ఆంధ్రప్రదేశ్ ఎ.సి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్

(ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ లేదా ఎ.పి.ఎక్స్‌ప్రెస్ భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వరకు నడుపబడు సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఈ రైలు భారతీయ రైల్వేలతో నిర్వహింపబడింది. ఈ రైలు 20805/20806 పేరుతో పిలువబడుతోంది. ఈ సర్వీసును 2015 ఆగస్టు 12 న భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు.[2][3]

ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
స్థానికతఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
తొలి సేవఆగస్టు 12, 2015; 9 సంవత్సరాల క్రితం (2015-08-12)
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వే
మార్గం
మొదలున్యూఢిల్లీ
ఆగే స్టేషనులు19
గమ్యంవిశాఖపట్నం
ప్రయాణ దూరం2,099 కిలోమీటర్లు (1,304 మై.)*
సగటు ప్రయాణ సమయం35 hours 15 minutes
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)20805 (విశాఖపట్నం - న్యూఢిల్లీ)
20806 (న్యూఢిల్లీ - విశాఖపట్నం)
లైను (ఏ గేజు?)ఢిల్లీ - చెన్నై మార్గము
హౌరా - చెన్నై ప్రధాన మార్గము
సదుపాయాలు
శ్రేణులుAC first class, AC two tier, AC 3 tier, AC pantry
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
ఇతర సదుపాయాలుgood
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం59 km/h (37 mph) (average with halts)
మార్గపటం
Andhra Pradesh AC Express (Visakhapatnam - New Delhi) Route map

కార్యకలాపాలు

మార్చు

ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్ తో కూడుకొని ఉంది. ఇది వారంలో అన్ని దినాలలో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రయాణించి చివరకు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశింస్తుంది. ఈ రైలులో 1 ఎసి మొదటి తరాతి, 5 ఎసి టూటైర్, 7 ఎసి 3 టైర్, 1 ఎసి పాంట్రీ కార్, 2 గార్డు కం జెనెరేటర్ కార్స్ ఉన్నాయి. ఈ రైలు విశాఖపట్నం నుండి బయలుదేరి రెండవరోజు న్యూఢిల్లీకి చేరుతుంది. అదే విధంగా న్యూఢిల్లీలో బయలుదేరి రెండవ దినం విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు యొక్క సరాసరి వడి 59 కి.మీ/గంట[2]

మార్గం

మార్చు

22415 పేరుతో గల రైలు విశాఖపట్నం నుండి బయలుదేరి న్యూఢిల్లీకి చేరుతుంది. అదే విధంగా 22416 రైలు న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖపట్నం చేరుతుంది.

ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, వరంగల్, నాగ్పూర్, ఇటార్సీ జంక్షన్, భోపాల్, ఝాన్సీ రైల్వే జంక్షన్, గ్వాలియర్, ఆగ్రాగుండా ప్రయాణిస్తుంది.

ఇంజను

మార్చు

ఈ రైలు భారతీయ లోకోమోతివ్ క్లాస్ WAP-7 [LGD, TKD OR GZB] లోకోషెడ్ ను ఉపయోగించుకుని, [4] పూర్తిగా ప్రయాణం చేస్తుంది.

మూలాలు

మార్చు
  1. విశాఖ ఎపి ఎక్స్‌ప్రెస్ మొదలైంది[permanent dead link]
  2. 2.0 2.1 "New Delhi – Visakhapatnam AC AP Express Train via Vijaywada Flagged Off". Press Information Bureau, Government of India. Ministry of Railways. 12 August 2015. Retrieved 12 August 2015.
  3. "Suresh Prabhu launches new AP Express". EenaduIndia.com. New Delhi. 12 August 2015. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 12 August 2015.
  4. "Loco details". Loco Roster Database. IRFCA. Archived from the original on 2016-06-24. Retrieved 2016-05-26.