుతుంది. సినీ హీరోకి అవసరమైన శిక్షణ అంతా కేవలం మూడు నెలల వ్యవధిలో పోలీస్ అకాడమీలో నేర్చుకోవచ్చని నాగేంద్ర నాయుడు తన భార్యను ఒప్పించడంతో, కొడుకు పోలీస్ అకాడమీలో చేరడానికి సరళ అంగీకరిస్తుంది. పోలీసు అకాడమీలో చేరిన రాధాకృష్ణ అక్కడ కృష్ణవేణి (భావన) తో ప్రేమలో పడతాడు. కృష్ణవేణి కూడా రాధాకృష్ణని ప్రేమిస్తుంది. ఇదే సమయంలో, కృష్ణవేణి పెద్ద నక్సలైట్ నాయకురాలిని చెప్పి ఆమె ఫోటో టీవీలో కనిపిస్తుంది. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. కృష్ణవేణి నక్సలైట్ గా ఆరోపణ చేయబడిందా,లేదా ఆమె నిజంగా నక్సలైటా? రాధాకృష్ణ, కృష్ణవేణిల మధ్య ప్రేమ ఏమవుతుంది? తన తండ్రి నాగేంద్ర నాయుడు కలను రాధాకృష్ణ ఎంతవరకు నెరవేర్చగలిగాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సినిమా రెండవ భాగంలో తెలుస్తాయి.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

హీరో
మణిశర్మ స్వరపరచిన పాటలు
విడుదల2008
రికార్డింగు2008
సంగీత ప్రక్రియపాటలు
నిడివి27:14
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్

మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[5]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సై కుర్రాడే (రచన: అనంత శ్రీరామ్)"  రాహుల్ నంబియార్, రీటా త్యాగరాజన్ 04:27
2. "కన్నుల్లోనా (రచన: అనంత శ్రీరామ్)"  హరిచరణ్, ప్రియా హిమేష్ 04:43
3. "యాహూ యాహూ (రచన: అనంత శ్రీరామ్)"  కార్తీక్, జై 04:19
4. "కా కలవ్యే (రచన: అనంత శ్రీరామ్)"  రంజిత్, రీటా 04:30
5. "నా వయసే (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  హేమచంద్ర, గీతా మాధురి 04:30
6. "కన్నుల్లోనా (రచన: అనంత శ్రీరామ్)" (రిపీట్)హరిచరణ్, ప్రియ 04:43
27:14

మూలాలుసవరించు

  1. IMDB. "Hero 2008 Movie". www.imdb.com. Retrieved 2020-09-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Hero (2008)". Indiancine.ma. Retrieved 2020-09-09.
  3. "Nithin's 'Drona' comes on Diwali - Telugu Movie News". IndiaGlitz. 2008-10-20. Retrieved 2020-09-08.
  4. "Hero 2008 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-09.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  5. SenSongs (2018-04-07). "Hero Mp3 Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-09.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలుసవరించు